వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
పాడి పంటలు చేస్తే మంచిది.


వీలులేని వారి కోసమే ఆన్ లైన్ వ్యాపారం

ప్రకృతి పరిస్థితుల ప్రకారం అంటే నాచురల్ గా మనకు జుట్టు, గడ్డము, పెరుగుతుంది. మన బట్టలు మాసిపోతుంది. మన చెప్పులు అరిగిపోతుంది. మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం మంగలి వాళ్ళను, చాకలి వాళ్ళను, చర్మకారులను, రైతులను, వాటికీ అనుబంధ వృత్తులను పోషిస్తున్నాం. అయితే వృత్తులు కాకుండా కొన్ని ప్రవృత్తులు వుంటాయి. వాటిని చాలా వృత్తుల వారు సైడుగా అంటే హాబీగా చేసేవారు గతంలో.

వృత్తులు – ప్రవృత్తులు

వృత్తుల వలన ఆదాయం వుంటుంది. ప్రవృత్తుల వలన ఆనందం వుంటుంది. వృత్తుల వలన ఇంట్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రవృత్తుల వలన మంచి ఇంటి బయట పేరు ప్రతిష్టలు వస్తాయి. వృత్తుల వలన మంచి తల్లితండ్రులు అని అనిపించుకుంటారు. ప్రవృత్తుల వలన మంచి సేవకుడు, నాయకుడు అని అనిపించుకుంటారు.  అయితే, ప్రస్తుతం ప్రవృత్తులు కూడా వృత్తులై పోయాయి. అందులో కొన్ని వైద్యం, న్యాయం, చట్టం. ఇలా ఎన్నో . . . .గతంలోని ప్రవృత్తులు ఇప్పుడు వృత్తుల్లా వున్నాయి.

అంతే కాకుండా ప్రస్తుతం మానవుని అవసర రీత్యా ఎన్నో కొత్త వృత్తులు, ప్రవృత్తులు పుట్టుకొచ్చాయి. పైన చెప్పుకున్న మంగలి, చాకలి, చర్మకారుడు, రైతు, కుమ్మరి, కమ్మరి లాంటివారిని పోషించడానికి ఒక రీజన్ వుంది, కానీ, వైద్యులను పోషించడానికి ప్రజలకు జబ్బులు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. వివరాలకు కాబోయే డాక్టర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటన్ చూడండి. అలాగే న్యాయవాదులు బ్రతకాలంటే మానవులకు సమస్యలు రావాలి. ఎలా? అని కొందరు ప్రయోగించి విజయవంతం అవుతున్నారు. కాబోయే లాయర్లు ఎలా బ్రతకాలి? అనే బులిటెన్ చూడండి. అలాగే చట్టసభల్లో చట్టం చేసేవాళ్ళు బ్రతకాలంటే ప్రజలకు లేమి రావాలి. ఎలా అని కొందరు కొన్ని ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్నారు. 

అలాగే ప్రస్తుతం కంప్యుటర్ నాలెడ్జి, ఇంటర్నెట్ నాలెడ్జి లలో రకరకాల చదువులు చదివి మరియు ఎం.బి.ఏ లు చదివినవారు బ్రతకాలంటే ఎలా? అందులో భాగమే ఆన్ లైన్ వ్యాపారం. అందులో ఎన్నో రకాలు వున్నాయి. ఎన్నో స్థాయిల్లో వున్నాయి. ఎన్నో సంస్థలు వున్నాయి. ఇందులో వ్యాపారం చేయాలి అని స్వంతంగా ఒక ల్యాప్ ట్యాప్ కలిగివుండాలి. వర్కింగ్ క్యాపిటల్ క్రింద కనీసం 10 వేలు అయినా పెట్టుకుని వస్తువులు తీసుకుని, పిన్నులు తీసుకుని, ప్రజల వద్దకు వెళ్లి వ్యాపారం గురించి చెప్పండి. ల్యాప్ ట్యాప్ లో చూపండి. వస్తువులు అమ్మండి. కాని తప్పనిసరిగా బ్యాంకు అకౌంటు ఉన్నవారికి మాత్రం అమ్మండి. కంప్యుటర్, ఇంటర్నెట్ తెలియని వారికి కూడా అమ్మండి. కాని వారికి అన్ని, అంటే దరఖాస్తు వివరములు మీరే పూర్తి చేయండి. అంతేకాదు ప్రతినెల వారివి  అప్ డేట్ చేయండి. వ్యాపారానికి కావలసింది నమ్మకం. అది సంపాయించండి  ప్రజల దగ్గర.

నో సర్వీస్ – నో బిజినెస్

ఒక ఎల్. ఐ.సి. ఏజంటు తన పాలసీ హోల్డర్లకు ఎలాంటి సేవ చేస్తాడో అలాగే మీరు మీ కస్టమర్లకు సేవ చేయండి. వారికి కంప్యుటర్, ఇంటర్నెట్ నాలెడ్జి లేని వారు కనుక మీరు వారికి సర్వీసు చేయక పోతే వ్యాపారం మంచిగా జరగదు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *