ఊరట

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

నీకు, నాకు మాత్రమే అర్థమయ్యే
భాషలో మాట్లాడుకోవడం
నీకు, నాకు మాత్రమే
అర్థమయ్యే సంబరం

నిన్నటి అస్తమయం తర్వాత
ఏ చెట్టులో ఏ కొత్త పువ్వు
పూసిందోనని వెదుక్కునే సూరీడల్లే
నీ కొత్త కొత్త మాటల్లోని
గారడీలను వెదుక్కొంటాను

మెత్తని నీ చేతుల్లో
నా భవిష్యత్తు ఒదిగివుందని
అనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !

కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!
వ్యక్తి దూరమైన అవ్యక్త స్థితిలో
ఆలోచనల గాఢత ఎక్కువేమో !

ఐనా దూరాలకేమిలే
దూసుకుపోయే కొద్దీ కరిగిపోతాయి !

బహుశా!
మనం కలిసే క్షణం
ఆ మలుపులోనే వేచివుందేమో !

(Published on 30/10/2009 in www.aavakaaya.com)

Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *