ఉపాధ్యాయ దినోత్సవ పండుగ

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
Dr. Sarvepalli Radhakrishnan
సర్వేపల్లి రాధాక్రిష్ణన్ (5 September 1888 –1975) తాత్విక భావాలుకల వ్యక్తి. ఆయన 1962 లో President  of India గా నియమితులైనారు. కొందరు విద్యార్ధులు, స్నేహితులు ఆయన వద్దకు వచ్చి, “రాధాక్రిష్ణన్ గారూ! మీ జన్మదినమును వైభవోపేతంగా మేము నిర్వహిస్తాము” అంటూ రాధాక్రిష్ణన్ యొక్క అనుజ్ఞ కోరారు. అందుకు సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఇలాగ బదులు ఇచ్చారు:
 
”నా పుట్టిన రోజు దినమును ప్రత్యేకముగా చేస్తామని మీరందరూ అంటూన్నారు. కానీ, అందుకు  మారుగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా, ఈ పండుగను మలచ వచ్చును కదా! సెప్టెంబర్ 5 వ తేదీని ‘టీచర్స్ డే’(‘Teacher’s day’) గా ఈ పర్వదినం చేస్తే, నాకు అది ఎంతో గర్వకారణం ఔతుంది.” (“instead of celebrating my birthday separately, it would be my proud privilege if September 5th is observed as Teacher’s day”)
 
అలాగ “ఉపాధ్యాయ దినోత్సవ పండుగ” కు శ్రీకారము చుట్టినది. ఎవరి నుండీ ఎలాటి అభ్యంతరాలూ ఎదురవకుండా యావత్ భారత దేశ ప్రజలూ ఈ త్రికరణ శుద్ధితో ఆనందంగా జరుపుతున్నారు.
 
* * * * * * * * * *
 
 
సర్వేపల్లి రాధా క్రిష్ణన్ & జాన్. ఎఫ్. కెనెడీ
 
Radhakrishnan with John.F.Kennedyసర్వేపల్లి రాధా క్రిష్ణన్ యునైటెడ్ స్టేట్స్ కు మొదటిసారి వెళ్ళారు. అప్పుడు జాన్. ఎఫ్. కెనెడీ  అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. డాక్టర్ రాధాక్రిష్ణన్ అక్కడికి చేరాక సడన్ గా తుఫాను వచ్చింది. వాషింగ్టన్ లో ఒకటే కుంభ వృష్టి, అకస్మాత్తుగా  మబ్బులు కమ్ముకున్నాయి, కారు చీకటిగా ఐనది (it poured cats and dogs). విమానం నుండి దిగిన భారత రాష్ట్రపతికి, కెన్నెడీ స్వాగతపూర్వకంగా కరచాలనం చేసాడు.
 
షేక్ హాండ్ ఇస్తూ, “I”m so sorry we have such bad weather during your visit.మీ విజిట్ సమయాన వాతావరణం ఈ విధంగా బీభత్సంగా మారుతుందని అనుకోలేదు” నొచ్చుకుంటూ పలికాడు. తాత్వికవేత్త ఐన భారత దేశాధిపతి చిరు నవ్వుతో అన్నారు “మిష్టర్ ప్రెసిడెంట్! మనము కఠిన పరిస్థితులను ఎలాగూ మార్చలేము కదా! కానీ ఆ సంఘటనల పట్ల మన సానుకూల, ఆశావహ దృక్పథాన్ని మలుచుకోగలము” (“We can”t change bad things, Mr. President,” he observed. “But we can change our attitude to them.)
 
రాధాక్రిష్ణన్ ఒక సన్నివేశాన్ని విపులీకరించారు. సర్వేపల్లి రాధాక్రిష్ణన్ అంతకు మునుపు కొన్ని సంవత్సరముల పాటు ఢిల్లీలో ఉన్నారు.అక్కడ దూరదర్శన్(Television) వాళ్ళు ’మా స్టూడియోలను మీరు దర్శించవలసినది!’ అని ఆహ్వానించారు. ప్రెస్స్ లో ఒక వ్యక్తి కూర్చుని, కంపోస్ చేస్తున్నాడు. ఆ అద్భుత వ్యక్తి నాకు ఎంతో విస్మయాన్ని కలిగించాడు. ఎందుకంటే, రెండు చేతులూ లేవు. పాపం! ఒక యాక్సిడెంట్ లో అతని రెండు చేతులూ పోయాయి. ఐనప్పటికీ ఆతని ముఖం మీద చెరగని చిరునవ్వు! తన కాళ్ళతో కంపోజింగ్ జాబ్ ను సునాయాసంగా చేస్తున్నాడు. ఆతని ఆత్మ విశ్వాసంతో కూడిన ఆత్మానందమే అతడి వదనంపైన మాయని దరహాసాలను పూయిస్తూన్నది. ఉల్లాసంగా Dr. S. Radhakrishnanతో అన్నాడు కదా:
 
“నెలకు 500 రూపాయలు సంపాదిస్తున్నాను.నేను ఎవరి పైనా ఆధారపడటం లేదు; నేనెవరికీ భారం కావట్లేదు” (“I earn Rs. 500 a month. I am not a burden on anyone.”).
 
ఒక్కొక్కసారి ఇట్టి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ సైతం, జీవితంలో తటస్థ పడి, ఎంతో స్పందన కలిగించి, మనసులను ఆర్ద్ర పరుస్తాయి.వ్యక్తిత్వాలనే గాక, జీవిత లక్ష్యాలను కూడా ప్రభావితం చేస్తాయి. నిజమే!
 
“Life is a matter of habit; If you start complaining, there  is so much to complain about. It is the attitude that counts.”
 
మీరేమంటారు? సరే! సరే!అలాగే! అలగలాగే నంటారా?!
 
* * * * * * * * * *
సర్వేపల్లి రాధాక్రిష్ణన్ మృదు చమత్కారాలు
 
సర్వేపల్లి రాధా క్రిష్ణన్ సంస్కృతము, ఇంగ్లీష్, తమిళము మున్నగు అనేక భాషలపై పట్టు కలిగిన పండితుడు. ఆయన మాటలలో పాండితీ ప్రకర్ష ద్యోతకమౌతూ, పరిసరాల వారిని  ఆకట్టుకునేది. రాధాక్రిష్ణన్ సభలో ఒకరిని పరిచయం చేయాల్సివచ్చింది.
 
“సభాసదులారా! సర్ మహ్మద్ ఉస్మాన్ గారు నాకు మిక్కిలి సన్నిహితులు. కాలేజీ రోజులలో ఆయన మొదట నాకు సీనియర్. అటు పిమ్మట నాకు క్లాస్మేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన – నాకు జూనియర్.
నేను ప్రొఫెసర్ గా ఉండగా, ఆయన Vice Chancellor. నేను వైస్ ఛాన్సలర్ గా ఉండగా ఆయన ఛాన్సలర్.”
 
ఈ పలుకులలోని చిటికెడు వ్యంగ్యం అచ్చట దరహాస సౌరభాలను విరబూసినది.
 

You may also like...

Leave a Reply