తెలుగోడు-1

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

అందరికీ నమస్కారం.

నేను నిన్ననే చూసిన ఒక చిత్రం నన్ను ఈ వ్యాఖ్యానం రాయడానికి ప్రేరేపించింది.

బెంగుళూరు లో ఉన్న సవా లక్ష(లెక్క తప్పేమో, కానీయండి ఎవరు లెక్క పెట్టారు కనుక ) సాఫ్ట్వేర్ ఇంజినీర్లు లో నేను కూడా ఒకానొక చిన్న ఇంజినీర్ని. మొదట ఈ వ్యాఖ్యానం అంతా కూడా స్వచ్చమైన తెలుగు లో రాద్దాము అనుకున్నాను. కానీ నేను వచ్ఛింది ఏమో కోస్తా ఆంధ్ర గుండెకాయ విజయవాడ నుండి. ఈ కారణం చేత నేను నాకు తెలిసిన మా ప్రాంతపు బాష ని మాత్రమే వాడినట్లు అయితే “కేవలం మీరు మాట్లాడేదే తెలుగా? ” అని మన ఇతర తెలుగు పరగణాల సోదరులు నా మీదకి గులాబి దండు వారిని ఉసి కోల్పుతారు ఏమో అని భయంతో ఈ వ్యాఖ్యానాన్ని వాడుక బాషలో రాస్తున్నాను. ఏమి ఐన తప్పులు ఉన్నట్లు అయితే నాకు తెలియ పరచండి. నేను తప్పక సరిదిద్దుకుంటాను. ఇక అసలు విషయం లోకి ప్రవేశిద్దాము.

సాధారణంగా బెంగుళూరు లో ఉన్న మన ప్రతి తెలుగు వాడికి ఒక సామెత తెలిసే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న అన్ని ఏరియాస్ లోను తెలుగు సంతతి చాలా ఎక్కువ. అందులోను మారతహళ్లి(మారుతీ హళ్లి- అంటే కోతుల గుంపు, కానీ వాడుకులో ఇది మారతాల్లి గా మారిపోయింది.) ఏరియా అయితే మరో మినీ కూకటపల్లి గా ఫేమస్ చెందింది. ఈ ఏరియాలోని వారు అందరూ చెప్పే ఆ సామెత ఏంటి అంటే ఒక “రాయిని తీసుకొని పైకి వేస్తే అది పడితే కుక్క మీద అన్నా పడాలి లేదూ అంటే తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మీద నైన పడాలి”. అంతగా ఈ ఏరియా అంతా మన వాళ్ళతో నిండిపోయి ఉంది. మీరు చెపితే నమ్మరు ఏమో కానీ, ఇది పచ్చి నిజం.

ఆగండి ఆగండి అప్పుడే కంగారు పడకండి, “నువ్వు ఎత్తుకుంది ఏమి రాగం- పాడేది ఏం రాగం అని, 24643 —తకిట తకిట త ; 24648 – తకిట తకిట థీ ?”. నేను అసలు రాగం లోకి త్వరగానే ప్రవేశిస్తాను. అయితే ఈలోగా మీ అందరికి చిన్న ప్రశ్న ఏంటి అంటే నేను పైన వాడిన ఈ సెంటెన్స్ ఏ సినిమాలోనిది? దీనికి మీరు సమాదానం చెప్తే ఏమి ప్రైజ్ ఇవ్వను కానీ మీకు ఒక వీర తాడు బహుకరిస్తాను.

మరి త్వరలో మీ ముందుకి మిగతా విషయం తో కనిపిస్తాను.

You may also like...

Leave a Reply