Tagged: Telugu Short stories

1

పిచ్చి పోలి

  భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది. పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల పిల్లలని పెంచుకుంటే రోజూ వాళ్లు...

0

ఒక ఆదివారం

  చటక్కున మెలకువయింది రాఘవ్ కు. గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ చెవులు రిక్కించుకున్నాయి. స్నానాల గదిలోనుండి...

వసంత కోకిల – 2 0

వసంత కోకిల – 2

ముందుమాట బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు.  ఈ సినిమా ది  ఒక విషాదాంతం. అదే ఆధారం గా మరలా కమలహాసన్, శ్రీదేవి లను నాయకా...

శ్రమైక జీవన సౌందర్యం 0

శ్రమైక జీవన సౌందర్యం

లేస్తూనే గడియారం వంక చూసి “అప్పుడే ఏడు అయిపోయిందా!” అని నిట్టూర్చి మంచం దిగాడు శంకరం.  ఆరు రోజులు పనిచేస్తే ఒక రోజు సెలవు. ఈ ఆరు రోజులూ  ఉదయం ఏడున్నరకు బయలుదేరి మరల రాత్రి ఏడున్నరకో లేదా ఎనిమిదింటికో ఇంటికి చేరడం రివాజు అయిపొయింది శంకరం జీవితంలో....

వెలుగులోకి… 0

వెలుగులోకి…

టివిలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. “ఐదు రోజులు వేస్టు, అగుటకెయ్యది బెస్టు, చూడు క్రికెట్ టెస్టు” అన్న ఆరుద్ర మాటల్ని నిజం చేస్తోందు ఆ మ్యాచ్. దాన్ని చూడలేక దేశంలో ముప్పాతిక భాగం జనం టివి కట్టేసుంటారు. కానీ వివేక్ మాత్రం అలా చెయ్యడు. అదే అతనిలోని...

బోధిసత్త్వుడు 0

బోధిసత్త్వుడు

“అద్దం ఎప్పుడూ అపద్ధం చెప్పదు. నిస్సంకోచం ఎక్కువ దీనికి.” మనసులో అనుకున్నాడు మహదేవ్ . అతను అద్దం ముందు నిలబడి పది నిముషాల పైనే అవుతోంది. ఎన్నడూ లేనిది ఈరోజెందుకో అదే పనిగా అద్దం లో చూసుకోవాలనిపిస్తోంది అతనికి. కొన్ని కార్యాలకు కారణాలు ఉండవు. చేతివేళ్ళను జుత్తులోకి...

గోకులంలో కలకలం 0

గోకులంలో కలకలం

గోకులంలో ఆనందం అల్లరిచేస్తున్నది.ఉత్సాహం పూల సువాసనలాగా, లేగదూడల చెంగణాలలాగ అటు ఇటూ పరుగుపెడుతోంది. గోపికలు ముసిముసిగా నవ్వుతూనే నొసలు విరుస్తూ యశోద వద్దకు వస్తున్నారు. వాళ్ళ నోళ్ళ నిండుగా ఫిర్యాదులు. చేతుల్ని ఊపుతూ, తలల్ని ఆడిస్తూ, గబగబా అరుస్తున్నారు. పొద్దున్నుంచీ సాయంత్రంవరకూ ఫిర్యాదులనే కవ్వంతో, ఆకతాయి పనులనే...

పదండి వెనక్కు! 0

పదండి వెనక్కు!

“పదయ్యింది లేవండీ..ఆఫిసు లేదా?” – సుప్రభాతం. “లేదే సెలవు పెట్టా మిగిలిపోతున్నాయి సెలవులు”.  “ఏమంత రాచకార్యముందనీ..?”.  “ఉన్నవి వాడుకొటానికేగా..హాయిగా తిరిగొస్తా”.  గబగబా లేచి టిఫిన్ తిని బయలుదేరా. సెలవెందుకు పెట్టానో తెలిస్తే..పగలబడి నవ్వుతుంది. ఎవ్వరికి చెప్పినా వెర్రోడికిందే జమకడతారు. అందుకు సంసిద్దమయ్యే బయలుదేరా. కాళ్ళు తిన్నగా మునిసిపల్ స్కూల్ గేట్...

థాంక్స్ 0

థాంక్స్

అంత పెద్ద సరోవరంలో ఒకే ఏనుగు నీళ్ళు తాగుతోంది. చిన్ని కళ్ళతో పెద్ద శరీరంతో అమాయకంగా కనిపిస్తోన్న దాన్ని చూడ్డం గమ్మత్తుగా ఉంది – ఒడ్డున నిలబడ్డ నాకు. నీళ్ళలో మొదలైన చిన్న సంచలనం కాస్సేపటికి మొసలి రూపంలో బయటపడింది.    ఏనుగు కాలిని మొసలి పట్టుకుంది....

అవునా , నిజమేనా? 0

అవునా , నిజమేనా?

ఎక్కడ చూసినా ఒక అంతూ పొంతూ లేని రొద. జన సముద్రం నడిమధ్యన, చోటు దొరకని ఇరుకు గల్లీల్లో , తలుపు తెరిచినా తలపు తెరిచినా వీధిలో పడే పరిస్థితి. అయినా ఇది అని చెప్పలేని మానసిక దౌర్భాగ్యం. అంతరంగిక బహిష్కరణ. అన్యమనస్కంగా అడుగులు వేస్తోంది శమంత....