Tagged: Telugu poetry

సాహిత్యంలో సహృదయత 0

సాహిత్యంలో సహృదయత

  From Editor : This article was first published in www.aavakaaya.com in June, 2008   ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ గురించిన వివరణలో వో చోట “కవి” గురించిన వివరణ వుంది. కవిర్మనీషీ పరిభూ:స్వయంభూ: యాథాతథ్యత:అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య: సమాభ్య: ఆ ఆత్మకవి –...

మౌని 0

మౌని

ఆకారంలేని మాటల్లో  సాకారంగా కనబడతాయి  ఊహలు  ఆశలు  భయాలు  బహువిధ బాధాతప్త  విదళిత హృదయాల  నిర్వాణ పర్వాల్లా  మాటలు…మాటలు…మాటలు  కండరాల మధ్య రాపిడే  నిండు జీవితాల్ని శాసిస్తోందని  తెలుసుకున్న నేడు  మాటలకు విలువనివ్వలేక పోతున్నాను !  *****

ఇంతే! 0

ఇంతే!

ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా? నిప్పులో మండని పదార్థాలుండొచ్చు నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా?   మేఘాల స్పర్శను పొందుతున్నా వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!

కష్టార్జితపు మత్తు 0

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో  ఆతని కష్టార్జితపు మత్తు  చమురు పోస్తుంది.  ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున  ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి   నీ చూపులు.  ******** అనుభూతులు పరిగెత్తే లోకాన అనుభూతులకు  పెట్టుబడిగా...

వీడ్కోలు 0

వీడ్కోలు

  మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక కన్నీటి తెరల వెనుక పొదగాల్సిందే...

వెలుతురు 0

వెలుతురు

మళ్ళీనేను మొలుచుకొస్తానునా చావులోనుంచే… వొంటి గుడిసెలో దీపం పెడతానుపారిపోయిన పిట్టల్ని పట్టుకొచ్చిగింజల్ని విసుర్తా రెక్కలు మొలుచుకొచ్చిన వెలుగునిచుక్కల చిక్కుల్లోంచి తప్పిస్తా వక నల్లమల కొండపైచీకటి గోడ్డళ్ళు వేటు వేస్తేవెలుతురును విరజిమ్మేసి పోతా..మీరు మళ్ళీ నన్ను తవ్వి పాతరేసేలోగా

జారిపోయిన నమ్మకం 0

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి బేరం పెడుతున్నాడుమూల్గులు వినలేని కబోది...

ఊరట 0

ఊరట

నీకు, నాకు మాత్రమే అర్థమయ్యేభాషలో మాట్లాడుకోవడంనీకు, నాకు మాత్రమేఅర్థమయ్యే సంబరంనిన్నటి అస్తమయం తర్వాతఏ చెట్టులో ఏ కొత్త పువ్వుపూసిందోనని వెదుక్కునే సూరీడల్లేనీ కొత్త కొత్త మాటల్లోనిగారడీలను వెదుక్కొంటానుమెత్తని నీ చేతుల్లోనా భవిష్యత్తు ఒదిగివుందనిఅనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!వ్యక్తి దూరమైన అవ్యక్త స్థితిలోఆలోచనల గాఢత...

ఉలిక్కిపాటు 0

ఉలిక్కిపాటు

రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది   పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి   వొంట్లో రక్తం పాములా పాక్కొంటూ...

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే! 0

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.   అప్పుడెప్పుడో నగ్నంగా అంతరంగాన్ని...