Tagged: telugu poems

కలవని చూపులు 0

కలవని చూపులు

చూపులు కలిసే లోపే తెరలు దిగిపోతాయి.. వంతెనలు కరిగి పోతాయి.. ఊసులు వెనుతిరిగి వస్తాయి..   మరో ప్రయత్నం మరింత బలంగా.. అసంకల్పితంగా.. మొదలవుతుంది.. తీరం చేరే అలల్లా..   ఈ రెప్పల సమరమెప్పటిదాకా ?   తలలు తిప్పుకున్న ప్రతిసారీ గుండెలు పిండే అనుభూతి.. నన్ను...

వింత సృష్టి 0

వింత సృష్టి

 మనసులేని విజ్ఞానం  నలుమూలలా విజ్ఞానులను పోగుచేసి    ఓ వింత సృష్టి చేయమందట    కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లే    ఇకపై పుట్టే ప్రతి శిశువు    లాప్టాపులతో బుక్స్ బాగులతో పుట్టాలని   క్యార్ క్యార్ మనకుండా సర్ మేడం అనాలని   ప్రయత్నిస్తామన్నారట విజ్ఞత...

స్వర సన్యాసం! 0

స్వర సన్యాసం!

 స్వర సన్యాసం  స్వర సన్యాసం  చేశాయోయ్! నేటి పాటలు.  ఇక మనసులనెలా గెలుస్తాయిలే.  **** భోగం  ఎంత భోగమో  ఈ నీడకి  నేలే బోయీ అయింది.  **** పెద్ద గీత  కాలం మాత్రం లోకపు గాయాలను  మాన్పుతోందేమిటోయ్ ఈ మధ్యన! గీత పక్కన పెద్దగీతను గీస్తోంది తప్ప. ...

కొండంత మేడ 0

కొండంత మేడ

 కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై  కొండంత మేడను  ఎంత అందంగా కట్టిందో చూడు  వెలిగే ఆ దీపం.    **** మానవత  ఏమి నిలబడి ఉంటుందోయ్  ఆ అద్దం ముందు  అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో  ఆ ఏముందిలే  బహుశా! మానవతైయుంటుందేమోలే!   ****...

అందం 0

అందం

అందం  ఓ పక్క ఆ ఆకాశం  తిండి పెట్టక కడుపు మాడ్చుతున్నా  అందాన్ని ఎంతందంగా  నెమరువేస్తోందో చూడా నది  ఆ ఇసుక తిన్నెల మధ్య కూర్చుని.  ***** జలపాతం దగ్గరకు పిలిచి  అంత గంధం నా మేనంతా పూసి  తన గాంధర్వాన్నంతా వినిపిస్తుంది  నాకా జలపాతం.  ******...

కష్టార్జితపు మత్తు 0

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో  ఆతని కష్టార్జితపు మత్తు  చమురు పోస్తుంది.  ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున  ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి   నీ చూపులు.  ******** అనుభూతులు పరిగెత్తే లోకాన అనుభూతులకు  పెట్టుబడిగా...

వీడ్కోలు 0

వీడ్కోలు

  మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక కన్నీటి తెరల వెనుక పొదగాల్సిందే...

ఆలాపన 0

ఆలాపన

చీపుర్ల సామాజిక స్పృహ అంట్లగిన్నెల అస్తిత్వ వేదనపొద్దుటి రణగొణ ధ్వనుల్ని చీల్చుకుంటూ… ఏ రేడియోలోంచో ఓ ఆలాపనలీలగా వినిపించి ఆగిపోతుంది ఇక నీ మనసు మనసులా ఉండదు ఏ పని మీదా దృష్టి నిలవదు ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది చిరపరిచిత రాగంలాగే ఉంటుందిపల్లవి మాత్రం అందీ అందక...

నింగిమేడలు 0

నింగిమేడలు

వాన నీళ్ళని తాగిగుటకేస్తోన్న ఇటకరాళ్ళ గుట్ట యిసక గుట్టతోగుసగుసలాడ్తోంది గెంతుతోన్న కప్పకెందుకో ఆయాసంగుండె దాని గొంతులో కొట్టుకొంటోంది గుడ్డివెలుగులోవన్నం తింటోన్న కూలీ కుటుంబంవాళ్ళని చూస్తోకునకడానికి సిద్ధమౌతోన్న కుంపటి కార్పొరేట్ కుళ్ళు చేరేందుకుఇంకా టైముంది…

సాయం నీడలు… 0

సాయం నీడలు…

మొన్నటి వాన సాయంకాలపుఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి! అనుభవాల అల్మరాఅప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లాఎండిన మొగలిరేకులుగరుకుగా తగుల్తూనే గుబాళిస్తాయి.. కాలం క్రమబద్దంగా ఎండగట్టిన గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండోఆత్మీయపు వేసవివానఆసాంతం  కురిసి పోతుంది.. ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..నిశ్శబ్దానికి రాగాలు నేర్పే చల్లని...