Tagged: telugu kavitalu

కొండంత మేడ 0

కొండంత మేడ

 కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై  కొండంత మేడను  ఎంత అందంగా కట్టిందో చూడు  వెలిగే ఆ దీపం.    **** మానవత  ఏమి నిలబడి ఉంటుందోయ్  ఆ అద్దం ముందు  అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో  ఆ ఏముందిలే  బహుశా! మానవతైయుంటుందేమోలే!   ****...

బావిలోని కప్ప వొంటరిది కాదు! 0

బావిలోని కప్ప వొంటరిది కాదు!

కొండలకు కళ్ళుంటాయ్ గుండె లోయల్లోకి జారిపోయిన వాటిల్నేవో పగలు రాత్రీ వెతుక్కుంటుంటాయ్   నోరున్న మేఘాలు భోరుమంటూంటాయ్ మాటల్ని కురిపిస్తుంటాయ్ మేఘం మాట నేల మీద చిట్లినప్పుడు బద్దలైన రహస్యమొకటి అనామకంగా అడుగులోకి మడుగైపోతుంది   మనసు పోగొట్టుకొన్న నేను గతం గోతిలో, యిజాల నూతిలో బెకబెకలాడుతుంటాను...

స్మృతి గీతిక 0

స్మృతి గీతిక

నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం   శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని   ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ పడెడి నడిరేయి వెన్నెలన్ త్రాగి త్రేన్చెను...

విలువ లేనితనం! 0

విలువ లేనితనం!

నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు   ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా!   సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ దర్యాప్తు! చీపురుకట్టలో పుల్ల పోయిందంతే!...

కూలనీ! 0

కూలనీ!

యింత ఖుషీ యెప్పుడూ దొర్కలా! యిరగ్గొట్టి, మంటెట్టిం తర్వాత యియ్యాలే తెలిసొచ్చెనా?   నొప్పిలో సుఖముంటదిలేబ్బా! కాంక్రీటు మొండాల్తో యింగా యెన్నాళ్ళు నిలబడ్తార్లే యీ గుండె చాల్దా యేం?   కయిత్వమైనా, కాంక్రీటైనా అరాచకత్వంలోనే వికసిస్తాయి  

పునర్మిలనం 0

పునర్మిలనం

చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది!   పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు!   అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం తట్టి “నేనొచ్చాను నీ కోసం”...

మూతబడ్డ జీవితాలు 0

మూతబడ్డ జీవితాలు

చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు నేను ఈ గోడల మధ్యన  అతుక్కునుంటా బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా కడుపు మీద ఆకలి మడతలు    పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను లైటు హౌసు దీపంలా ఉండాల్సిన నా మనసు వానచినుకుల్లో చినుకై...

నువ్వింకా గుర్తున్నావు! 0

నువ్వింకా గుర్తున్నావు!

ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం   చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో!   కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని చూడకుండా ఏళ్ళు గడిచాయి  ...

పోయినోళ్ళు 0

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!

జలపాతం 0

జలపాతం

ఆ జలపాతం ముందు దోసిలి పట్టుకుని ఎంతసేపుగా నిలబడ్డాను? నిండినట్టే నిండితిరిగి తన అస్తిత్వంలోకేఆవిరైపోతూ…కవ్విస్తూ… తడిసిన మనసు సాక్షిగాఅందీ అందని సంతకం కోసంతెల్ల కాగితం విరహించిపోతోంది అలుపెరుగని నృత్యానికి కూడాచలించని ఈ బండరాళ్ళలోకనీ కనిపించని చిరునవ్వేదోదోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ. మనిషి కందని రాగంతోసాగిపోతున్న అంతులేని పాటలో అపురూపమైన రహస్యమొకటిఅర్థమయ్యీ...