Tagged: swatee sripada articles

విరహ గీతం 0

విరహ గీతం

పులకింతల పున్నాగలు ఏ వాకిట కురిసినా తొలకరించు తొలి పలుకులు ఏ నోటన పలికినా పరిమళాల ప్రవాహాలు పరుగులిడే గుబాళింపు కనుసన్నల జాజిపూలు పల్లవించు కావ్యాలే   ఆవంకన జాలువారు జలపాతపు తలపులెన్నో ఈ వంకన నింగి తాకు సింగిణీల విల్లంబులు కనుపాపల కదలికలో హొయలొలికే సోయగాలు...

కావలసింది… 0

కావలసింది…

వసంతాలు తెగనరుక్కుంటూ  ఎడారుల్లో పొర్లిపొర్లి ఏడ్చే సంస్కృతి మాది రాచబాటలా పరిచిన ప్రేమ పూల తివాచీ మదమెక్కిన మత్తగజంలా ఒళ్ళుమరచిన అహంతో చిందర వందర చేసి మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కే సంప్రదాయం మాది   నిన్నా మొన్నా ఆపై కనుచూపు సారించినంత మేరా లొసుగుల చిరుగుల్ను వెతికి...

ఎప్పటినుంచో ….. 0

ఎప్పటినుంచో …..

ఎప్పటినుంచో నాకు తెలుసు ఇప్పటి ఈ రోజులు ఎక్కడో పొంచిఉన్నాయని ఎప్పటినుంచో తెలుసు మరి ! బాల్యం ఇసుక తిన్నెలమీద భవిష్యత్తు ఓనమాలు రాసుకునేప్పుడే తెలుసు బలపం పట్టుకున్నసుకుమారపు వేలికొసల్లో ఎన్ని ఉపద్రవాల సూది మొనలు గుచ్చుకుంటాయో అపుడో ఇపుడో ఆత్మీయత తలుపు తట్టిపిలిచే సస్నేహపు పరిమళాలు...

చెలీ నీ జ్ఞాపకాలే 0

చెలీ నీ జ్ఞాపకాలే

నా కనుపాపల పల్లకీ నెక్కించి స్వప్నవీధులగుండా గుండె నెత్తావులను వెదజల్లుతూ నేను నలుగురినై జీవితం పందిట్లోకి మోసుకుపోతాను నా గాఢ పరిష్వంగం వెచ్చదనాన ఒదిగి పొదిగిన నిన్ను ప్రేమాధి రోహణ అనుభూతుల్లో జగమంతా ఊరేగిస్తానుఅలసి సొలసి నిట్టూర్పుల సెగలో చలికాచుకుంటూ కందిన నీ లే చెక్కిళ్ళగులాబీ రెక్కలమాటున...

ఇవ్వాల్టి మనిషి 0

ఇవ్వాల్టి మనిషి

ఇవ్వాల్టి మనిషి నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో చిరునవ్వు ఉపరితలం కింద పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను లోలోనే అదిమి పట్టి ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించేఅడవితల్లినో ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల రౌద్రాన్నీ సౌమ్యతలో మూటగట్టి అటకెక్కించి...

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట 0

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట

సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట ఆకు రాల్చిందంటె అమ్మాయి శిల్పమే చిగురు తొడిగిందంటే చెక్కిళ్ళ అందమే చిగురు చిగురున మొగ్గ చిన్నారి కనురెప్ప గాలి కదలికలన్నీ సరిగమల గమకాలు సిరిమల్లె గుబురంట సీతమ్మ వాకింట పూసింది నిలువెల్ల పరుగెత్తే తొలిపంట ఆకుల్లోమొగ్గలా...

ఈ ఎడారిలోనూ …. 0

ఈ ఎడారిలోనూ ….

ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెలఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా గడిచిపోయి బ్రతికొచ్చే గతకాలపు సౌఖ్యంలా జలతారుల చిరు కదలికలో మెరుపు పూల మాలికలా ఏకాంతపు రాత్రికి జలపాతం అలికిడిలా చల్లగాలి వీవెనలా మల్లెపూల గమకంలా   ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెలఈ ఎండమావి...

మనసుకూ ఆరు ఋతువులు 0

మనసుకూ ఆరు ఋతువులు

మనసుకూ ఉన్నాయి సమయ సందర్భంగా ఆవిష్కరించుకునే ఋతువులు ఎక్కడో అదృశ్యంగా  అంతరాంతరాళాల్లో . సన్నని చారల్లా తలలెత్తిన సస్య శ్యామలత పుష్పక విమానాల్లో పూల సొబగులనూ పుప్పొడి రాగాలను రంగుల తుళ్ళింతలనూ నిలువెల్ల పరచుకునే ఘడియలు మళ్ళీ మళ్ళీ మరలి వస్తూనే ఉంటాయి… చురుక్కుమంటూ సూదిమొనల్లా గుచ్చిగుచ్చి...

నిన్న రాత్రి 0

నిన్న రాత్రి

నిన్నరాత్రి వెన్నెలలా మంచుపూల స్వప్నాలు ఎద వాకిట రాలి పడే పరిమళాల పుప్పొడులు ఏకాంతపు వీధులలో ఏనాటివి జ్ఞాపకాలు అడుగడుగున వినిపించే సరాగాల సవ్వడులు ……… అటు ఇటూ ఊయలూగు తలిరాకుల తపనలో ఒదిగి ఒదిగి ప్రవహించే  వలపుల చమరింపులో ఆవిరయే గతకాలపు అనుభూతుల జాతరలే దొర్లే...

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే! 0

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.   అప్పుడెప్పుడో నగ్నంగా అంతరంగాన్ని...