Tagged: sagatu telugu jeevi articles

నీకర్థం కాదులే బాంచెను! 0

నీకర్థం కాదులే బాంచెను!

విగ్రహాలేగా అని విరగ్గొట్టారు హద్దులేగా అని విడగొట్టారు దమ్ముల్లో చెమ్మే ఉంటే బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో మురిసిపోండీ….మురిగిపోండి!   నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు నీ నరం తెగితే……   నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్ ఇస్తానన్నది ఇటలీమాత అస్తు… స్వదేశీయుల్ని,...

బాంబుదాడి 0

బాంబుదాడి

పేలింది.   అనేక ఆశల, పన్నాగాల, జిత్తుల, బాధ్యతలు, భవబంధాల,  వగలమారి జీవితం మండిపోతోంది. మండిపోతున్న జీవితానికి మెలకువే లేదు. మరో వేకువ రాదు.   ఒకడొస్తాడు గడ్డమో, మీసమో, సన్యాసమో ఏదో వొకటితో వొస్తాడు గుండెను మర్చిపోయినవాడు చావును మోసుకొస్తాడు ఆరిన కలల కమురువాసనలో మసైపోతాడు...

నేను మాత్రం….నీ ప్రకృతి 0

నేను మాత్రం….నీ ప్రకృతి

సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న కాలసర్పం రెండు కోరల అంచున...

గుర్తింపు 0

గుర్తింపు

పగలు సూర్య కిరణాల్ని తిని అరిగించుకొన్న నిర్భాగ్యుడొకడువెన్నెలని తాగి ముడుచుకుపోయాడువాడి త్రేన్పులకు రెచ్చగొట్టబడ్డకుక్క తోక అదే పనిగా ఊగుతో… శ్రీ వెంకటేశ్వరా హోటెల్లోలింగైక్య మోక్షగామొకడురీటా సెనరీటా మోటు దేహపు గిటారునిఢాణ్ ఢాణ్ మని మోగిస్తోన్నాడు మబ్బు మొకం చూసుకొంటుంటేచెదరకుండా నిలిచింది చెరువునీళ్ళపై నడవబోయిన తూనీగని లాక్కొంది కప్ప...

దద్దమ్మదినోత్సవం 0

దద్దమ్మదినోత్సవం

పంద్రాగస్టంటే సాలు మా పోరగాళ్ళకి యాడలేని ఇది. కుడిసేత్తో ఎడంసేత్తో వో తెగ తిరంగాల్ని వూపేస్కొంటా తిరిగేస్తరు. ఉత్తినే తిరగ్తారా అంటే..ఉ ఊ…”Wish you happy Independence day” అన్న అరుపొకటి. అంగ్రేజోణ్ణి తరిమేసినామని అంగ్రేజు బాసలో సెప్పుకోడం మన దేసబక్తి. యెం సేత్తాం సెప్పండి! నిన్న...

వెలుతురు 0

వెలుతురు

మళ్ళీనేను మొలుచుకొస్తానునా చావులోనుంచే… వొంటి గుడిసెలో దీపం పెడతానుపారిపోయిన పిట్టల్ని పట్టుకొచ్చిగింజల్ని విసుర్తా రెక్కలు మొలుచుకొచ్చిన వెలుగునిచుక్కల చిక్కుల్లోంచి తప్పిస్తా వక నల్లమల కొండపైచీకటి గోడ్డళ్ళు వేటు వేస్తేవెలుతురును విరజిమ్మేసి పోతా..మీరు మళ్ళీ నన్ను తవ్వి పాతరేసేలోగా

పగలు రైతు 0

పగలు రైతు

పగలు రైతుకిరణాల్ని నాటుతూ వెళతాడా!కోట్ల కళ్ళు విచ్చుకొంటాయి మాయదారి రాత్రి రౌతుగుర్రపు డెక్కలు విదిల్చిన మంచుపగలు రైతు పాదాల కింద అణిగిపోతుంది రహస్యాల్ని దాచుకోలేనినిష్టుర నగ్నత్వంను లోకం కప్పుకొంటుంది చెమట ఘాటులోకిరణాల్ని నాటుతూపగలు రైతు.

చెప్పలేను 0

చెప్పలేను

ఒక్కోసారి అలా ఐపోతూ వుంటుంది రెప్పకు రెప్పకు మధ్యన ఉప్పునీళ్ళ జీవితంఇరుకుగా, కరకుగా కదులుతూ వుంటుంది ఏవో నీతులు, జాతులు, గోతులుపావురాయి కాలికి కట్టిన దారంలాపక్కలో బల్లెంలాబక్కటెముకల్లో గుచ్చుకుంటుంటాయి చిత్తుకాగితంలాంటి ప్రపంచాన్నిఉండ చుట్టేసాను కానీచెత్తబుట్టే కనబడ్డంలేదు ఎందుకో ఒక్కోసారి అలా ఐపోతూ వుంటుంది!

ఎండుటాకులు 0

ఎండుటాకులు

చావుకు ఆడా మగా తేడాలేనట్లేద్వేషానికీ లేదన్న నిజం తెల్సాకఆశ్చర్యంలోకానికేమీ కాలేదుసిగ్గులేనితనంతో వెల్లకిల్లా పడుకోని పుల్లద్రాక్షల్ని కలవరిస్తాందినాకేమో వొంటి మీని బట్టల్నెవరో వూడబెరికినట్ట్లైతాంది! —- లింగసౌఖ్యానికి లొంగిపోయిన అమ్మాయొకతెవిసిరికొట్టిన పసిబిడ్డ చుట్టూతా ద్వేషవలయంలా యీగలు!మురిక్కాల్వ వుయ్యాల్లో మోసగీతానికి జోలపోతూ ఆ బిడ్డ! —– ముళ్ళు మూడురకాలుగంటలు – నిముషాలు...

మతిమరుపు 0

మతిమరుపు

డబ్బుకు జ్ఞాపకశక్తి ఉండదుఉంటే, గింటే వాడు నీ ఉపకారాన్ని మర్చిపోతాడా?అప్పట్లో, అప్పటప్పట్లోనీ జబ్బల్లో డబ్బు నిబ్బరంగా దర్పాన్ని పొదిగినప్పుడువాడో పిల్లకాకినీ చూపుడువేలు ఉండేలు దెబ్బకిఎగిరిపోయి, “కా” మనేవాడుమరుక్షణంలో మళ్ళీ వాలేవాడునువ్వో – లాలనగా నీ డబ్బు దర్పపు జబ్బల్లోకిఇరికించుకొని ముద్దల్ని తురికేవాడివి……… మొదటిసారిగా నువ్వు పడ్డావు చూడురంగు...