Tagged: prasuna ravindran articles

మర్మం 0

మర్మం

రాలే పువ్వు రహస్యపు కన్నీరు…  కరిగిపోయే మేఘం చివరి సూక్తుల చినుకులు…  వలసపోయే కిరణం చీకటి గుసగుసలు…  అర్థం కానివో అర్థం లేనివో నిదుర జారేవేళ నా గుండె చప్పుళ్ళు.

శిశిరంలో అకస్మాత్తుగా… 0

శిశిరంలో అకస్మాత్తుగా…

ఆకాశ పుష్పమొకటి విచ్చుకునిఫక్కున నవ్వినట్టుంది. ఇన్నాళ్ళుగా అది దాచుకున్నఎక్కడెక్కడి సుందర దృశ్య వీక్షనానుభూతులోఇక్కడ తేనెజల్లై కురుస్తూ… జోరు వానమువ్వల సవ్వడి వింటూధ్యాన ముద్రలో ఈ క్షణాల్నితనువారా శ్వాసిస్తుంటే మనసు మళ్ళీ విచ్చుకుంది. (పాలపిట్ట మార్చ్ 2010 మాసపత్రికలో ప్రచురితమయింది)

నీ పాట … 0

నీ పాట …

ఆగమన సంకేతాలకే లయ తప్పిన గుండెలోఏ ఙ్ఞాపకాల గడపో తగిలిబొక్క బోర్లా పడింది మనసు దులుపుకోబోతేఒంటి నిండా వదలని వెన్నెల రేణువులు నిలువునా తడిపేస్తాయనుకుంటేఉవ్వెత్తున ఎగసిపడితిరిగి ఉద్వేగంలోకే ముడుచుకుపోతున్నాయిపదాలు ఇందరి మధ్యలో ఉన్నానీ అడుగుల సవ్వడికిహఠాత్తుగా వరించే ఏకాంతంలోంచి   పరిచయమైన సుగంధమొకటి పలుకరించి పరుగెడుతుంది     విరబూసిన...

బోసి నవ్వు 0

బోసి నవ్వు

కాలం నది ఒడ్డున నిన్నటి దాకా నత్తల్లా నిలబడి నన్ను వెక్కిరించిన ఋతువులన్నీ నా ఒడిలో ఆడుతున్న వసంతాన్ని చూసి అసూయతో పరుగెట్టి పోతున్నాయ్. ఎన్నేళ్ళు ధ్యానించినా చేరలేని అనంతానందపు శిఖరాగ్రాన్ని నీ బోసినవ్వు రెక్కలమీద క్షణంలో చేరగలగడం ఎంత చిత్రం! నీ సమక్షంలో గడిచే ప్రతీ...

మరొక్కసారి .. 0

మరొక్కసారి ..

చినుకై రాలిన మేఘాన్నిఆకాశం తిరిగి పొందినట్టు కోల్పోయిన ఆత్మీయుల్నిమనిషి పొందగలిగితేఎంత బాగుండును !! మరచిపోయిన దారుల్లోనది తిరిగి ప్రవహించినట్టు గతకాలపు గుంటలోకివర్తమానాన్ని మళ్ళించగలిగితేఎంత బాగుండును !! ఈ తీరంఇష్టంగా చేరిన గమ్యమే అయినాఅసంతృప్తితో జారిపోతున్నప్రతి క్షణమూసిగ్గుపడేలా బాల్యాన్ని చూపించనూ !

వెన్నెల ప్రయాణం 0

వెన్నెల ప్రయాణం

ప్రవహించే కాలంతో ప్రకృతి పాట వెతుక్కుంటూమౌనంగా సాగిపోయేదాన్ని. దేవుడు సృష్టించినరహస్య కొలనులోకలువలా నువ్వు వికసించడం తెలిసాక తామరతూడులాంటి నీ స్పర్శకి నేనో జలపాతాన్నైకోటి ఆశల పూలపడవలతోనీ వైపే ప్రవహిస్తూ … నీ అలల కదలికల మధ్యచంద్రబింబాన్నైనా ఒడిలో నిన్నే చూసుకుంటూ … నీ రూపాన్ని ఊహించే ప్రయత్నానమేఘాల...

ముఖ్యమైన వాళ్ళకు… 0

ముఖ్యమైన వాళ్ళకు…

కొన్నిసార్లంతే … హృదయ స్పందనలోంచి పుట్టినభావాల సీతాకోక చిలుకల్నిగుండెలోనే బంధించడం తప్పస్వేచ్చగా వదల్లేం… చెప్పాల్సిన జవాబే అయినావ్యక్త పరచలేం … దోసిట్లో పట్టుకున్న వాన నీరువేళ్ళ సందుల్లోంచి జారిపోయినాఆకాశపు కబుర్ల హాయినరాల్లో ఇంకా తెలుస్తూనే ఉంది. కురిసే వర్షాన్నీపెరిగే వెన్నెలనీఆస్వాదించిన సమయం వృధా అనుకుంటేబ్రతకడం రానట్టే …

నల్లమబ్బులు 0

నల్లమబ్బులు

ఆషాఢం వలువల్లోఆకాశం హొయలుపోతూనల్లటి సమ్మోహనాస్త్రాలుసంధిస్తూంటుంది. గుండె లోతుల్లో ఎండిపోయాయనుకున్న భావాల విత్తులు క్షణాల్లో మొలకెత్తికన్నుల్లో విరబూసి నింగి ఒంపుల్లో ప్రతిబింబిస్తూంటాయ్     గ్రీష్మం నిర్మించిన నిర్లిప్తపు ఆనకట్ట తెంచుకునిపరవళ్ళు తొక్కుతున్న  దాహపు సెగల మధ్యఒక్క భావాన్నైనా ఘనీభవించాలనిఆకాశమంత దోసిలి పట్టుకునిమనసు తెల్లకాగితమై ఎదురుచూస్తూంటుంది.   అన్నిటినీ దోచుకుని...