Tagged: సగటు తెలుగు జీవి రచనలు

నీకర్థం కాదులే బాంచెను! 0

నీకర్థం కాదులే బాంచెను!

విగ్రహాలేగా అని విరగ్గొట్టారు హద్దులేగా అని విడగొట్టారు దమ్ముల్లో చెమ్మే ఉంటే బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో మురిసిపోండీ….మురిగిపోండి!   నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు నీ నరం తెగితే……   నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్ ఇస్తానన్నది ఇటలీమాత అస్తు… స్వదేశీయుల్ని,...

అపద్దపు మాటలు! 0

అపద్దపు మాటలు!

భూమికి చంద్రుడికి మధ్యరాకాసి గబ్బిలంలారెక్కలు చాచిన మేఘంచీకటి విషాన్ని చిమ్ముతోంది   తన గుడ్లనే మింగేసి ముడుచుకొన్న పాములాగున్న నది వొడ్డున నీడొకటి ఏడుస్తోంది.   గద్దకి బిడ్డని బలిచ్చేసిన పిట్ట ఏడుపుకి గొంతు కలుపుతోంది చెట్టు   అబ్బా… ఎంత భయానకం! అంతా భయంకరం!!  ...

నేను మాత్రం….నీ ప్రకృతి 0

నేను మాత్రం….నీ ప్రకృతి

సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న కాలసర్పం రెండు కోరల అంచున...

వొద్దులే 0

వొద్దులే

కంట్లో నీళ్ళ చుక్కల్తో నిన్ను చూస్తేపగిలిపోయిన ఆకాసం నుండిజాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది బతుకు అపస్వరం పలికినాకఅవసరం యెవరిదైతేనేంలే! యెవడో వాడుమొగవాడంతేనువ్వో జూకామల్లెవి అంతా ముగిసినాకవాడు..ఎవడైతేనేంలేఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడునువ్వు మాత్రంఅదే గదిలో మరోసారివికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు నీ కంట్లో నీళ్ళ చుక్కల్ని చూసినప్పుడుయెనక్కి పారని...

పిచ్చిలో…. 0

పిచ్చిలో….

నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది

వెకిలి జీవితం 0

వెకిలి జీవితం

గుండుసూదికి గుచ్చిన సీతాకోకచిలుకతెరుచుకొన్న నోటిలో గడ్డకట్టిన బాధనువిరజిమ్ముతోన్న నెత్తుటి బొట్టులోఒక జీవితమంత నిర్లక్ష్యంతోగద్ద గోళ్ళనుఅద్ది, రాసిన రాతలకుఅర్థాలు వెదుక్కొంటున్నావా? కలుగులో దాక్కొన్న ఎలుకనుకనిపెట్టి చంపే విషగుళికలోనా నగర తత్వం రూపం,బానిసత్వం నీడల్ని పరిచిఅడ్డుగోడల గుడ్డికళ్ళకుకాటుక పెట్టుకొంటున్నావా? కరువుతో గుండాగిపోతున్నచేపపిల్ల మెదడులోని చచ్చుకణాలదుర్భర ఘోషనుస్టెటత్ స్కోపు గొట్టంలో రికార్డింగ్...

సిటీ లైట్స్ 0

సిటీ లైట్స్

ఐదేండ్ల పాప. చేతిలో కర్ర. కుక్కపిల్ల మీద ఒక్క దెబ్బ. కుయ్ కుయ్ . ఇంకో దెబ్బ. కుయ్య్ కుయ్య్ . మరోక దెబ్బ వెయ్యబోయి పట్టుతప్పి పడింది పిల్ల. “అయ్యయ్యో! దెబ్బ తగిలిందా బంగారూ!”. తల్లి లాలన. కుక్కపిల్ల మూలుగు background music. సుడులు తిరుగుతూ...

జీవితంలో… 0

జీవితంలో…

రేడియో సరిగ్గా పాడడంలేదు…మనిద్దరి మధ్యా గులాబి రంగు మాటలు దొర్లి చాన్నాళ్ళైంది. నువ్వు దేవుణ్ణి అతిగా నమ్ముతావు.కనబడకనే కొట్టుకొనే గుండెలా..నేను టీకప్పులో బుడగల్ని లెక్కపెట్టుకొంటానుచాక్లెట్ రేపర్ విప్పుతోన్నప్పటి పిల్లవాని మనసులా.. కొన్నిసార్లు అన్నీ బాగున్నట్టే వుంటుందిటీవీలో నచ్చిన ప్రోగ్రామ్, మొబైల్లో లేటెస్ట్ వాల్ పేపర్ఒకరి చేతిలో మరొకరు...

జారిపోయిన నమ్మకం 0

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి బేరం పెడుతున్నాడుమూల్గులు వినలేని కబోది...

ఉలిక్కిపాటు 0

ఉలిక్కిపాటు

రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది   పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి   వొంట్లో రక్తం పాములా పాక్కొంటూ...