Tagged: తెలుగు కవిత్వం

0

అచ్చ తెనుగు ఆత్మగీతం : అంతర్యానం

కొండముది సాయి కిరణ్ కుమార్ తొలి కవితా సంకలనం “అంతర్యానం” కు ప్రముఖ కవి ఇక్బాల్ చంద్ వ్రాసిన విశ్లేషణాత్మకమైన ముందు మాటలు…ఆవకాయ.కామ్ పాఠకుల కోసం అందిస్తున్నాం.   “అంతర్యానం” ప్రతుల కై సంప్రదించండి: పాలపిట్ట ప్రచురణలు              ...

ఈ ఉదయం 0

ఈ ఉదయం

బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరిగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్ల పదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.  

జారిపోయిన నమ్మకం 0

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి బేరం పెడుతున్నాడుమూల్గులు వినలేని కబోది...

ఊరట 0

ఊరట

నీకు, నాకు మాత్రమే అర్థమయ్యేభాషలో మాట్లాడుకోవడంనీకు, నాకు మాత్రమేఅర్థమయ్యే సంబరంనిన్నటి అస్తమయం తర్వాతఏ చెట్టులో ఏ కొత్త పువ్వుపూసిందోనని వెదుక్కునే సూరీడల్లేనీ కొత్త కొత్త మాటల్లోనిగారడీలను వెదుక్కొంటానుమెత్తని నీ చేతుల్లోనా భవిష్యత్తు ఒదిగివుందనిఅనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!వ్యక్తి దూరమైన అవ్యక్త స్థితిలోఆలోచనల గాఢత...

ఉలిక్కిపాటు 0

ఉలిక్కిపాటు

రోడ్డుపై తన క్రీనీడ చూసుకొని ఉలిక్కిపడింది వీధి దీపం వేదాంతం పట్టని పట్టణం చీకటిని ఆబగా కావలించుకొంటోంది   పుట్టగొడుగు మేడల్లోంచి రాలిపడే మెతుకుల్ని చూసి చచ్చిన బొద్దింక నాలుక చప్పరించింది టీవీలో “అభిరుచి”, పొట్టనిండినోడి “అజీర్తి” అదేపనిగా రమిస్తున్నాయి   వొంట్లో రక్తం పాములా పాక్కొంటూ...

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే! 0

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.   అప్పుడెప్పుడో నగ్నంగా అంతరంగాన్ని...

అప్పుడప్పుడు… 0

అప్పుడప్పుడు…

చిరునవ్వుల పెదవులను తగిలించుకు చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను. అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది. భయాందోళనల తుఫానులో, ఏకాంతపు సుడిగాలిలో...

అంతర్యానం 0

అంతర్యానం

అరమరికలు లేవనుకున్న ఆకాశానికే అడ్డుతెరల్లా ప్రశ్నల చినుకులు పర్వతంలా పరుచుకున్న విషాదపు నిషాలో ఆశ్రునిక్షిప్తమైన ఆకాశం నిండా అపశబ్దాలే.   అర్ధంకాని అలజడి మధ్య ఆకాశం నిద్రపోతున్నదంటే నమ్మలేం! ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో ఎవరి ఆత్మకథో రాలిపోయిన పూల నవ్వులా పలకరిస్తుంది. నిర్ధారణ అవసరంలేని నిజాలు...

స్మృతి గీతిక 0

స్మృతి గీతిక

నిశిరాతిరి ముసిరి మేఘాలు గుసగుసలాడెను కసికసిగా మసిబారెను స్వగతం వేసారెను జీవితం   శిధిల మనమందిర శకలమొక్కటి ప్రొదిలి నేడ్చును ఆది వైభములన్దల్చి విగత పుష్ప వృక్షమొక్కటి పాడు భగ్న తాళానుబద్ధ స్వప్నరాగాన్ని   ఊళలెట్టు గాలి నాలుకల్ చందాన గోలపెట్టు చెట్ల ఆకులందు ఏటవాలుగ పడెడి నడిరేయి వెన్నెలన్ త్రాగి త్రేన్చెను...

విలువ లేనితనం! 0

విలువ లేనితనం!

నువ్వున్నన్నాళ్ళూ పక్కవాళ్ళకు పొద్దుగడిచేది వొళ్ళు, కళ్ళు, చెవులు – నీవెట్లా తిప్పితే పక్కోళ్ళవీ తిరిగేవి నీ గుండెలోతుల్లోకి నువ్వు జారుకున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో నీలిచిత్రాల్ని గీసుకొనేటోళ్ళు   ఇప్పుడెవ్వరికీ పొద్దు గడవడంలేదు చావులోయలోకి రాలిపోయిన ఆకువైనావుగదా!   సమాజం తోసిందా? నువ్వే తోసుకొన్నావా? ఎవడిక్కావాలీ దర్యాప్తు! చీపురుకట్టలో పుల్ల పోయిందంతే!...