Tagged: తెలుగు కవితలు

0

కలల తీరాలు

  ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి కోరిన నెలవులకు చేరిననాడు మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి కలగన్నది చేజారినప్పుడు నిరాశ నిస్పృహలు...

కొండంత మేడ 0

కొండంత మేడ

 కొండంత మేడ చిటికెన వేలంత పునాదిపై  కొండంత మేడను  ఎంత అందంగా కట్టిందో చూడు  వెలిగే ఆ దీపం.    **** మానవత  ఏమి నిలబడి ఉంటుందోయ్  ఆ అద్దం ముందు  అంత అందమైన సమాధి కనిపిస్తోంది అందులో  ఆ ఏముందిలే  బహుశా! మానవతైయుంటుందేమోలే!   ****...

కష్టార్జితపు మత్తు 0

కష్టార్జితపు మత్తు

కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో  ఆతని కష్టార్జితపు మత్తు  చమురు పోస్తుంది.  ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున  ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి   నీ చూపులు.  ******** అనుభూతులు పరిగెత్తే లోకాన అనుభూతులకు  పెట్టుబడిగా...

వీడ్కోలు 0

వీడ్కోలు

  మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక కన్నీటి తెరల వెనుక పొదగాల్సిందే...

ఒలిపిరి 0

ఒలిపిరి

ఇంట్లోకి ఒలిపిరి, కిటికీ మూసెయ్యమంటుందామె ఎలా మూయను ఉన్నది అదొక్కటే. నీళ్లలో పిల్లలు వెన్నెల చొక్కాలు వేసుకుని ఎగురుతుంటారు నాకు ఎగరాలని ఉంది! రోడ్డు మేలు నా కన్న వానతో పిల్లల పాదాలతో వాళ్ల అరుపులతో తడుస్తుంది. గదిని తుడుచుకోవచ్చు కొన్ని చినుకులు నా మీద కూడా...

మిస్డ్ కాల్ 0

మిస్డ్ కాల్

మంచు కత్తితో పొడిచి సాక్ష్యం లేకుండానే పారిపోయే మొరటు సరసం…   మంచినిద్రలో చెంప పై ఛళ్లుక్కున చాచికొట్టి మాయమైన మెరుపు పిలుపు…   అకవుల అద్దె ఏడ్పు, దొంగ ఆర్ద్రతలా స్వప్నపుష్పంపై వాలి చెరుస్తున్న మిడుతల దండులా నీ గొంతు…   ప్రియా! నిజంగానే నీ...

శ్రావణమేఘాలు 0

శ్రావణమేఘాలు

అమ్మా నాన్న పిట్టలు ఎగిరిపోతాయిబరువును మోసిన చెట్టేభారంగా నిలబడుతుంది పిట్టలు ఎగురుకుంటూ వస్తాయిభారంగా నిలబడిన చెట్టేసంబరంగా నవ్వుతుంది. * * * బెస్ట్ హాఫ్ ఒత్తి మీదఒద్దికగా కూర్చొనిమౌనంగానన్ను స్పృశిస్తూవెలుగు మత్తుగా పెనవేసుకుంటూజ్ఞాపకాలు పలకరిస్తుంటేమౌనానికి మరోవైపునాలో నేను నీ నీడలో నేను

జీవితంలో… 0

జీవితంలో…

రేడియో సరిగ్గా పాడడంలేదు…మనిద్దరి మధ్యా గులాబి రంగు మాటలు దొర్లి చాన్నాళ్ళైంది. నువ్వు దేవుణ్ణి అతిగా నమ్ముతావు.కనబడకనే కొట్టుకొనే గుండెలా..నేను టీకప్పులో బుడగల్ని లెక్కపెట్టుకొంటానుచాక్లెట్ రేపర్ విప్పుతోన్నప్పటి పిల్లవాని మనసులా.. కొన్నిసార్లు అన్నీ బాగున్నట్టే వుంటుందిటీవీలో నచ్చిన ప్రోగ్రామ్, మొబైల్లో లేటెస్ట్ వాల్ పేపర్ఒకరి చేతిలో మరొకరు...

జారిపోయిన నమ్మకం 0

జారిపోయిన నమ్మకం

దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి బేరం పెడుతున్నాడుమూల్గులు వినలేని కబోది...

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే! 0

నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!

చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.   అప్పుడెప్పుడో నగ్నంగా అంతరంగాన్ని...