Tagged: కవితలు

0

కలల తీరాలు

  ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి కోరిన నెలవులకు చేరిననాడు మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి కలగన్నది చేజారినప్పుడు నిరాశ నిస్పృహలు...

మినీ కవితలు 0

మినీ కవితలు

జార్చిన హృదయమెంతగా బాధ పడుతుందోనని  అందరికన్నా ముందుగా ఆ హృదయాన్ని ఓదార్చవూ ఆ జారే కన్నీళ్ళు   *************   నీడలు, నేలతో చెప్పే ఊసులనే కదూ! పదాలుగా అల్లి పాడుకుంటూ పోయేవా సెలయేళ్ళు   *************   దొరలనుండి విముక్తి కోసం నాడు నిరాహార దీక్ష...

బొడ్డురాయి 0

బొడ్డురాయి

  “నా చుట్టే పల్లె మొత్తంవెల్లివిరిసిందని” ముచ్చటపడి మూగసాక్షిగానీదైన ధ్యాన ముద్రలో ఎండా, వాన, చలి,నునువెచ్చని హాయికి అతీతంగా, అలౌకికంగా అలరారే ఓ బొడ్డురాయీ!బడుద్దాయిలు ప్రవేశించారు నీ స్వప్నసీమలోబడబాగ్ని రగిలించారు. నీకు ఈశాన్యంలో ఉండిన సంప్రదాయందారితప్పిపోయింది…ఆ గుడితో సైతం ఆగ్నేయం వైపు ఉన్న సత్రం ఇప్పుడు దేహవ్యాపార...

ఈ కాసిన్ని అక్షరాలు.. 0

ఈ కాసిన్ని అక్షరాలు..

1.  శృంగేరిలో సూర్యాస్తమయం తుంగనది అనంతంలోకి.. ఓంకారం మౌనంలోకీ.. నదిలో చేపలు.. మదిలోనో? దేన్నీ పట్టుకోలేను చంటాడితో పాటు నాకూ కొన్ని కొత్త అక్షరాలు!? గుడిలో అమ్మ నవ్వుతుంది.   2. పాటే అక్కరలేదు ఒక్కోమాటు చిన్న మాటైనా చాలు జ్ఞాపకాల మూట విప్పేందుకు!   3....

పాట పాతదైతేనేమి? 0

పాట పాతదైతేనేమి?

పాట పాతదైతేనేమి?ఆడే నాగులా మనసూగుతున్నప్పుడు! దూరాన్ని క్షణాల్లో కొలిచికాలాన్ని మైళ్ళలోకి మార్చిరాగాల రంగులరాట్నంపైగిరగిరా తిరుగుతున్నప్పుడు మాటరాని మూగదైనారెక్కలొచ్చిన పిట్ట ఒక్కటిరెక్కలార్చిన చప్పుడటుచుక్కలదాకా ధ్వనించినప్పుడు గాలి తాళానికి తలనువూచేదీపశిఖ తాదాత్మ్యతనుఎత్తిచూపే గోడను చూడుఏదో గుర్తుకు రావడంలేదూ! పాట పాతదైతేనేమి?నీ చెవులకు ఆత్మ ఉన్నప్పుడు!!

గుప్పెడు మనసు 0

గుప్పెడు మనసు

గుప్పెడంతే ఉన్నానంటూనే ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది అనుభవాల వ్యవసాయం చేసి అనుభూతుల పంట పండిస్తుంది అలసి అప్పుడప్పుడు  స్తబ్దమౌతుంది...

ఇవ్వాల్టి మనిషి 0

ఇవ్వాల్టి మనిషి

ఇవ్వాల్టి మనిషి నిర్లిప్తత కప్పుకు నిద్రపొతున్న వెసూవియస్ నో చిరునవ్వు ఉపరితలం కింద పొగలుకక్కుతున్న సప్తసముద్రాల పాదారసాన్నో చిటపటలాడే నిప్పురవ్వలను గుప్పిట్లో బిగించి శరవేగంతో చుట్టుకుంటున్న అగ్నికీలల్ను లోలోనే అదిమి పట్టి ఆకుపచ్చ వెలుగుల్ను గుమ్మరించేఅడవితల్లినో ఆటవిక స్వభావాన్ని సింహ గర్జ్జనల రౌద్రాన్నీ సౌమ్యతలో మూటగట్టి అటకెక్కించి...

ఆమె – నేను 0

ఆమె – నేను

కట్టుకున్న బట్టల్నిఒక్కోటీ విప్పేస్తూనగ్నంగా నిలబడిందితను. నిజాన్నిఅంత నిర్భయంగా చూడలేక,కళ్ళు మూసుకున్నానేను. 

ఆ రాత్రి 0

ఆ రాత్రి

దేహచ్చాయల మీద ఆరేసుకున్న వెన్నెల క్రీనీడలు. నఖక్షతాల్తో చంద్రుడు,నక్షత్రాలు. విస్తరించిన నిమిషానందపు బోన్సాయ్ వృక్ష సమూహం. పరిమళ నిశ్వాసం పరుచుకున్న పట్టెమంచం. మేని సానువుల్లో అధరాలు తచ్చాడిన తడి జ్ఞాపకాలు. ఎనిమిది కాళ్ళతో చలించిన అక్టోపసి. సుషుప్తి గవాక్షాల్లో రెక్కలిప్పుకుని, సుదూరమైన స్వప్న విహంగం. ఆర్తి అంతఃస్రావమైన...

ఒక్క అడుగు అనంతంలోకి…(ఒక శాస్త్రవేత్త ఆత్మహత్య) 0

ఒక్క అడుగు అనంతంలోకి…(ఒక శాస్త్రవేత్త ఆత్మహత్య)

ఒక్క అడుగు ముందుకేస్తే నీకు తెలుసు నువ్వెక్కడుంటావో! జీవితమంతా నడిచి నడిచి అలసిసొలసిన నీకు ఆ ఒక్క అడుగు వెయ్యటానికి అరక్షణం అయినా పట్టలేదు! ప్రయాణం విసుగనిపించిందో అనుకున్న లక్ష్యం అందకుండా పోయిందో ఇంటా బయటా నిన్నుమించిన అసమర్థుడు, నిరాశావాది వేరెవరూ లేరని ఎవరేమన్నారో ఆరంతస్థుల పైకెక్కి...