సీటు పోయిందా!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

“గురూ!”

“శిష్యా!”

“వందనాలు గురూ!”

“బంధనాలు శిష్యా! సీటాసీనుడవు కమ్ము”

“అహా! ఉన్న సీట్లు ఊడే కాలంలో నిలిచినంతనే సీటిప్పిప్పించడం మహ దొడ్డ గుణం!”

“వెర్రోహం! పాయింటేమిటో చెప్పు శిష్యా!”

“మీకు తెలియందేముంది గురూ! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎన్నో ప్రకంపనాలొచ్చాయి.”

“అవును!”

“వీరప్ప మొయిలీ సీటు పోవడానికి కారణమేమిటి గురువా?”

“రామాయణం పై గ్రంధం రాయడమే!”

“కాకా సంగతి?”

“వెంకటస్వామిగా ఉండక సంకటస్వామిగా మారినందుకు!”

“నేదురుమిల్లో!”

“గోడ మీద పిల్లి చందం”

“మరి వీర విధేయ హనుమంతుడి వాలాపహారం?”

“విధేయం ప్రధానం కాదన్న మేడమ్ గారి మనసు”

“మరి గులామ్ నబీ అజాద్ ప్రాభవానికి కారణం?”

“పేరులోనే గులామ్, అజాద్ అన్న గందరగోళం ఉన్నందుకు”

“అంటే గులామ్ కభీ అజాద్ [నహీ] అనా గురూ?”

“రివర్సులో చదువు శిష్యా విప్లవం వర్ధిల్లుతుంది!”

“అహా! దివ్యోపదేశం! దివ్యోపదేశం!”

“వెర్రోహం! నేటికి వెళ్ళి మాపటికిరా శిష్యా! నిత్యానంద సేవా టికెట్లు కొన్నవారి క్యూ పెరుగుతోంది!!”

**********

 

You may also like...

Leave a Reply