వాల్మీకి రచించిన ” శ్రీ సరస్వతీ స్తోత్రము”

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

Goddess saraswati devi వాల్మీకి “శ్రీమద్రామాయణము” రచయితగా లోక విదితుడే! “కౌసల్యా సుప్రజా రామా….” మొదలగు శ్లోకములు

పూజా విధానాలలో, భక్తులు పాడుకుంటూన్నారు కదా!  భక్తి భావముల పరిమళాలను వెదజల్లే శైలి ఆది కవి వాల్మీకిది అని ఘంటా పథంగా చెప్ప వచ్చును.

వాల్మీకి విరచిత “శ్రీ సరస్వతీ ప్రార్ధన”ను చదువుదమా!

 

శ్రీ వాల్మీకి రచించినట్టి “శ్రీ సరస్వతీ దేవి స్తోత్రం”. ఈ ” వాణీ ప్రశంస “బ్రహ్మాండ పురాణము ” లో ఉపలబ్ధము.


1. శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం – సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం|

    ఘనాకార వేణీ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం||


2. ధరా భార పోషాం సురానీక వంద్యాంమృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం|

   త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం||


3. దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం|

 శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||


4. విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం|

    త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||

     

5. అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం|

    అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||


6. మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం|

     చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||


 7. సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం |

     మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||


8.  ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః|

     శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం ||

 

               ||ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం సంపూర్ణం||

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *