రాని యవ్వనం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

మాతృభాష

బొడ్డుపేగులోనే 

కాలపాశమెదురయితే 

బ్రతికి బట్ట కట్టేదెలా?

అంటున్న బేలలా అయింది 

నా మాతృభాష. 

******

రాని యవ్వనం 

పొగలు, పొంగే నురుగులను 

తమ ప్రాథమిక హక్కులంటూ,

వీధుల్లో ఎలా విహరిస్తున్నాయో చూడు 

రాని యవ్వనాలు కొన్ని.

*******

మనిషి

మనిషి, ఎదుట పడ్డపుడు పట్టాభిషేకమూ,

ఎడం కాగానే పోస్టుమార్టమూ

అలవాటైపోయింది నాలుకల కీమధ్యన. 

*********

మనువు 

అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు 

చూసుకోవడం మానేసి రాబోయే ఏడుతరాలు

మోయలేనంత మూటలు పోగేస్తూ 

ముడివడుతున్నాయి మనువులిప్పుడు. 

*********

 

You may also like...

Leave a Reply