పవళక్కొడి

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

అత్యంతాద్భుత చిత్రం “మాయాబజార్” లో వింత ఏమిటంటే, ఈ కథ అసలు మహాభారతములో (జన రంజకమైన ఈ మహా ఇతిహాసము యొక్క అసలు పేరు “జయం”) లేనే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విశేషం కూడా ఉన్నది; అదేమిటంటే, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఎస్.వి.రంగారావు మున్నగు హేమాహేమీలు నటించిన ఈ సినిమాలో, పంచ పాండవులు కానరారు. వారు అజ్ఞాత వాసంలో ఉన్నారు కదా!

అలాగే ఈ సినిమాలో కూడా వారి పాత్రలను అజ్ఞాతములో ఉంచినట్టి దర్శకత్వ ప్రతిభ, తర్వాతి తరాల సినీ రంగానికి మార్గ దర్శకత్వం Still from Tamil Film Pavalakkodiవహించింది అనడంలో ఎలాటి సంశయమూ అక్కర లేదు.


మహా భారతములో , మూల కథలో లేనట్టి గాథతో తీసిన తమిళ సినిమాయే “పవళక్కొడి”. తమిళ ప్రజలలో అర్జునుని సాహస యాత్రలలో సాధించిన ఒకానొక విజయ గాథ ప్రాచుర్యంలో ఉన్నది. M.K. Thyagaraja Bhagavathar and S. D. Subbulakshmi లు స్టేజీ నాటకముగా వివిధ దేశాలలో విజయవంతంగా ప్రదర్శించారు.

1934 లోనూ, మరల 1949 లోనూ ఈ జానపద గాథ వెండి తెరపైకి చేరింది. పక్షిరాజా బ్యానర్ పైన శ్రీరాములు నాయుడు నిర్మించిన “పవళక్కొడి”లో మహాలింగం , హీరో అయిన అర్జున పాత్రను కాదని శ్రీ కృష్ణునిగా నటించాడు.

“అన్నం వాంగాలైయో..అమ్మా..అన్నం వాంగాలైయో” (lyrics by Papanasam Sivan and music by C. R. Subbaraman) అలాగే తమిళ సినీ కృష్ణుడు కాస్తా ఒక హిందీ పాటను గానించాడు. ఆ గీతమే “క్యా కర్నా భగవాన్!” తమిళ సినీ రంగంలో సినీ నటీనటులతో సమానంగా ఇలంగోవన్ అనే గేయ రచయితకు ఎంతో పాప్యులారిటీ లభించింది. ఇలాగ అనేక రికార్డుల జిమ్మిక్కులతో తమిళ చలన చిత్ర చరిత్రలో ఒక గుర్తు ఉంచుకో కొన్ని పుటలను “పవళక్కొడి”(పగడాల దీవి యువరాణి) సంపాదించుకున్నది.

ఇంతకీ ఆ యువరాణి గా నటించిన కథానాయకి ఎవరో తెలుసా? “చంద్రలేఖ” సినీ నాయిక టి.ఆర్.రాజకుమారి!

You may also like...

Leave a Reply