అధ్యాయం-15 పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

యాదవ చంద్రమ్మ దగ్గర పెరిగిన శుక్లపక్షపు చంద్రుడు “బాలచంద్రుడు” – చంద్రుడు  కళల్ని, తేజస్సును రంగరించుకుని పదిహేనేళ్ళ వాడయ్యాడు.

మహరాజుల వెంట్రుకల్ని పెంచాడు. గుర్రపుస్వారీలో, కర్రవేటులో, కత్తిపోటులో తనను మించినవారు లేదన్నట్టున్నాడు.

బాలచంద్రుడు ఎక్కడ పెరిగాడో, ఎంతడివాడయ్యాడో బ్రహ్మనాయుడికి – మాచెర్లలో వుండగానే అరణ్యవాసానికి ముందే తెలిసింది. పెద్దవాడైన బాలచంద్రుణ్ణి ఇప్పుడు అదుపులో పెట్టటం సామాన్యమైన పనికాదు.

పల్నాటిసీమలో పెరిగిన వీరచంద్రుడతడు. కత్తి పట్టుకుంటే ఎదురులేని మొనగాడతడు.

తన కొడుకు ఎక్కడ పెరిగాడో ఐతాంబకు తెలిసివచ్చింది. తన దగ్గరకు రప్పించుకున్నది.

బాలచంద్రుడు తననుంచి దూరమైనప్పుడు ఏడు కులాలనుంచి ఏడుగుర్ని తెచ్చి, తన బిడ్డల్లానే పెంచింది. లాల పోసింది-జోల పాడింది.

ఇప్పుడామె మేడపిలో కొడుకులతో సుఖంగా ఉంటున్నది.

ఐతే, బాలచంద్రుడి జీవితానికో క్రమం లేదు. విచ్చలవిడైన జీవితం అతనిది. మరీ, వయస్సు రాబోయే దశకు చివరిభాగంలో ఉన్నాడతడు. వయస్సు ఉత్త జలపాతంలాంటిదైతే, అది బాలచంద్రుడి విషయంలో గట్టు తెగిన ఏరులాంటిది. మిగతా సోదరులలో అతనే పెద్ద. అతగాడి మాటను మిగిలినవారు జవదాటలేదు.

**********

ఒక శ్రావణ్ శుద్ధ ఏకాదశి రాత్రి “శ్యామాంగి” అనే మిఠారి నృత్యం జరుగుతున్నది. అది వయస్సుతో రెపరెపలాడుతున్నది. దాని కంచుకము – దాని వక్షపు ఎత్తుకు వదలయ్యేట్టుగా వున్నది. అది కళ్ళతో సైగ చేస్తే మన్మథుడు మూర్ఛపోతాడు.

అది పౌర్ణమికి నాలుగురోజుల ముందు రాత్రి. వెన్నెల నిండు యవ్వనంలా మెరుస్తున్నది. చెన్నకేశవుడి గుడిలో శ్యామాంగి నృత్యం. ఇసుక వేస్తే రాలనంత జనం. అన్ని కులాల, అన్ని మతాల మనుషులూ అక్కడున్నారు.

ముందువరసలో, తన ఇష్టసఖులతో కూర్చునివున్నాడు బాలచంద్రుడు. నృత్యం మొదలైంది.

శ్యామాంగి అందం, పాట, ఆ శరీరపు నునుపూ, వొంపూ, దాని వగలూ చూసి బాలచంద్రుని కోడెకారు వయసు చిటికెలో మారిపోయింది. బాలచంద్రుడు శ్యామాంగి వలపుల వలలో చిక్కుకున్నాడు.

బాలచంద్రుడి అందం చూచి శ్యామాంగికి కూడా మతిపోయినంత పనయింది. అతని మెప్పుకోసం, వివశురాలై నృత్యం చేసింది.

“ఏమైనాసరే! ఈమె నాకు కావాలి” అని అనుకున్నాడు బాలచంద్రుడు.

**********

సశేషం…

You may also like...

Leave a Reply