అధ్యాయం 16 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

“ఎవరు?”

“బాలచంద్రుడు!”

“ఏ బాలచంద్రుడు?”

“మహామంత్రి బ్రహ్మనాయుడి ఏకైక పుత్రుడు”

శ్యామాంగి తల్లి ముసలిది. దాని రొమ్ము పడమట చండ్రుదళ్ళే దిగజారిపోయింది.

“రండి ప్రభూ-రండి” అని ఆహ్వానించింది.

బాలచంద్రుడు లోపలికి వచ్చి

“శ్యామాంగి ఎక్కడ?” అన్నాడు.

ముసలిది కులుకు నవ్వు నవ్వి – కప్పురపు తాంబూలమిచ్చి – “పైన” అన్నది. బాలచంద్రుడు గుప్పెడు కాసుల్ని దాని ముఖాన చల్లాడు.

(శ్యామాంగికి మారుపేరు “సబ్బాయి” – దాన్ని ముద్దుకు అలా పిలిచారు కాబోలు.

పేరు ఎలా వచ్చిందో నిర్ధారించడం కష్టం.)

ఏ క్షణానైనా బాలచంద్రుడు ఇట్లా వస్తాడని శ్యామాంగికి తెలుసు. సాని సబ్బాయి, ప్రియులను ఆకర్షించుకోవటంలో అందె వేసిన చేయి. ప్రియులను టక్కులతో నొక్కిపట్టే “కళే” లేకపోతే “కళావంతుల” బ్రతుకు బూడిదలో పన్నీరే.

బాలచంద్రుడు మేడ పై భాగంలో హంసతూలికా తల్పంతో అలంకరించిన గదికొచ్చాడు.

అగరువత్తుల వాసన గుప్పుమన్నది.

సబ్బాయి జిగజిగలాడుతున్నది.

రొమ్ము మీద ముత్యాలహారం వేసింది. విరిదండలు సిగలో సొగసుగా తురిమింది. కస్తూరి కాటుకను కంటి కొసల మీద అందంగా దిద్దింది. కటిసీమ క్రిందుగా చీరను సొగసుగా జారవిడిచింది. దాని తొడల లావణ్యం అందంగా మన్మథుని విడిది ఇల్లులా ఉంది.

జారవౄత్తిలో వున్న కళలన్నింటినీ కుమ్మరించింది సబ్బాయి.

“శ్యామాంగీ!”


అది బెట్టుగా మాట్లాడలేదు కానీ గుట్టుగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకు బాలచంద్రుడి
మతిపోయింది. ఆ లాస్యంలో జాతి వజ్రాలు వొలికినట్లు కంపించాయి.

“శ్యామూ!” – శ్యామాంగి సిగ్గుతో మొగ్గయి, అటునుంచి ఇటుకు తిరిగి “ప్రభూ!” అంది.

అతను అంతులేని తమితో చెక్కిలి పంటితో నొక్కి “సిగ్గా! పలకవేం?” అన్నాడు.

“రాకరాక ప్రభువులు మా ఇంటికొస్తే – మాట తడబడుతోంది. మనసు తొణుకుతోంది.” అన్నది.

“నెరజాణవే!” అన్నాడు.

అది నవ్వి “మాజాతే అంత” అన్నది.

“అంటే – “

“జాణలు కాక మా జాతిలో పుడితే – మురుగు కాల్వలో పూసిన పువ్వులతో సమానమే!” అన్నది.

అతను దాని రొమ్ము మధ్యభాగంలో తలదాచుకున్నాడు.

“నిన్ను చూస్తే పిచ్చెక్కుతున్నది” అన్నాడు.

సబ్బాయి అతన్ని తన మీదకు లాక్కుని “ఈ శరీరము, ఈ సుఖమూ మీకొరకే – దోరపండును కొరికి తినండి” అన్నది.

తొలి శృంగారంలో సుఖం దొరికిన బాలచంద్రుడు దాని ఇంట రసికరాజ్యపు బందీ ఐనాడు.

*********

రాత్రంతా శ్యామాంగి ఇల్లూ, పగలంతా వినోదాలతో, ఆటలతో బాలచంద్రుడు క్షణం తీరికలేని మనిషయ్యాడు. బాలచంద్రుడు బొంగరాలాటలో ప్రవీణుడు.

వ్రతాలు నోయగా నోయగా లేకలేకపుట్టిన కొడుకు – మనసులో ఏం బాధపడతాడో అని, బాలచంద్రుడు తల్లి ఐతాంబ భయపడుతున్నది.

ఒక కొలిక్కిరాని రాచకార్యాలలో బ్రహ్మనాయుడు కొడుకు సంగతి ఎన్నడూ పట్టించుకోలేదు. పైపెచ్చు కొడుకును ఇటువంటి లాలసత్వానికి ప్రోత్సహించాడేమో కూడా. ఎందుకంటే పల్నాటినాట రక్తపుటేరులు పారిస్తాడని జ్యోతిష్కులు చెప్పిన మాట బ్రహ్మన్న మనసులో నాటుకుపోయింది. సహజంగా వీరుడూ, ఉద్రేకీ ఐన బాలచంద్రుడు రాజకీయాలకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిదని బ్రహ్మన్న ఉద్దేశ్యం.

ఈరోజుల్లోనే గండు కన్నమ కూతురు “మాంచాల”ను బాలచంద్రుడికిచ్చి పెళ్ళి చేశారు.

రంగరంగ వైభవంగా జరిగిన గొప్పపెళ్ళి అది. మాంచాల తల్లి “రేఖాంబ”. మంచితనానికి పెట్టిన పేరు.

పెళ్ళైన తర్వాత వచ్చే తొలిరాత్రి, నగాతో అలంకరించింన గదిలోకి మాంచాలను పంపారు. అగరొత్తుల వాసనలతో, మల్లెపూల పరిమళంతో, అందంగా అలంకరించిన గదిలో, సిగ్గులు సింగారించిన మాంచాల కాలుమోపింది.

కానీ బాలచంద్రుడు గదిలో లేడు. అప్పటికే అతను శ్యామాంగి ఇంట్లో వున్నాడు.

భర్త ఇంకా గదిలోనే వున్నాడనుకుని నునుసిగ్గులతో చిటికిన వేలికి చీరంచు చుట్టుకుని, కుడికాలు బొటనవేలితో నేలరాస్తూ గదిలోనే నిలబడిపోయింది మాంచాల.

స్త్రీ సహజమైన బిడియంతో నిలబడిపోయిన మాంచాల కాలం కాసేపు గడిచాక తలెత్తి చూస్తే భర్త లేడు.

గదంతా తిరిగింది.

బైట చంద్రవంక నదిలో వెన్నెల నిరరథకంగా పడుతోంది. ఆ వెన్నెలలానే ఆ రాత్రి మాంచాల బ్రతుకులో నిరుపయోగమైపోయింది.

కళ్ళ వెంట నీళ్ళొచాయి. నిట్టూర్పులతో, కన్నీళ్ళతో, మధ్యరాత్రి మీద మాంచాల కంటి మీదకు కునుకువచ్చింది.

**********

 

You may also like...

Leave a Reply