ఒక కళాకారుడి మృతి!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
ఒక కళాకారుని అస్తమయం
రాజకీయ నాయకుడు కాదు
రాజకీయక్రీడాంగణంలో కధాకళీలసలే రావు
అయినా అతడు చివరి వూపిరి వదిలితే
జనసముద్రం శోకసముద్రమయిపోయింది
సీమాంధ్రులెవరు తెలంగాణ్యులెవరు?
ఆ ఉప్పొంగిన శోకసముద్రంలో
ఎవరికన్నీళ్ళెంత శాతం?
సమస్త ఆంధ్రావని ఒక్క కంఠంతో
ఒక్క వూపిరితో కళామతల్లికి ముద్దుబిడ్డడైన
అతనికి అశ్రుతర్పణాలిచ్చారు.
అదీ ఆంధ్రులజీవనాడి!
కళాభిమానం ఉగ్గుపాలతో జీర్ణించుకున్న
సంస్కృతి మనది!
ప్రక్క రాష్ర్టంలో రజని అంటే పడిచచ్చే మన 
యువతకి మరణించిన మన నటుడికోసం వాళ్ళ రజనీలు, కమలులు
ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదో మన పత్రికలు రాయలేదోమరి!
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రులు ఆదరించే అమితాభ్ లూ
అమీర్లూ ఎక్కడ? ఉన్నట్టుండి భావదారిద్య్రం ఆవహించిందేమో
సంతాపాలులేవు, సందేశాలూ లేవు!
 
మనం మాత్రం తన మృత్యువుతో మనల్ని శోకసంఘటితం చేసిన మహా మనిషికి నిజాయితీగా నివాళులర్పిద్దాం!

You may also like...

Leave a Reply