నిష్ఫల జీవితం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

నీళ్ళు నిండిన గుంతలా
లోతెరుగని మనసుతో
యెన్నాళ్ళిల్లా బతికేది?

చెప్పాపెట్టకుండా కురిసే వానను
గుప్పిట్లో బంధించాలనే వో జీవితకాలపు వాంఛని
రెప్పలకి అంటించి తిరిగినా
ఫలించని ఆశ.

ఎన్నిసార్లు దాటినా అదే మైలురాయి
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది
ఉసూరుమనే ప్రాణాలు
ఆ పక్కనే వున్న చెరువులో బుడగల్లా తేల్తాయి

మచ్చలేని గోడ మీద
బట్టల్లేని పిల్లదాన్నొకదాన్ని
వాల్ పోస్టర్లా అంటించి
వెళ్ళిపోతాడొకడు.

అభిప్రాయాల్లేని నిష్ఫల జీవితానికి
చిట్కా వైద్యం పెద్ద వూరట

You may also like...

Leave a Reply