నిరాకారం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

గర్భగుడిలో సైతం

విగ్రహముండదు


పురాతన దేవాలయం

అన్నీ విడిచి రమ్మంటుంది

దూరంగా ప్రవహించే నది

కడిగేది పాపాల్ని కాదు

నీ నిన్నటిని

* * *

చల్లని రాతి మీద

కాసేపు సేదదీరు

ఎదురుగా నల్లని స్తంభం

నిన్ను నీకు చూపే అద్దం

మౌనంలోకి గుడిగంట

ఆ అలలతో పాటు

నీ ప్రశ్నలు కూడా

* * *

మెట్లు దిగి వచ్చేస్తుంటే

ఆఖరి మెట్టు అడుగుతుంది కదా

అన్నిటికీ జవాబులు దొరికినట్టేనా?”


You may also like...

Leave a Reply