ఆధునిక నవవిధ భక్తి !!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
శ్రవణం – ఎప్పుడూ రణగొనిధ్వని చేసే మ్యూజిక్ albums, సంగీతాన్ని కేవలం రాజస గుణాన్ని ప్రేరేపించే ఆధునిక సంగీతం వినడం. వింటూ తమలో తాము రమించి పోవడం.  (భాగవతం ఎవరికి బాగా తెలుసు అంటే “శుకోవేత్తి” అంటాడు పరమ శివుడు. అంత చక్కగా, గాఢంగా శ్రవణం చేసాడు శుకుడు. ఇప్పటివాళ్ళు చెవిలో జోరీగల్లాంటి ఐపాడో, వాక్ మ్యానో పెట్టుకొని తమలో తామే ఊగిపోతుంటారు. వాళ్ళు వింటున్నది వాళ్ళ జీవితానికి ఎంత వరకూ ఉపయోగమో దేవుడి కెరుక!)


కీర్తనం – ఎప్పుడూ ఏదో ఒక vulgar పదాన్నో లేక ఈమధ్య “ఓహ్! షిట్ ” అనే దాన్నో వాడడం (దేవగంధర్వుడైన నారదుడు ముల్లోకాలనూ ఉద్ధరించే హరికీర్తనలు చేసాడు. ఈనాటి గాయకులు ద్వంద్వార్థ గీతాల్ని నోరారా ఆలపిస్తుంటే, మతి చెడిన యువత వాటిల్నే పాడుకొంటూ కాలం వ్యర్థం చేస్తున్నారు.)


స్మరణం – సినిమా ధ్యానం – డ్రెస్ వేసుకొనే విధానం – ఎలా తన శరీరాకృతిని అందాన్ని తీర్చి దిద్దుకోవాలనే తపన, శరీర సౌందర్యోపాస(కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మొక్కవోని ధైర్యంతో అఖండ నామస్మరణం చేయడానికి ప్రతీక ప్రహ్లాదుడు. అగ్నిలో ధగ్ధమౌతున్నా, శూలాలు దిగుతున్నా, ఏనుగు త్రొక్కుతున్నా, సముద్రంలో మునుగుతున్నా, తన దేహబాధల్ని పట్టించుకోకుండా హరి స్మరణలో మునిగి సుఖించినవాడు ప్రహ్లాదుడు.  ఈరోజు ఓ వార్తాపత్రికలో చదివాను – రోగంతో మంచాన పడ్డ తండ్రికి సేవ చేయలేక కిరోసిన్ పోసి కాల్చేసాడట ఒక కొడుకు. అందుకు మరోకారణం అతని భార్య దెప్పిపొడుపులు. ప్రహ్లాదుడు తన తండ్రికి చెడుజన్మ నుండి విముక్తి సుఖాన్ని కలిగిస్తే కలికాలపు కొడుకులు ఇహంలోనే నరకాన్ని చూపిస్తున్నారు. ఇక వీరికి “స్మరణ” భక్తి ఎక్కడిది?)పాదసేవనం – రకరకాల చెప్పులు బూట్లు మార్చి మార్చి వేసుకోవడం (“హరిపాద సేవోద్యమి” అని శ్రీ మహాలక్ష్మికి ఉన్న ఒకానొక నామము. నారాయణుని పాదాలను ఒత్తడమంటే గంగాది సమస్త తీర్థాల్లోనూ స్నానం చేయడమే కదా! నేటికాలపు జనులు తమతమ పాదాలకు Pedicure చేసుకొంటూ తాదాత్మ్యత పొందేవారు, కాళ్ళను షాపుల వైపు తిప్పి నడిచేవారు)


అర్చనం – ఇది అందరూ కార్లలో దేవుని విగ్రహాలు ఉంచి పూవులు పెట్టడం, స్క్రీన్ సేవర్ గా దేవుని ఫోటోలు ఉంచుకోవడం – గ్రాఫిక్స్ ద్వారా పూలు చల్లడం వగైరాలు చేయడం ద్వారా చేస్తున్నారు. మరికొందరు గోడలపై అందమైన శృంగారపరమైన అమ్మాయల లేదా సిని కధానాయకుల చిత్రపటాలు ఉంచుకొని నిద్రకు ముందు నిద్రలేచాకా చూసి తరించిపోవడం (రాముని తమ్ముడు భరతుడు పాదులకు అర్చనచేస్తూ రాజ్య పాలన సాగించడం ద్వారా
అర్చనంలోని ఔన్నత్యాన్ని జగత్తుకు చాటాడు. నేడు చాలామంది CD ప్లేయర్ ద్వారా వ్రతాలు పూజలు జరిపించేస్తున్నారు. !)


వందనం – ఈ మధ్య గుండెల్లో పోడుచుకోవడం, గెడ్డం వేళ్ళతో తాకడం ఒకోసారి, పెదవులు తాకడం చేస్తూ అసలు చిహ్నమైనా నమస్కారం (చేతులు జోడించి) చేయడాన్ని చిన్నతనంగా భావించడం! (భగవంతునికి ఎలా ప్రణమిల్లాలని నేర్చుకోవాలంటే అక్రూరుడిని చూసి నేర్చుకోవాలని పెద్దలు చెబుతారు. నేటికాలంలో “అ” అరిగిపోయి, “ఫేసు టర్నింగు” లాంటి వంకరటింకర నమస్కారాలు చెలామణీలోకి వచ్చేసాయి)


దాస్యం – పెళ్లి కాకమునుపు అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి, పెళ్ళయ్యాక కొందరు పురుషులు సంపాదన, సుఖాలకు, మత్తు మందులకు దాసులైతే కొందరు ఆడాళ్ళు శ్వరానికి, హోదాకు, అహంకారానికి, అవైదికత్వానికి దాసులే కాదు బానిసులు (హనుమంతుడు దాస్యానికి ప్రతీక అంటారు. రామభక్తిలో ఆయన తరించి లోకోత్తరమైన కార్యాలు చేసాడు. నేటివారు మందుకో, మగువకో దాస్యులు. వీళ్ళ చేతలకు తా చెడ్డ కోతి లా ఉంటాయన్నది వేరే చెప్పాలా!)


సఖ్యం – పూర్తిగా ఏది అవైదిక ఆల్వాతో దానికి సఖులై చాల మంది అదే జీవన పరమార్ధమని భావించడం (అర్జునుడు = చెడుజనాలకు సహవాసాలకు అలవాటు పడ్డ వాళ్ళు అందరూ )


ఆత్మనివేదనం – కామం, క్రోధం, లోభం, మొహం, మదం, మాత్సర్యం మొ. లగు అరిషడ్వర్గాలకు ఆత్మ నివేదన చేస్తున్నారు (బలిచక్రవర్తి = అరిషడ్వర్గాలలో దేనికో ఒక దానికి బలి అయినవాళ్ళు )

 
దీనికి ముక్తాయింపుగా మరొక రకమైన భక్తి ఉంది (పేరు భక్తి బహుశః కాంగ్రెస్ వాళ్ళు నేర్పినట్లు ఉన్నారు రాజీవ్, ఇందిరా, నెహ్రు పేర్లు మన అన్ని ప్రభుత్వ పధకాలకు పెట్టినట్లు పైగా వై ఎస్ చాలవా అని (ఇందిరమ్మ బల్బు!!):


గంగా భవానీ కల్లు దుకాణం
భవానీ సారాయి దుకాణం
శ్రీ వేంకటేశ్వర బార్ అండ్ రెస్టారెంటు
తిరుమల Wines
షిర్డీ సాయి Wines
సాయి దుర్గా Wines
అపర్ణ బార్!

IVNS Raju

IVNS Raju

HR and OD Professional with over 29 years of unique experience in leveraging the Ancient Wisdom for designing and implementing various systems and diagnostic processes.

You may also like...

Leave a Reply