ముఖ్యమైన వాళ్ళకు…

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొన్నిసార్లంతే …

హృదయ స్పందనలోంచి పుట్టిన
భావాల సీతాకోక చిలుకల్ని
గుండెలోనే బంధించడం తప్ప
స్వేచ్చగా వదల్లేం…

చెప్పాల్సిన జవాబే అయినా
వ్యక్త పరచలేం …

దోసిట్లో పట్టుకున్న వాన నీరు
వేళ్ళ సందుల్లోంచి జారిపోయినా
ఆకాశపు కబుర్ల హాయి
నరాల్లో ఇంకా తెలుస్తూనే ఉంది.

కురిసే వర్షాన్నీ
పెరిగే వెన్నెలనీ
ఆస్వాదించిన సమయం
వృధా అనుకుంటే
బ్రతకడం రానట్టే …

You may also like...

Leave a Reply