మీరా చెప్పని మోడీ కోడు!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

శిష్య: నమస్కారం గురూ!

గురు: మస్కారాలు శిష్యా! వెర్రోహం….వెర్రోహం!

శిష్య: ఇదేమిటి గురూ! ఈ టైపు కుర్తా వేసుకొన్నారు?

గురు: ఇది బొందోహం కుర్తా అన్న కొత్త టైపు రా!

శిష్య: అటులనా గురూ! బై ద వే…మీ బొంద కుర్తాను చూడగా నాకో డౌటు వచ్చింది గురూ!

గురు: హు…హు…హు…అడుసు కడుక్కోవడానికి, అనుమానం అడుక్కోవడానికి పుట్టాయిరా! అనుమానమ్ అడుక్కో, సందేహాన్ని కడుక్కో!

శిష్య: ధన్యోస్మి గురూ! విషయమేమిటంటే….మీరా నాయరు అనబడు అమ్మణ్ణి ఒక్కర్తి మోడి అమెరికాలో వేసుకొన్న కుర్తాల గురించి ఏదో విపులంగా రాయగా నేను యధాలాపంగా చదివాను గురూ. దాని పై మీ అభిప్రాయం….

గురు: ఏమిరా శిష్యా! విశేషణాలు వేయడం మర్చిపోతున్నావు?

శిష్య: క్షమించండి గురూ! మీ అద్భుత, అమోఘ, అమూల్యాభిప్రాయం తెలపాలని ప్రార్థిస్తూ, అభ్యర్థిస్తున్నాను!

గురు: విభక్తులెరుగని వెర్రి శిష్యా! వినుకో….

శిష్య: చెప్పండి గురూ…

గురు: ఇంతకూ ఆ నాయరమ్మణ్ణి ఏమనెనురా?

శిష్య: అదే…మోడి కాషాయపు కుర్తా వేసుకొని ఏదో చెప్పకూడని సందేశాన్ని ఇచ్చినాడని అమ్మణ్ణి సందేహం వెలిబుచ్చింది గురూ!

గురు: ఔరా! మీరా!

శిష్య: ఎవరు? నేనా?

గురు: కాదురా అక్కు శిష్య పక్షీ! ఆ ఔరా ఆ మీరా నాయరమ్మణ్ణికి చెందిందిరా!

శిష్య: ఓహో! సరే మీ అద్భుత…అమోఘ…అమూల్యా…

గురు: వినుకోరా శిష్యా! మోడీ వారు కాషాయపు కుర్తాను ధరించి నేను ఫలానొక్క మతాన్ని ఒంటిపైకెత్తుకున్నానని చెప్పెనని, అలా చెప్పడం సర్వసత్తాక, సార్వభౌమత్వ, సమసమాజ, గతితార్కిక, మార్మిక, సెక్యులరిజానికి గొడ్డలిపెట్టువంటిదని ఆమె ఘోషించెను గదరా!

శిష్య: ఆహా! అవును గురూ! నాకునూ ఆ ఘోషలో మోసమేమీ లేదని అనిపించుచున్నది!

గురు: పించునురా! మూర్ఖా! అట్లే అనిపించునులే! బొందావతారి!

శిష్య: నాకేడ్పొస్తోంది గురూ!

గురు: నీవు ధరించిన బిరుదాలను వల్లిస్తే నీకేలరా ఏడ్పు?

శిష్య: వద్దు గురూ! దెప్పకండి! అసలు విషయం విడమర్చి, మీరా చెప్పని మోడీ కోడును విప్పి చెప్పి ఉద్ధరించండి!

గురు: అదిరా సన్మార్గమంటే! వినుకొ! కాషాయము ఒక్క మతముదా? మన జాతీయ జెండాలో లేదట్రా!

శిష్య: కాదు గురూ! ఉంది గురూ! అంటే ఒక్క మతానికి కాదు, జెండాలో ఉందని నా ఘోష గురూ!

గురు: భేషు! జాతీయ జెండాలో ఉన్న రంగును ప్రధాని వేసుకొన్నాడని చెప్పక, ఒక మతపు రంగును వేసుకొన్నాడని అనడంలోని మర్మమేమిరా?

శిష్య: ఖర్మ గురూ! ధర్మమెరుగని ఖర్మ!

గురు: అదీ! అలా తెలుసుకో! ధర్మ మర్మాలు కర్మవీరులకు గానీ కర్మసన్నాసులకు తెలియరావురా!

శిష్య: బుద్ధొచ్చింది గురూ! మీరా చెప్పని మోడీ కోడును విడివిడిగా, పొడి పొడిగా అందించిన మీ పాదపద్మాలకు….

గురు: నిత్యానంద సేవా టికెట్టుకొని అర్చించుకోరా!

శిష్య: @#$%^&

@@@@@ 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *