లికీ వీక్స్ – సరికొత్త కేబుల్స్

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.

 

హల్లో వ్యూయర్స్ ! వెల్కం టు టీవీ జీరో వెరీ స్పెషల్ ప్రోగ్రాం “లికీ వీక్స్”. నేను ఉల్లి వెంకట్…మీ కోసం తీసుకొస్తున్నాను – అత్యంత రహస్యమైన, ఎవ్వరూ ఊహించలేని సత్యాలను. ఈ వారపు లికీ వీక్స్ లో మేమందించబోయే సెన్సేషనల్ కేబుల్స్ చదువుతాను, వినండి!

 

 • 29/07/2008 న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన షేర్వాణీ గుండీల్ని సరిగ్గ పెట్టుకోలేదు. అంతేకాదు గుండీల్లో ఒకటి ఊడిపోయివుండింది. మరో గుండీని వెంటనే కుట్టుకోకుండా సోమరితనాన్ని ప్రదర్శించిన భారత ప్రధాని దేశోద్ధారకుడని ఎలా నమ్మేది? ఈ అత్యంత రహస్యమైన విషయం మాకు ఎలా తెలిసిందని అనుకుంటున్నారు కదూ! ప్రధాని ఇంటికెదురుగుండా వుండే బిచ్చగాడు మాకీ రహస్యాన్ని చేరవేసాడు.

 

 • 31/12/2009 అర్ధరాత్రి న్యూ యియర్ పార్టీలో పాల్గొన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ “I am not bachelor. I am unmarried. Thats all” అని తన క్లోజ్ ఫ్రెండ్ జ్యోతిరాదిత్య సింధియాతో అన్నాడు. అంటే భారతీయులకు “bachelor” కు “unmarried” కు తేడా తెలీదనే కదా రాహుల్ నమ్మకం? ఇలాంటి డొంకతిరుగుడు మాటలు మాట్లాడేవాళ్ళు కాబోయే దేశాధినేతలా? ఈ ఘోరమైన నగ్న నిజం ఆ పార్టీలో రాహుల్ టేబుల్ పైనే కూర్చునివున్న గుడ్లగూబ మెదడుని డీకోడ్ చేసి తెలుసుకున్నాం.

 

 • 15/08/2010 న ప్రణబ్ ముఖర్జీదాదా తో సమావేశమైన సోనియా చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికిగల రహస్య కారణాల్ని వివరించారు. “ఛూడాండీ ప్రణబ్ దాదాజీ! హీరో చిరంజీవి కుర్ర హీరోయిన్లనీ, వెర్రి వాంపుల్నీ, జగమొండి అత్తల్నీ సంభాళించే కెపాసిటీని ఛాలా సినిమాల్లో చూపించాడని అప్పట్లో వైయెస్సార్, ఇప్పట్లో ఖిరణ్ ఖుమార్ రెడ్డీ ఛెప్పారు. అంధుఖనే ఆయన్ను కాంగ్రెస్ లోకి థీసుఖున్నం”. విషయం ఇంకా అర్థం కానట్టు మొహం పెట్టిన ప్రణబ్ దాను జాలిగా చూస్తూ “లుక్ దాదా! మనకూ  జగామొండి అత్తలూ, కుర్ర హీరోయిన్లు ఉన్నారు. ఐ మీన్…ఫరెగ్జాంపుల్…మొమతా దీదీ, జయాలలితా ఆంటీ, జయ్ సుధా, జయ్ ప్రదా ఎట్సెట్రా ఎట్సెట్రా. గాటిట్ ?” అంది సోనియా. వెంటనే ఆ గదిలో కరెంట్ పోవడం కాకతాళీయమే గానీ యాధృఛ్ఛికం కాదు. ఈ విషయం మాకు ఎలా తెలిసిందని కదా మీ డౌట్? కొంచెం ఫేస్ టర్నింగిచ్చుకొంటే చెప్తాం. ప్రణబ్ జీకి ఈ విషయాన్ని సోనియాంబాళ్ నొక్కి వక్కాణిస్తున్నప్పుడు ఆమె చెయ్యి కింద నలిగి చచ్చిన దోమను అటాప్సీ చేసి ఈ విషయాన్ని పసిగట్టాం.

మరిన్ని లేటెస్ట్ లీక్స్ తో వచ్చే వీక్స్ లో కలుస్తాం. అందాకా టేకేర్..డోంట్ షౌట్ బేర్ బేర్…బై బైలతో మీ ఉల్లి వెంకట్ !!

Products from Amazon.in

You may also like...

Leave a Reply