గీత గోవిందం – తృతీయ సర్గము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

సప్తమ అష్టపది – ఆడియో (Audio track of 7th Ashtapadi)

images/stories/ashtapadi/14 Asta7 Boobalam.mp3

 

తృతీయ సర్గ: – ముగ్ధ మధుసూదన:

 

శ్లో. కంసారిరపి సంసార వాసనాబద్ధ శృంఖలాం
 రాధామాధాయ హృదయే తత్యాజ వ్రజసుందరీ:

శ్రీకృష్ణుడు కూడా సంసార వాసనలలో కట్టివేయగల రాధను మనసులో తలచుకొని అందమైన గోపస్త్రీల నందరినీ త్యజించెను.

శ్లో. ఇతస్తతస్తా మనుసృత్య రాధికా
 మనంగ బాణ ప్రణ ఖిన్న మానస:
 కృతానుతాప: స కళింద నందినీ
 తటాంత కుంజే విషసాద మాధవ:

మదన బాణముల తాకిడిచే కలిగిన గాయములచే వేదన పడుచున్న మనస్సు గలవాడు, రాధను బాధించితినే అని పశ్చాత్తాపము పడుచున్నవాడును అయిన కృష్ణుడు రాధికను ఇక్కడా అక్కడా వెదికి ఆమెను గానక యమునా నదీ తటమున గల ఒక పొదరింటిలో విషాదముతో కూర్చుండెను.

అష్టపది 7

 • ముగ్ధమధుసూదన హంసక్రీడనం ఘూర్జరీ రాగ యతి తాళాభ్యాం గీయతే – భూపాళ రాగం ఆది తాళం

మా మియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన
సాపరాధతయా మయాపి న వారితాతిభయేన
హరి హరి హతాదరతయా గతా సా కుపితేన    (భృవం)

కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ
కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ

చింతయామి తదాననం కుటిల భ్రూ కోప భరేణ
శోణ పద్మమివోపరి భ్రమతాఆకులం భ్రమరేణ

తామహం హృది సంగతామనిశం భృశం రమయామి
కిం వనేనుసరామి తామిహ కిం వృధా విలపామి

తన్వి ఖిన్నమసూయయా హృదయం తవాకలయామి
తన్న వేద్మి కుతో గతాసి న తేన తేనునయామి

దృశ్యసే పురతో గతాగతమేవ మే విదధాసి
కిం పురేవ ససంభ్రమం పరిరంభణం న దదాసి

క్ష్మ్యతామపరం కదాపి తవేదృశం న కరోమి
దేహి సుందరి ! దర్శనం మమ మన్మధేన దుతోమి

వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన
మిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన

గోపికా సమూహముచే ఆవరింపబడియున్న నన్నుజూచి రాధ బాధపడి అలిగి వెళ్ళిపోయినది.  నేను అపరాధిని గనుక భయముతో ఆమెను వెళ్ళవద్దని వారించలేక పోయితిని.  నాయందు ఆదరము కోల్పోయినదై రాధ కోపముతో వెళ్ళిపోయినది.

ఆరాధ చిర విరహము వలన ఏమి చేయగలదు, ఎంఇ అనగలదు? ఇక నాకు ధనముతో ప్రయోజనమేమి పరిజనముతో పనియేమి? ఇంటితో పనియేమి? ఇక నా జీవితముతో ప్రయోజనమేమి?

కోప భారము చేత వంకరలు తిరిగిన కనుబొమలతో, పైన తిరుగుచున్న తుమ్మెదచే చికాకు పడు ఎర్ర తామర వలేనున్న రాధ ముఖమును స్మరించుచున్నాను.

నేను వన ప్రదేశమున రాధను ఎందుకు వెదకుచున్నాను? ఈ అడవిలో వృధాగా ఎందుకు విలపిస్తున్నాను? రాధ నా హృదయంలోనే వున్నదిగదా! ఆమెను సంతోషపరుస్తాను.

చెలీ! నేను చేసిన అపచారం వలన నీవు అసూయచే ఖిన్నురాలవైనావని భావిస్తున్నాను.  లేనిదే, ఎందుకు నను విడిచి పోతావు? నేను నమస్కరిస్తున్నాను, బ్రతిమాలుచున్నాను.  నాకు నీ ప్రవర్తన అర్ధం కావడంలేదు.

నా సమక్షంలో కనబడుతున్నావు.  అటూఇటూ వస్తూ పోతూ వున్నావు.  కానీ పూర్వంలాగా నాలో తన్మయత్వం గలిగేలా నన్ను కౌగిలించుకోవడం లేదు.  ఎందువలన?

సుందరీ ! క్షమించు.  ఇలాంటి తప్పిదం మళ్ళీ చేయను.  నాకు దర్శనం ఇవ్వు.  మన్మధ బాధనొందుచున్నాను.

బిందు బిల్వ వంశవారాశి సుధాకరుడును, హరిదాసుడును అయిన జయదేవ కవిచేత ఈ గీతము వర్ణించబడినది.

 

 

 

శ్లో. హృది బిసలతా హారో నాయం భుజంగమ నాయక:
 కువల దళ శ్రేణీ కంఠే న సా గరళ ద్యుతి:
 మలయజ రజో నేదం భస్మ ప్రియా రహితే మయి
 ప్రహరసి హర భ్రాంత్యానంగ ! కృధా కిము ధావసి

ఓ మదనా ! ప్రియురాలు లేని నన్ను శివుడని భ్రమపడి నీ పుష్పబాణములు నాపై విసరకుము.  నా వక్షస్థలమున తామరతూడుల హారము సర్పముగాదు.  నా కంఠమున గల నల్ల కలువ రేకులు గరళముగాదు.  ఇది చందనపు పొడి, భస్మము కాదు.  కోపంతో నన్నెందుకు బాధిస్తున్నావు?

శ్లో. పాణౌ మా కురు చూత సాయకమముం మా చాపమారోపయ
 క్రీడానిర్జిత విశ్వ మూర్చిత జనాఘాతేన కిం పౌరుషం?
 తస్యా ఏవ మృగీదృశో మనసిజ ప్రేంఖత్కటాక్షాశుగ
 శ్రేణీ జర్జరితం మనాగపి మనో నాద్యాపి సందుక్షతే

నీ క్రీడల చేత విశ్వమునే నిర్జించిన మదనా !  చేతిలో మామిడిపువ్వు బాణము పట్టకుము.  ధనుస్సును సంధింపకుము.  నేను మూర్చితుడను.  నన్ను బాధ పెట్టుట నీకు పౌరుషమా?  లేడి చూపుల నా ప్రియురాలి కటాక్ష బాణ పరంపరతో చిల్లులు బడిన నామనస్సు ఇంకా స్వస్థ పడలేదు.

శ్లో. భ్రూ పల్లవం ధనురపాంగ తరంగితాని
 బాణా గుణ: శ్రవణపాళి రతి స్మరేణ !
 తస్యామనంగ జయ జంగమ దేవతాయా
 మస్త్రాణి నిర్జిత జగంతి కి మర్పితాని?

తనకు విజయం కలిగించే సంచార దేవత వలె వున్న రాధలో ఆ మన్మధుడు ఆమె చిగురాకువంటి కనుబొమ్మే ధనువుగా, ఆమె తరంగితములైన చూపులే బాణములుగా, ఆమె శ్ర్వణపాళి అల్లెత్రాడుగా, జగమును జయించగల అస్త్రాలన్నీ ఆమెలోనే వుంచాడా?

శ్లో. భ్రూ చాపే నిహిత: కటాక్ష విశిఖో నిర్మాతు మర్మ వ్యధాం
 శ్యామాత్మా కుటిల: కరోతు కబరీ భారోఒపి మారోద్యమం
 మోహం తావదయం చ తన్వి ! తనుతాం బింబాధరో రాగవాన్
 సద్వృత్త: స్తనమండల స్తవకధం ప్రాణైర్మమ క్రీడతీ

తన్వీ ! రాధా ! నీ కనుబొమ్మ యను విల్లులో ఎక్కుపెట్టిన నీ క్రీగంటి చూపులనే బాణములు మర్మస్థానములో వ్యధను కలిగించవచ్చు.  నల్లగాను, వంకరగాను వున్న నీ జడ చంపడానికి ప్రయత్నించ వచ్చు.  అనురాగము గల దొండపండు వంటి నీ పెదవి మోహము కలిగించవచ్చు.  కానీ గుండ్రముగా వున్న నీ స్తనమండలం నా ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నది?

శ్లో. తాని స్పర్శ సుఖాని తే చ సరళా: స్నిగ్ధా దిశోర్విభ్రమా:
 తద్వక్త్రాంబుజ సౌరభం స చ సుధా స్యందీ గిరాం కక్రిమా
 సా బింబాధర మాధురీతి విషయాసంగేపి చేన్మానసం
 తస్యాం లగ్న సమాధిహంత ! విరహ వ్యాధి: కధం వర్ధతే

అవే స్పర్శ సుఖాలు, అవే తరళములు స్నిగ్ధములు అయిన విలాసములు, అదే ముఖ కమల సౌరభము, అదే అమృతము చిందించు వాక్చాతుర్యము, అదే తియ్యని దొండపండు వంటి పెదవి.  ఇలా ఆమె అవయవాలను ఆరాధిస్తూ నా మనస్సు రాధలో ఏకాగ్రమై వున్నప్పటికీ నా విరహ వ్యాధి వృద్ధి అవుతున్నదే గాని తగ్గుటలేదు.  కారణమేమి?

శ్లో. తిర్యక్కంఠ విలోల మౌళితరళోత్తంసస్య వంశోచ్చర
 ద్దీప్తిస్థాన కృతావధాన లలనా లక్షైర్న సంలక్షితా:
 సమ్ముగ్ధే మధుసూదనస్య మధురే రాధా ముఖేందౌ సుధా
 సారే కందళితాశ్చిరం దదతు వ:క్షేమం కటాక్షోర్మయ:

కంఠం అడ్డంగా తిప్పి, తలలోని కిరీటం కదులుచుండగా, దీప్తిస్థానంలో వేణువు మ్రోగుచుండగా, ఆ పాటలోని ఆసక్తితో వచ్చిన లక్షల గోపికలచే చూడబడినవీ, అమృత వర్షం వలే మనోహరములైనవీ, రాధ ముఖ చంద్రబింబంలో చిగురులెత్తునవీ అయిన శ్రీకృషణ కటాక్ష తరంగములు మనకు క్షేమము కలిగించుగాక.

ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే ముగ్ధమధుసూదనో నామ తృతీయస్సర్గ:

 


 

 

English Translation available @ 

 

Gita govinda. With an English introd. by M.V. Krishna Rao (1900)

 

Link courtesy: Ms. M.S. Lakshmi

You may also like...

Leave a Reply