గీత గోవిందం – సప్తమ సర్గము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

త్రయోదశ అష్టపది – ఆడియో (Audio track of 13th Ashtapadi)

images/stories/ashtapadi/23 Asta 13 Aahiri.mp3

 


 సప్తమ స్సర్గ: – నాగర నారాయణ:


 

శ్లో. అత్రాంతరే చ కులటా కుల వర్త్మ పాత
 సంజాత పాతక ఇవ స్ఫుట లాంచన శ్రీ:
 బృందావనాంతర మదీపయ దంశు జాలై:
 దిక్సుందరీ వదన చందన బిందురిందు

 

రాధ విరహబాధను వివరిస్తున్నప్పుడు చంద్రుడు వుదయించాడు.  స్త్రీల దారికి అడ్డురావడం కారణంగా పాప కళంకం నల్ల మచ్చగా కనిపిస్తుండగా, చంద్రుడు తూర్పు దిక్కు అనే స్త్రీ ముఖం పై చందనపు బొట్టు లాగా, తన యొక్క కిరణాలను బ్దృందావనంలో విస్తరింపజేసాడు.

శ్లో. ప్రసరతి శశ ధర బింబే
 విహిత విలంబే చ మాధవే విధురా
 విరచిత వివిధ విలాపం
 సా పరితాపం చకారోశ్చై:

చంద్రోదయం మూలంగా రహస్యంగా కలుసుకోవడం కుదరదు గనుక, కృష్ణుడు తన వద్దకు ఇంకా రానందుకు రాధ చాలా బాధపడినది.

అష్టపది 13

 • నాగర నారాయణ రాసావలయ: మాలవరాగ యతి తాళాభ్యం గీయతే

కధిత సమయేపి హరిరహహ న యయౌ వనం
మమ విఫలమిద మమలరూపమపి యౌవనం
యామి హే ! కమిహ శరణం
సఖీ జన వచన వంచితాహం   (ధృవం)

యదనుగమనాయ నిశి గహనమపి శీలితం
తేన మమ హృదయమిద మసమశర కీలితం

మమ మరణమేవ వరమితి వితధ కేతనా
కిమిహ విషహామి విరహానల మచేతనా

మా మహహ ! విధురయతి మధుర మధు యామినీ
కాపి హరిమనుభవతి కృత సుకృత కామినీ

అహహ ! కలయామి వలయాది మణి భూషణం
హరి విరహ దహన వహనేన బహు దూషణం

కుసుమ సుకుమార తను మతనుశర లీలయా
స్రగపి హృది హంతి మా మతివిషమ శీలయా

అహమిహ హి నివసామి న విగణిత వేతసా
స్మరతి మధుసూదనో మామపి న చేతసా

హరి చరణ శరణ జయదేవ కవి భారతీ
వసతు హృది యువతిరివ కోమల కలావతీ

చెప్పిన సమయానికి శ్రీహరి రాలేదు.  నా సొగసు, వయసూ వృధ అయినవి కదా.  నా సఖీజనుల వలన వంచింపబడినాను.  ఇప్పుడు ఎవరిని శరణు వేడెదను?

వానికోసం చీకటిలో వెదికాను.  నా స్వామి లేకపోవుటచే నాలో మన్మధ బాణాలు గుచ్చుకుంటున్నవి. కృష్ణుడు లేకుండా ఈ వ్యర్ధ స్థలంలో అచేతనురలనై ఈ విరహ బాధను ఎలా సహించగలను? మరణమే నాకిక శరణ్యము.

మధురమైన ఈ వసంత రాత్రి నన్ను వేధిస్తున్నది.  ఎంతో పుణ్యం చేసికొన్న మరొక స్త్రీ శ్రీహరి ని అనుభవించుచున్నది. 

హరి విరహాగ్నిలో దహించబడుతున్న నాకు ఈ మణిభూషణములతో పని లేదు. పుష్పముల వలే కోమలమైన నా తనువును నా ఎదపైని పూదండ మన్మధ బాణం వలే బధిస్తున్నది.

అనేకములైన చెట్లు గల పొదరింటిలో నేను విరహంతో వున్నాను.  మధుసూదనుడు నన్ను తలచుటకూడా లేదు. 

కోమల కలావతి యైన యువతి వలే హరి చరణముల జేరిన జయదేవ భారతి, మీ హృదయములందు వసించుగాక.

 


చతుర్దశ అష్టపది – ఆడియో (Audio track of 14th Ashtapadi)

images/stories/ashtapadi/24 Asta 14 Saranga.mp3

శ్లో. తత్కిం కామపి కామినీమభిసృత: ! కిం వా కలా కేళిభి:
 బద్ధో బంధుభి ! రంధకారిణి వనాభ్యర్ణే కి ముద్భ్రామ్యతి
 కాంత: క్లాంతమనా మనాగపి పధి ప్రస్థాతుమేవాక్షమ:
 సంకేతీకృత మంజువంజుళ లతా కుంజేపి యన్నాగత:

కృష్ణుడు మరియొక కామినితో తిరుగుతున్నాడా? బంధువులైన గోపికల కలాకేళీ లో చుక్కుకొన్నాడా?  ఈ చీకటి కీకారణ్యంలో తిరుగుతున్నాడా? ఈ పొదరింటికి ఇంకా రాలేదు.  నా వియోగ బాధను తాళలేక నడవలేకున్నాడా?
 

శ్లో. అధాగతాం మాధవమంతరేణ
 సఖీమియం వీక్ష్య విషాద మూకాం
 విశంకమానా రమితం కయాఅపి
 జనార్ధనం దృష్టవ దేత దాహ

శ్రీకృష్ణుడు వెంట లెకుండానే సఖి రాగా, విషాదంతో నోట మాట రాని ఆమెను చూచిన రాధకు, జనార్దనుడు మరొక స్త్రీతో క్రీడిస్తున్నాడని భావించింది.

అష్టపది 14

 

 • హరి రమిత చంపకశేకర: వసంత రాగ యతి తాళాభ్యాం గీయతే

స్మర సమరోచిత విరచిత వేశా
గళిత కుసుమ దర విలుళిత కేశా
కాపి మధురిపుణా
విలసతి యువతిరధిక గుణా   (ధృవం)

హరి పరిరంభణ వలిత వికారా
కుచ కలశోపరి తరళిత హారా

విచలదలక లలితానన చంద్రా
తదధర పాన రభస కృత తంద్రా

చంచల కుండల దలిత కపోలా
ముఖరిత రశన జఘన గతి లోలా

దయిత విలోకిత లజ్జిత హసితా
బహువిధ కూజిత రతి రస రసితా

విపుల పులక పృధు వేపధు భంగా
శ్వసిత నిమీలిత వికసదనంగా

శ్రమ జల కణ భర సుభగ శరీరా
పరిపతితోరసి రతి రణధీరా

శ్రీ జయదేవ భణిత హరి రమితం
కలి కలుషం జనయతు పరిశమితం

నాకంటే గొప్ప గుణములు కల ఒక స్త్రీ సముచితమైన వస్త్రములు ధరించి జడలో పూలతో కృష్ణునితో మన్మధ కేళి లో ఆనందిస్తున్నది. కుచకుంభములపై హారము కలిగి, హరి ని కౌగిలించుటచే కామవికారాన్ని పొందినది.

చంద్రుని లాంటి ఆమె ముఖము పై ముంగురులు కదలుచుండగా, కృష్ణుని అధర పానంజేసి తన్మయత్వం లో పులకిస్తున్నది. చంచలమైన కుండలములు కపోలము పై లలది, చప్పుడు చేయుచున్న పెద్ద పిరుదులు కలది.

కృష్ణుని జూచి సిగ్గు పడుతున్నది.  అనేక ధ్వనులు చేస్తూ రతిలో ఆనందిస్తూ చిరునవ్వు చిందిస్తున్నది.

పులకరింతతో వొణుకుచున్నది.  కళ్ళు మూసికొని రతిలో అలసినది.  కామోద్రేకంతో రమిస్తున్నది.

రతి వలన కలిగిన స్వేదము వలన తడిసిన శరీరంతో సుఖిస్తున్నది.  రతి యుద్ధం తరువాత కృష్ణుని రొమ్ము పై పడుకున్నది.

జయదేవ కవి రచించిన హరి రతి క్రీడా విలాసములు, కలియుగ కలుషాలను హరించుగాక.

 

పంచాదశ అష్టపది – ఆడియో (Audio track of 15th Ashtapadi)

images/stories/ashtapadi/25 Asta15 Saaveri.mp3


శ్లో. విరహ పాండు మురారి ముఖాంబుజ
 ద్యుతిరయం తిరయన్నపి వేదనాం
 విధురతీవ తనోతి మనో భువ:
 సుహృదయే హృదయే మదన వ్యధాం

మన్మధుని మిత్రుడైన చంద్రుడిని చూస్తుంటే విరహంతో పాలిపోయిన ముఖము గల కృష్ణుడు నాకు మేదులుచున్నాడు.  వాని ముఖారవిందమును చంద్రుని లో చూచి ఆనందిద్దామంటే, సఖీ, చంద్రుడే కామ వ్యధను హృదయంలో అధికం చేస్తున్నాడే !

అష్టపది 15

 

 • హరిరస మన్మధతిలక: ఘూర్జరీ రగైక తాళీ తాళాభ్యాం గీయతే

సముదిత మదనే రమణీవదనే చుంబన వలితాధరే
మృగమదతిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే
రమతే యమునా పుళిన వనే విజయీ మురారిరధునా    (ధృవం)

ఘన చయ రుచిరే రచయతి చికురే తరళిత తరునాననే
కురవక కుసుమం చపలా సుషమం రతిపతి మృగకాననే

ఘటయతి సుఘనే కుచయుగగగనే మృగమదరుచి రూషితే
మణివర మమలం తారక పటలం నఖపదశశి భూషితే

జితబిసశకలే మృదుభుజయుగళే కరతల నళినీదళే
మరకత వలయం మధుకర నిచయం వితరతి హిమ శీతలే

రతి గృహ జఘనే విపులాపఘనే మనసిజ కనకాసనే
మణి మయ రశనం తోరణ హసనం వికిరతి కృత వాసనే

చరణ కిసలయే కమలానిలయే నఖమణిగణ పూజితే
బహిరపవరణం యావక భరణం జనయతి హృది యోజితే

రమయతి సుదృశం కామపి సుభృశం ఖల హలధర సోదరే
కి మఫలమవసం చిరమిహ విరసం వద సఖి ! విటపోదరే

ఇహ రసభణనే కృత హరిగుణనే మధురిపు పద సేవకే
కలియుగ చరితం న వసతు దురితం కవినృప జయదేవకే

సఖీ ! ఇప్పుడు విజయుడైన మురారి యమునా నది ఒడ్డున ఇసుకు తిన్నెలపై వనములో రమించుచున్నాడు.

ఒక వనిత ముఖాన్ని ముద్దు పెట్టుకొనుటకై తనవైపుకు తిప్పుకొనుచున్నాడు.  ఆ ముఖం పై కస్తూరి పెడుతున్నాడు.  అది ఆమెకు పులకరింత కలుగజేస్తున్నది.

సఖీ ! యువకులకు చాపల్యం కలుగజేయగల ఒక యువతి యొక్క దట్టమైన అడవి వంటి కురులలో మెరుపు లాంటి పుష్పాన్ని తురుముతున్నాడు.

ఘనమైన కుచ కుంభములపై కస్తూరిని ధరింపజేస్తున్నాడు.  వాటిపై గోటితో గాటు పెడుతున్నాడు.  ఆకాశంలో చుక్కల వలే ఆమే స్తనములను మురారి రత్నమాలతో అలంకరిస్తున్నాడు.

ఆమె భుజములు తామర తూడుల వలే వున్నాయి. అరచేతులు పద్మదళలవలే వున్నాయి.  ఆమె భుజాలు మంచు వలే చల్లగా వున్నాయి.  వాటికి కృష్ణుడు మరకత మణి కంకణాన్ని తొడుగుతున్నాడు.

ఆమె పిరుదులు మన్మధుని బంగారు సింహాసనం లాగా వున్నాయి. అవి కృష్ణునికి వుద్రేకాన్ని కలిగిస్తున్నాయి.  వాటిని మణుల తోరణంతో అలంకరిస్తున్నాడు.

ఆమె లేత చరణాలు లక్ష్మికి నిలయం.  అవి గోళ్ళనే మణులతో పూజింపబడతాయి.  వాటిని తన మనస్సులో తలచుచూ వానికి అరుణిమగల రసాన్ని రాస్తున్నాడు.

హలధరుడు బలరాముని సోదరుడైన కృష్ణుడు అందమైన కన్నులు గల దానినే ఆరాధిస్తుంటే, సఖీ, అతనికోసం ఈ పొరరింట్లో నిష్ఫలంగా, నీరసంగా ఎదురుచూడడం వృధ కదా !
 
రసవంతమైన పదాలు గల గీతం తో హరి గుణ గానం చేసే మధుసుదన పాదసేవకుడైన జయదేవ కవిరాజుకు కలియుగ పాపాలు అంటకుండుగాక !

 

షష్ఠ్యాదశ అష్టపది – ఆడియో (Audio track of 16th Ashtapadi)

images/stories/ashtapadi/26 Asta16 punnaga.mp3


శ్లో. నాయాత: సఖి నిర్దయో యది శర్స్త్వం దూతి ! కిం దూయసే ?
 స్వచ్చందం బహువల్లభ: స రమతే కిం తత్ర తే దూషణం?
 పశ్యాద్యప్రియ సంగమాయ దయితస్యాకృష్యమాణాం గుణై:
 ఉత్కంఠార్తి భరాదివ స్ఫుటదిదం చేత: స్వయం యాస్యతి

దూతి గా వెళ్ళి వచ్చిన ఓ సఖీ ! నిర్దయుడూ, ధూర్తుడు నావద్దకు రాకపోతే ఎందుకు చింతిస్తావు?  అతడు ఎందరో ప్రియురాళ్ళతో రమిస్తుంటే, దానిలో నా తప్పు ఏమున్నది?  అతిశయించిన కోరికవల్లను, దు:ఖం వల్లను పగిలిన నా హృదయం ప్రియుని గుణాలచే ఆకర్షింపబడి వానితో కలియుటకు వెళ్ళుతోంది చూడు.

అష్టపది 16

 

 • నారాయణ మదనాయాస: దేశవరాళీ రాగేణ రూపక తాళేణ గీయతే

అనిల తరళ కువలయ నయనేన
తపతి న సా కిసలయ శయనేన
సఖీ ! యా రమితా వనమాలినా   (ధృవం)

వికసిత సరసిజ లలితముఖేన
స్ఫుటతీ న సా మనసిజ విశిఖేన

అమృత మధుర మృదుతర వచనేన
జ్వలతి న సా మలయజ పవనేన

స్థల జలరుహ రుచికర చరణేన
లుఠతి న సా హిమకర కిరణేన

శజల జలద సముదయ రుచిరేణ
దళతి న సా హృది విరహభరేన

కనక నిష రుచి శుచి వసనేన
శ్వసితి న సా పరిజన హసనేన

సకల భువనజన వర తరుణేన
వహతి న సా రుజ మతి కరుణేన

శ్రీ జయదేవ భణిత వచనేన
ప్రవిశతు హరి రపి హృదయ మనేన

సఖీ, గాలికి కదలాడే పద్మాల వంటి కన్నులు గల వనమాలి తో రమించిన స్త్రీ చిగురాకుల శయ్య మీద పరితపించదు. కోమలమైన పద్మము వంటి ముఖము గల వనమాలి తో రమించిన స్త్రీ మన్మధుని బాణాలకు ఛిద్రం కాదు.

తియ్యనైన అమృత వచనములు చేసే వనమాలి తో రమించిన స్త్రీ శీతలములైన గాలులకు తాపము చెందదు. తామర తూడులవంటి కర చరణాల వనమాలితో రమించిన స్త్రీ చంద్రుని కిరణాలకు విలవిలలాడదు.

కారుమబ్బుల వంటి వనమాలి తో సుఖము పొందిన యువతి యొక్క హృదయం విరహ బాధను చెందదు. శుభ్రమైన పీతాంబరములు ధరించిన వనమాలితో రమించిన స్త్రీ పరిజనుల వికటములకు నిట్టూరుపు చెందదు.

అన్ని భువనములలోని జనులలో ఉత్తమ యువకుడైన వనమాలితో రమించిన వనిత కరుణార్ధ్రమైన విరహాన్ని కలుగదు.

శ్రీ జయదేవ కవి వచనముల ద్వారా హరి మన హృదయాలలో ప్రవేశించుగాక.

శ్లో. మనోభవానందన ! చందనానిల
 ప్రసీద రే దక్షిణ ! ముంచ వామతాం
 క్షణం జగత్ప్రాణ ! నిధాయ మాధవం
 పురో మమ ప్రాణహరో భవిష్యసి

మనోభవునికి ఆనందం కలిగించే చందన వనం నుండి వీచు ఓ పవనమా, దక్షిణ దిక్కునుండి ప్రసరించువాడా, నీ వంకరతనాన్ని వీడుము.  జగతికి ప్రాణమునిచ్చు ఓ వాయువా! మాధవుడిని ఒక్క క్షణం నా ముందు నిలుపుము.  నన్ను బాధించి నా ప్రాణాలను హరిస్తున్నావు.

శ్లో. రిపు రివ సఖీ సంవాసోఒయం శిఖీవ హిమానిలో
 విష మివ సుధారశ్మిర్యస్మిన్ దునోతి మనోగతే
 హృదయమదయే తస్మిన్నేవం పునర్వలతే బలాత్
 కువలయ దృశాం వామ: కామో నికామనిరంకుశ:

అతడు నా మనసులో ఉండుట వలన, చెలికత్తెల నడుమ వుండటం నన్ను బాధిస్తున్నది.  అమృతకిరణాలు వర్షించే చంద్రుడు కూడా విషం వలే హింసిస్తున్నాడు.  కృష్ణుని చుట్టూ నా మనస్సు తిరుగుతున్నది.  కఠినుడైన మన్మధుడు పద్మనయనలను పీడిస్తున్నాడు.

శ్లో. బాధాం విదేహి మలయానిల ! పంచబాణ
 ప్రాణాన్ గృహాణ న గృహం పునరాశ్రయిష్యే
 కిం తే కృతాంత భగిని ! క్షమయా తరంగై:
 అంగాని సించ మమ శామ్యతు దేహదాహ:

ఓ విదేహి, ఓ మలయానిలుడా, నన్ను బాధించుము.  నాగృహమునకు నేను ప్రాణములతో తిరిగి వెళ్ళను.  ఓ యమునా నదీ, నీ తరంగాలతో నా తనువును తడుపుము.  అలా నా దేహమునకు వుపశమనము కలుగుగాక.

శ్లో. ప్రాతర్నీల నిచోల మచ్యుత ముర స్సంవీత పీతాంబరం
 రాధాయాశ్చకితం విలోక్య హసతి స్వైరం సఖిమండలే
 వ్రీడా చంచల మంచలం నయనయో రాధాయరాధాననే
 స్వాదుస్వేరముఖోయమస్తు జగదానందాయనందాత్మజ:

తెల్లవారుఝామున రాధామాధవులు తమ మందిరము నుండి వచ్చినప్పుడు రాధ యొక్క నల్లని వస్త్రాన్ని అచ్యుతుడు, వాని పీతాంబరాన్ని రాధ కట్టుకున్నారు.  అదిచూచిన చెలికత్తెలు పకపకా నవ్వగా సిగ్గు పడుచున్న రాధను చిరునవ్వుతో చూస్తున్న కృష్ణుడు జగమునకు ఆనందము కలిగించుగాక.

 

||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే నాగర నారాయణ: నామ సప్తమ స్సర్గ:||

{jcomments on}

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *