గీత గోవిందం – పంచమ సర్గము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

దశమ అష్టపది – ఆడియో (Audio track of 10th Ashtapadi)

images/stories/ashtapadi/18 Asta10 Anandhabiravi.mp3

 

 


పంచమ: సర్గ: – సాకాంక్ష పుండరీకాక్ష:


 

శ్లో. అహమిహ నివసామి యాహి రాధాం
 అనునయ మద్వచనేన చానయేధా:
 ఇతి మధురిపుణా సఖీ నితుక్తా
 స్వయమిదమేత్య పునర్జగాద రాధాం

 

నేను ఈ పూతీగల పొదలో వుంటాను. నీవు వెళ్ళి రాధను అనునయించి నామాటగా చెప్పి, నేను రమ్మన్నానని కోరి తీసికొనిరమ్ము ! ఈరకంగా శ్రీకృష్ణునిచే నియమింపబడిన సఖి రాధవద్దకు వచ్చి ఇలా అంటున్నది.

అష్టపది 10

 

 • హరిసముదయ గరుదపద: దేశవరాళి రాగేణ రూపక తాలేన గీయతే

వహతి మలయ సమీరే మదన ముపనిధాయ
స్ప్ఠతి కుసుమ నికరే విరహి హృదయ దళనాయ
తవ విరహే వనమాలీ సఖి ! సీదతి, రాధే  (ధృవం)

దహతి శిశిర మయూఖే మరణమనుకరోతి
పతతి మదన విశిఖే విలపతి వికలతరోఒతి

ధ్వనతి మధుప సమూహే శ్రవణమపిదధాతి
మనసి కలిత విరహే నిశి నిశి రుజముపయాతి

వసతి విపిన వితానే త్యజతి లలిత ధామ
లుఠతి ధరణి శయనే బహు విలపతి తవ నామ

రణతి పికసమవాయే ప్రతిదిశ మనుయాతి
హసతీ మనుజనిచయే విరహ మపలపతి నేతి

స్పురతి కలరవరావే స్మరతి మణిత మేవ
తవ రతిసుఖవిభవే గణయతి సుగుణ మతీవ

త్వదభిధశుభమాసం వదతి నరి శృణోతి
తమపి జపతి సరసం యువతిషు న రతి ముపైతి

భణతి కవి జయదేవే విరహ విలసితేన
మనసి రభస విభవే హరిరుదయతు సుకృతేన

మదనుడు వెంట వుండగా, మలయ మారుతం వీస్తుండగా, వికసించిన పూవులు విరహి జనుల హృదయాలను వేధిస్తుంటే, సఖీ ! నీ విరహంతో వనమాలను ధరించిన కృష్ణుడు బాధపడుచున్నాడు.

చల్లని కిరణాల చందమామ వెరహంతో దహించుచుండగా మృత్యువును అనుసరిస్తున్నాడు.  మాదన బాణాలవలన వికలమైన మనస్సు కలవాడై విలపిస్తున్నాడు.

తుమ్మెదలు ఝుంకారం చేస్తుంటే దానిని భరించలేక చెవులు మూసుకొంటున్నాడు.  ప్రతి రాత్రి విరహ బాధతో రోగగ్రస్తుడౌతున్నాడు.

అరణ్యాలలో నివసిస్తున్నాడు.  లలితమైన తన గూహాన్ని వదలినాడు.  నేలపై దొర్లుతున్నాడు.  అనేకవిధాలుగా నీన్నే పిలుస్తూ విలపిస్తున్నాడు.

కోయిలల గుంపు కూయుచుంటే  అన్ని దిక్కులా పిచ్చివానివలే పరిగెడుతున్నాడు.  అందరూ నవ్వుతారేమో అని తన విరహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

కపోతముల ధ్వనిని కూడా నీతో జరిపిన రతి ధ్వనిగానే భావిస్తున్నాడు.  ఆ రతి సుఖ వైభవాన్ని బాగా గుర్తుచేసికొంటున్నాడు.

నీ శుభ మాసమును అందరూ చెప్పుకొంటుంటే, ఆనందంతో వింటున్నాడు.  ఆ రాధా మాసమునే ఎల్లప్పుడూ మననం చేసికొంటున్నాడు. ఇతర యువతులతో అనురాగాన్ని కోరుకోవడం లేదు.

శ్రీకృష్ణుని విరహవిలాసాలను జయదేవ కవి వచించగా విని పాడెడి ఉత్సాహం గలవారి సుకృతం వల్ల వారి మనసులలో హరి వుదయించుగాక.

 

 

 

ఏకాదశ అష్టపది – ఆడియో (Audio track of 11th Ashtapadi)

images/stories/ashtapadi/19 Asta11 Kedaragowli.mp3

శ్లో. పూర్వం యత్ర సమం త్వయా రతి పతేరసాదితా: సిద్ధయ:
 తస్మిన్నేవ నికుంజ మన్మధ మహా తీర్థే పునర్మాధవ:
 ధ్యాయంస్త్వామనిశం జపన్నపి తవైవాలాప మంత్రావళీం
 భూయస్త్వ్త్కుచ కుంభ నిర్భర పరీరంభామృతం వాంచతి

మన్మధ సుఖం నీతో పూర్వం ఎక్కడైతే లభించిందో ఆ మహాతీర్ధంలో మాధవుడు మళ్ళీ ఎల్లప్పుడూ నినె తలచుచూ, నీ పలుకుల మంత్రాలను జపిస్తూ నీ కుచ కుంభముల కౌగిలైంతల అమృతాన్ని వాంచిస్తున్నాడు.

అష్టపది 11

 

 • సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధుర: ఘూర్జరీ రాగేణ ఏకతాళేన గీయతే

 

రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం
న కురు నితంబిని ! గమన విళంబన మనుసర తం హృదయేశం
ధీర సమీరే యమునా తీరే వసతి వనె వనమాలీ
గోపీ పీనపయోధర మర్దన చంచల కరయుగశాలీ     (ఢృవం)

నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదు వేణుం
బహు మనుతే నను తే తనుసంగత పవన చలితమపి రేణుం

పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం
రచయతి శయనం సచకితనయనం పశ్యతి తవ పంధానం

ముఖరమధీరం త్యజ మంజీరం రిపుమివ కేళిషు లోలం
చల సఖి ! కుంజం సతిమిరపుంజం శిలయ నీల నిచోళం

ఉరసి మురారేరుపహిత హారే ఘన ఇవ తరళ బలాకే
తటిదివ పీతే ! రతి విపరీతే రాజసి సుకృత విపాకే

విగళిత వసనం పరిహృత రశనం ఘటయ జఘనమపిధానం
కిసలయ శయనే పంకజ నయనే ! నిధిమివ హర్ష నిధానం

హరిరభిమానీ రజనిరిదానీమియమపి యాతి విరామం
కురు మమ వచనం సత్వర రచనం పూరయ మధు రిపు కామం

శ్రీ జయదేవే కృత హరి సేవే భణతి పరమ రమణీయం
ప్రముదిత హృదయం హరిమతిసదయం నమత సుకృత కమనీయం

మంచి పిరుదులు గల రాధా, రతి సుఖసారమైన స్థానంలో మదనమైన మనోహర రూపం గల ఆ హరిని కలుసుకొనుటకు వెళ్ళు.  ఆలసింపకుము.  గోపికల పయోధరములను మర్దించుంచు వనమాలి పిల్లగాలులు వీచే యమునానదీ తీరంలో ఉన్నాడు.

వేణువు మీద నీ పేరుతో పాడుతూ తానున్న చోటును గుర్తుజేస్తున్నాడు.  నీ శరీరాన్ని తాకి ఎగిరిన ధూళిని సైతం గొప్పవిగా భావిస్తున్నాడు.

పక్షి ఈక పడినను , ఆకులు కదలిననూ, నువ్వు వచ్చావని అనుకొని నీకు శయ్యని తయారుచేస్తున్నాడు.  చకిలితమైన కన్నులతో నీకోసం దారితెన్నులు కాస్తున్నాడు.

రతిక్రీడలో చాలా చప్పుడు చేసే నీ కాలి గజ్జలను తీసివేయుము.  చీకటితో నిండిన పొదరింటికి నల్లని వస్త్రం కప్పుకొని వెళ్ళుము.

బంగారు వన్నె గల రాధా, నీ పుణ్యము వలన ఉపరతి జరుపునప్పుడు, నీ మెడలోని ముత్యల హారం కృష్ణుని వక్ష స్థలంపై పడుతుంటే అది తెల్లని పాల పక్షులు కలిగిన నల్లని మేఘం వలె, నీవు మేఘం పై మెరుపు లాగా వెలుగుతావు.

ఓ విశాల నేత్రాలు గల రాధా, జాఇపోయిన చీరతో, నగ్నమైన మొలతో ఆనందాన్ని కలిగించే నీ శ్రిరాన్ని లేత ఆకుల శయనము పై వుంచుము.

హరి  అభిమాన ధనుడు.  ఆలశ్యం చేయకుము. రాత్రి పూర్తి కాబోతున్నది.  త్వరగా పొమ్ము.  నామాట విని స్వామి కోరిక తీర్చుము.

హరి యొక్క సేవ జేయు జయదేవ కవి గీతమును రమణీయంగా పాడగా, ఎంతో దయామయుడు, మంచి పాటలకు పరవశించేవాడు, అయినట్టి హరికి ఆనందమయమగు హృదయాలతో మ్రొక్కండి.

శ్లో. వికిరతి ముహు: శ్వాసానాశా: పురో ముహురీక్షతే
 ప్రవిశతి ముహు: కుంజం గుంజన్ముహుర్బహు తామ్యతి
 రచయతి ముహు: శయ్యాం ప్ర్యాకులం ముహురీక్షతే
 మదన కదన క్లాంత; కాంతే ! ప్రియస్తవ వర్తతే

రాధా, నీ స్వామి వేడి నిత్తూర్పులు విడుచుచున్నాడు.  నీరాకకై ఆత్రుతతో ఎదురుచూచుచున్నాడు.  నీకోసమై వెదుకుచున్నాడు.  తపనతో నీకోసం శయనమును తయారు చేస్తున్నాడు.  నీకోసం వ్యాకులత చేందుతున్నాడు.  మదన కదనం కొరకు పరితపించుచున్నాడు.

శ్లో. త్వద్వామ్యేన సమం సమగ్రమధునా తిగ్మాంశు రస్తంగతో
 గోవిందస్య మనోరధేన చ సమం ప్రాప్తం తమ: సాంద్రతాం
 కోకానాం కరుణ స్వనేన సదృశీ దీర్ఘా మదబ్యర్ధనా
 తన్ముగ్ధే ! విఫలం విలంబనమసౌ రమ్యోఒభిసారక్షణ:

నీ వక్ర చేష్టల వలే సూర్యుడు ఇప్పుడే అస్తమించాడు.  గోవిందుని విచారమైన మనస్సు వలే చీకటి చిక్కగా క్రమ్మింది.  చక్రవాక పక్షుల దీనస్వరములవలే దిర్ఘమైన నా మన్ననను వినుము.  ఓ ముగ్ధమైనదానా, ఆలస్యం సరికాదు.  వెళ్ళడానికి ఇదే సరైన సమయం.

శ్లో. సా మాం ద్రక్ష్యతి వక్ష్యతి స్మర కధాం ప్రత్యంగమాలింగనై:
 ప్రీతిం యాస్యతి రంస్యతే సఖి ! సమాగత్యేతి చింతాకుల:
 స త్వాం పశ్యతి వేపతే పులకయత్యానందతి స్వేదతి
 ప్రత్యుద్గచ్చతి మూర్చతి స్థిర తమ: పుంజే నికుంజే స్థిత:

రాధ తనను చూచినంతనే రమ్యమైన కధలు చెబుతుందని, ఆసాంతం ఆలింగనం చేసికొని ఆనందిస్తుందని, తనతో కృఈడిస్తుందని కృష్ణుడు అనేక ఆలోచనలతో నీకై ఎదురుచూస్తున్నాడు.  ఆ హరి చీకటిగా ఉన్న ఆ పొదరింట్లో ఉన్నాడు. విరహ బాధతో తపిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, చెమటతో తడిసినాడు, మూర్చపోతున్నాడు.
శ్లో. అశ్లేషాదను చుంబనాదను నఖోల్లేఖాదను స్వాంతజ
 ప్రోద్బాధాదను సంభ్రమాదను రతారంభాదను ప్రీతయో
 అన్యార్ధం గతయోర్భ్రమాన్మిళితయో: సంభాషణైర్జానతో:
 దంపతోరిహ కో న కో న తమసి వ్రీడా విమిశ్రో రస:

కౌగులించుకొనుటతో, చుంబించుటతో, గోళ్ళతో గీయుటతో, కమోద్రేకంతో, రతికేళితో, ఆనందిస్తూ, కటిక చీకటిలో ఒకరి నొకరు గుర్తించక రతి అంతములో తము భార్యాభర్తలుగా గుర్తించి తోడుదొంగలై సిగ్గుపడుచున్నారు.  ఈటువంటి లజ్జామిళిత రాత్రులలో ప్రాదుర్భవించని రసమేదీ లేదు.

శ్లో. స భయ చకితం విన్యస్యంతీం దృశౌ తిమిరే పధి
 ప్రతితరు ముహు: స్థిత్వా మందం పదాని వితన్వతీం
 కధమపి రహ: ప్రాప్తామంగైరనంగ తరంగిభి:
 సుముఖి ! సుభగ: పశ్యన్ సత్వాముపైతు కృతార్ధతాం

ఓ సుముఖీ ! చీకటిలో ఏమీ కనబడక భయంతో, బెదురు చూపులతో మాటిమాతికీ ఆగుతూ మెల్లిగా నడచుచూ వున్న మదన తరంగాలవంటి అవయవాలు గల నిన్ను ఎళాగొ గమనించి, సుందరుడైన స్వామి ఆనందించుగాక.

శ్లో. రాధా ముగ్ధ ముఖారవింద మధుప స్త్రైలోక్యమౌళిస్థలీ
 నేపధ్యోచిత నీల రత్నమవనీ భారావరారాంతక:
 స్వచ్చందం వ్రజ సుందరీ జన మనస్తోష ప్రదోషోదయ:
 కంస ధ్వంసన ధూమ కేతురవతు త్వం దేవకీ నందన:

రాధ యొక్క ముఖారవిందమునకు తుమ్మెదవంటివాడు, మూడు లోకాల తలలపై కీరీటానికి అలంకారమైన నీల రత్నమునూ, లోకానికి భారమైన రాక్షసులకు యముడునూ, గోపాంగనల మనస్సులకు ఆనందాన్ని ఇచ్చు సాయంసంధ్య వంటి వాడు, కంసుని వధించిన ధూమకేతువు అయిన దేవకీ నందనుడు కాపాడుగాక.

||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే అభిసారికావర్ణనే సాకాంక్షపుండరీకాక్షో నామ పంచమస్సర్గ:||

 {jcomments on}

You may also like...

Leave a Reply