గీత గోవిందం – అష్టమ సర్గము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

సప్తదశ అష్టపది – ఆడియో (Audio track of 17th Ashtapadi)

images/stories/ashtapadi/28 Asta17 Aarabi.mp3

 


 

అష్టమ: స్సర్గ: – విలక్ష్య లక్ష్మీపతి:


 

 

శ్లో. అధ కధమపి యామినీం వినీయ
 స్మర శర జర్జరితాపి సా ప్రభాతే
 అనునయ వచనం వదంత మగ్రే
 ప్రణతమపి ప్రియమాహ సాభ్యసూయం

 


రాత్రి మొత్తం మన్మధుని బాణాల కారణంగా జర్జరితురాలై బాధగా గడిపిన రాధ, ప్రభాత సమయంలో తన ప్రియుడు తనముందు వినయంగా నిలచి తన తప్పును 
మన్నించమని ప్రాధేయ పడుచున్నప్పుడు, అసూయతో రాధ ఇలా అంటున్నది...


అష్టపది 17

 

 • లక్ష్మీపతి రత్నావళీ భరవీ రాగ యతి తాళాభ్యాం గీయతే

రజన జనిత గురు జాగర రాగ కషాయిత మలస నివేశం
వహతి నయనమనురాగమివ స్ఫుటముదిత రసాభినివేశం
హరి హరి యాహి మాధవ ! యాహి కేశవ ! మా వద కైతవ వాదం
తా మనుసర సరసీరుహలోచన ! యా తవ హరతి విషాదం   (ధృవం)

కజ్జల మలిన విలోచన చుంబన విరచిత నీలిమ రూపం
దశన వసనమరుణం తవ కృష్ణ ! తనోతి తనోరనురూపం

వపురనుహరతి తవ స్మర సంగర ఖర నఖర క్షత రేఖం
మరకత శకల కలిత కల ధౌత లెపేరివ రతి జయ లేఖం

చరణ కమల గళదలక్త సిక్తమిదం తవ హృదయముదారం
దర్శయతీ వ బహిర్మదనద్రుమ నవ కిసలయ పరివారం

దశన పదం భవదధర గతం మమ జనయతి చేతసి ఖేదం
కధయతి కధమధునాపి మయా సహ తవ వపురే తదభేదం

బహిరివ మలినతరం తవ కృష్ణ ! మనోపి భవిష్యతి నూనం
కధమధ వంచయసే జనమనుగత మసమశర జ్వర దూనం

భ్రమతి భవానబలా కబళాయ వనేషు కిమత్ర విచిత్రం
ప్రధయతి పూతనికైవ వధూ వధ నిర్దయ బాల చరిత్రం

శ్రీ జయదేవ భణిత రతి వంచిత ఖండిత యువతి విలాపం
శృణుత సుధా మధురం విబుధా విబుధాలయతోపి దురాపం

మాధవ ! కేశవా ! కపటములాడకుము.  పద్మనయనుములవాడా, నీ విరహాన్ని పోగొట్టే ఆ యువతి వెంట వెళ్ళు. నీ యెర్రబడి అలసిన కనురెప్పల రసాభినవేశం, అనురాగం స్పష్టంగా కనిపిస్తున్నవి. 

కాటుక కనులను చుంబించుటవలన నల్లబారిన నీ పెదవులు నీ నల్లని రూపమునకు సరిపోయినవి. రతికేళిలో గోటి గాట్లు పడిన నీ శరీరం మరకత సకలాలతో బంగారు ఆభరణాలతో రతిజయలేఖ లాగా ప్రకాశిస్తున్నది.

ఒక యువతి యొక్క చరణాలనుండి జారుతున్న ఎర్రని లత్తుకతో తడిసిన నీ రొమ్ము చిగురుటాకు లాగా ఉన్నది. నీ పెదవిపై వేరొక యువతి పంటి గాట్లు నాకు బాధ కలిగించుచున్నది.  

నీ శరీరం కూడా నీ మనస్సు వలెనే మలినమయ్యింది.  ఎందుకంటే, మన్మధ జ్వరంచే నిన్ను ఆశ్రయిస్తున్న వారిని నువ్వు వంచిస్తున్నావు కనుక.

నీవు వనంలో అబలలను కబళించుటకు తిరుగుతున్నావు.  దీనికి ఆశ్చర్యం కలగటంలేదు. ఏందుకంటే చిన్నతనంలోనే పూతనను చంపిన దయలేని చరిత్ర వుంది కదా.

రతి వంచితయైన నాయిక యొక్క విలాపమును, జయదేవ కవి వర్ణించగా వినండి.  స్వర్గంలో కూడా లభ్యంగాని మధురమైన స్వామి శృంగార చరిత వినండి.

శ్లో. తవేదం పశ్యంత్యా: ప్రసరనుదరాగం బహిరివ

 ప్రియా పాదాలక్త చ్చురిత మరుణద్యోతి హృదయం
 మమాద్య ప్రఖ్యాత ప్రణయ భర భంగేన కితవ
 త్వదాలోక: శోకాదపి లజ్జాం జనయతి

ఓ మోసకారీ, ప్రియురాలి పాదాల లత్తుక తో ఎర్రబడిన నీ శరీరం అనురాగాన్ని కనబరుస్తున్నది.  నిన్ను చూచినయెడ ఎంతో ప్రఖ్యాతి గడించిన మన ప్రేమ భంగమైనది.  దీనివలన దు:ఖం కంటే సిగ్గు కలుగుతున్నది.


శ్లో. అంతర్మోహన మౌళి ఘూర్ణన చలన్మందార విభ్రంశన
 స్తంభాకర్షణ దృప్తి హర్షణ మహా మంత్ర: కురంగీ దృశాం
 దృప్యద్దానవ దూయమాన దివిషద్దుర్వార దు:ఖాపదాం
 భ్రంశ: కంస రిపోర్వపోహయతు వ: శ్రేయాంసి వంశీ రవ:

 

లేడి కన్నులు గలిగిన వనితల మనస్సులను మూర్చించునది, తలలను ఊపగలది, మందారములను క్రింద పడవేయునది, స్తంభించగలది, ఆకర్షించగలది, బాధించగలది, సంతోషము గలుగజేయునది, గర్వించే దానవుల పరితపించే దేవతల దు:ఖాలను నశింపజేయునది అయిన కంసుని వధించిన శ్రీ కృష్ణుని వేణుగానం అధిక శ్రేయస్సు కలిగించుగాక.

 

||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే విలక్ష్య లక్ష్మీపతిర్నామ అష్టమస్సర్గ:||


{jcomments on} 

You may also like...

Leave a Reply