గీత గోవిందం – ద్వితీయ సర్గము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

పంచమ అష్టపది – ఆడియో (Audio track of 5th Ashtapadi)

images/stories/ashtapadi/11 Asta5 Thodi.mp3

 

ద్వితీయ సర్గ: – అక్లేశ కేశవ:

శ్లో. విహరతి వనె రాధా సాధారణ ప్రణయే హరౌ
 విగళిత నిజోత్కర్షా దీర్ష్యావశేన గతాన్యత:
 క్వచిదపి లతాకుంజే గుంజన్మధు వ్రతమండలీ
 ముఖర శిఖరే లీన దీనాప్యువాచ రహ: సఖీం

శ్రీకృష్ణుడు బృందావనంలో అందరు స్త్రీలనూ, తనతో సమానంగా ప్రేమిస్తూ 

విహరిస్తూ ఉండగా రాధకు ఈర్ష్య కలిగింది.  తనూ, మిగిలిన గోపికలూ సమానమెట్లా అవుతారు? తన ఎడ ఎక్కువ ప్రేమ చూపాలి గదా!  అట్లా ప్రత్యేకానురాగం చూపని కృష్ణుని మీద అలిగి, ఈర్ష్యతో, సహించలేక మరోచోటికి వెళ్ళిపోయింది.  తుమ్మెదల ఝుంకారంతో మ్రోతగల మరో పొదరింట్లో చేరి దు:ఖంతో ఏకాంతముగా తన చెలికత్తెతో ఇలా అంటున్నది.

అష్టపది 5


మధురిపు రత్నకంఠిక
ఘూర్జరీ రాగేణ యతి తాళేన చ గీయతే

సంచరదధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం
చలిత దృగంచల చంచల మౌలి కపోల విలోల వతంసం
రాసే రరిమిహ విహిత విలాసం
స్మరతి మనో మమ కృత పరిహాసం          (ధృతం)

చంద్రక చారు మయూర శిఖండక మండల వలయిత కేశం
ప్రచుర పురందర ధనురనురంజిత మేదుర ముదిర సువేషం

గోప కదంబ నితంబవతీ ముఖ చుంబన లంభిత లోభం
బంధుజీవ మధురాధర పల్లవకలిత దరస్మిత శోభం

విపుల పులక భుజ పల్లవ వలయిత వల్లవ యువతి సహస్రం
కర చరణోరసి మణి గణ భూషణ కిరణ విభిన్న తమిస్రం

జలద పటల చలదిందు వినిందక చందన తిలక లలాటం
పీన పయోధర పరిసర మర్ధన నిర్దయ హృదయ కవాటం

మణి మయ మకర  మనోహర కుండల మండిత గండముదారం
పీతవసన మనుగత మునిమనుజ సురాసుర వర పరివారం

విశద కదంబ తలె మిళితం కలి కలుష భయం శమయంతం
మామపి కిమపి తరంగదనంగ దృశా మనసా రమయంతం

శ్రీ జయదేవ భణిత మతిసుందర మోహన మధు రిపు రూపం
హరి చరణ స్మరణం ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపం

 

సఖీ! కదులుచున్న సుధామధురమైన అధరమునుండి వెలువడు ధ్వనితో మోహనమైన పిల్లనగ్రోవి కలవాడు, కదలుచున్న తలలో-పింఛము కలవాడు, చెక్కిళ్ళపై కదలుచున్న కర్ణాభరణములు కలవాడును, రాసకేళిలో క్రీగంట గోపికలను చూస్తూ నన్ను పరిహసించే హరినే నా మనస్సు స్మరిస్తున్నది.

ఇతర గోపికలతో స్వేచ్చగా విహరిస్తూ, తనను లక్ష్య పెట్టని కృష్ణుని అపరాధమునకు బాధపడుతూ కూడా రాధ అతనినే స్మరిస్తున్నది.

నల్లని కేశములతో గుండ్రముగా చుట్టుకొనియున్న నెమలిపింఛము, హరివిల్లు చుట్టుకొన్న మేఘం వలె ఉన్నది.  అటువంటి కృష్ణుడు నాకు గ్ణాపకం వస్తున్నాడు.

చెలీ! గోపికల ముఖ చుంబనమునందు ఆసక్తి కలవాడును, బంధూపుష్ప సమానమైన పెదవిపై చిరునవ్వు గల కృష్ణుని నా మనస్సు స్మరిస్తున్నది.

సంతోషంతో పులకించిపోతున్న వేనవేల గోపయువతుల కౌగిళ్ళతో చుట్టబడినవాడును, కరములు, చరణములు, వక్షస్థలము నందు గల మణిభూషణముల కాంతితో చీకటిని పోగొడుతున్న కృష్ణుని స్మరిస్తున్నాను.

మేఘ సమూహంలో కదిలే చంద్రునివలే తన లలాటంలో చందనపు బొట్టు కలవాడును, గోపికల లావు చన్నులచే మర్దింపబడుటవలన కఠినమైన (దయలేని) హృదయ కవాటము కలవాడును అయిన కృష్ణుని నా మనస్సు స్మరిస్తున్నది.

మణిమయములైన కుండలములతో ప్రకాశించు గండస్థలము కలవాడును, పీతాంబరమును ధరించినవాడును, తనను అనుసరించుచున్న మునులు, మనుజులు, సురాసుర పరివారము కలవాడును అయిన కృష్ణుని నా మనసు స్మరిస్తున్నది.

విశాలమైన కదంబ వృక్షము చెంత నన్ను కలుసుకొనుటకై నిలుచున్నవాడును, కలియుగ కాలుష్య భయమును శమియించువాడును, కాలము కలిగించు చూపుతో, మనస్సుతో నన్ను రమియింపజేయు వాడగు  హరిని  నా మనసు స్మరిస్తున్నది.

అతి సుందరమైన, మోహనమైన మధురిపుయగు శ్రీకృష్ణుని రూపమును వర్ణించు ఈ జయదేవకవి గీతము – ఈ కాలమున పుణ్యవంతుల హరిచరణ స్మరణకు తగియున్నది.

 

 

 

ష్ట్యష్టపది – ఆడియో (Audio track of 6th Ashtapadi)

images/stories/ashtapadi/12 Asta6 kamboji.mp3

 

శ్లో. గణయతి గూణ గ్రామం భామం భ్రమాదపి నేహతే
 వహతి చ పరీతోషం దోషం విముంచతి దూరత:
 యువతిషు వలతృష్ణే కృష్ణే విహరతి మాం వినా
 పునరపి మనో వామం కామం కరోతి కరోమి కిం

నన్ను విడచి ఇతరులతో క్రీడించువాడునూ, యువతులలో ఎంతో తృష్ణ గలవాడును అయిన కృష్ణుని మరలా నామనస్సు కోరుకొనుచున్నది.  అతని గుణగానమే చేయుచున్నది.  భ్రమచేతనైనా కోపము పొందదు.  అతని దోషములను మరచుచున్నది.  పైగా సంతోషము పొందుచున్నది. ఏమి చేయనే చెలీ!

అష్టపది 6

అక్లేశకేశవ మంజరీతిలకం
మాళవగఊడ రాగేన ఏకతాళీ తాళేన చ గీయతే

నిభృత నికుంజ గృహం గతయా నిశి రహసి నిలీయ వసంతం
చకిత విలోకిత సకల దిశా రతి రభస భరేణ హసంతం
సఖి! హే కేశిమధన ముదారం
రమయ మయా సహ మదన మనోరధ భావితయా స వికారం   (ధృతం)

ప్రధమ సమాగమ లజ్జితయా పటు చాటు శతైరనుకూలం
మృదు మధుర స్మిత భాషితయా శిధిలీకృత జఘన దుకూలం

కిసలయ శయన నివేశితయా చిరమురసి మమైవ శయానం
కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధర పానం

అలస నిమీలిత లోచనయా పులకావలి లలిత కపోలం
శ్రమ జల సకల కళేబరయా వర మదన మదాదతిలోలం

కోకిల కలరవ కూజితయా జిత మనసిజ తంత్ర విచారం
శ్లధ కుసుమాకుల కుంతలయా నఖ లిఖిత ఘన స్థన భారం

చరణ రణిత మణి నూపురయా పరిపూరిత సురత వితానం
ముఖర విశృంఖల మేఖలయా సకచ గ్రహ చుంబన దానం

రతి సుఖ సమయ రసాలసయాదర ముకుళిత నయన సరోజం
నిస్సహ నిపతిత తనులతయా మధుసూదన ముదిత మనోజం

శ్రీ జయదేవ భణిత మిదమతిశయ మధు రిపు నిధువన శీలం
సుఖముత్కంఠిత గోప వధూ కధితం వతనోతు సలీలం

చెలీ! నాలో ఎన్నో మదన వాంఛలున్నవి. అవి నా మనస్సులో దాగివున్నవి.  అవి ఫలించే రీతిగా ఆ హరి నాతో రమించునట్లు చేయవే!

ఉదారుడు, అనేక శృంగార వికారములు గలవాడు, నేను ఏకాంతముగా పొదరింట్లో ఉన్నప్పుడు నాతోగూడా రాత్రియందు రహస్యంగా అక్కడే దాగియుండువాడు, నేను భయంతో నలుదెసలా చూచుచుండ హఠాత్తుగా నన్ను పట్టుకొని రతి సలుపువాడు కృష్ణుడు.

మొదటి కలయికలో సిగ్గుపడుచున్న నాతో ఏవేవో మంచిమాటలు చెప్పి బులిపించు అనుకూలుడు, తియ్యని చిరునవ్వుతో నను మాటలలో దింపి కొంటెగా నా నడుముకు గల వస్త్రమును లాగినవాడు!

 

చిగురుటాకుల శయ్యలో పడుకొనియున్న నా వక్షస్థలము పైనే చాలాసేపు పడుకొనెడివాడు, ఆలింగన చుంబనాదులతో నా అధరమును పానము చేయువాడు!

కనులు మూసుకొని ఆనందపడుచున్న నన్ను చూచి అతని చెంపలు గగ్గురుపాటు పొందెను.  అలసటతో నాశరీరము తడిసినది.  అతడు కామోద్రేకములో ఒళ్ళు తెలియకున్నాడు.

రతియొక్క అంతములో నేను కోకిల కలరవము చేయుచుండగా  మన్మధ తంత్ర విచారము సలుపువాడును, పూలురాలి పడిపోయిన, చెదిరిన కురులు గల నా ఘనమైన స్తనములపై తన గోళ్ళతో వ్రాయువాడు,

నా చరణముల నూపురములు ధ్వనించుచుండగా నాతో సంభోగించినవాడును, నా నడుమునకు ఒడ్డాణము శబ్దము చేయుచూ ఊడిపోగా, నా కొప్పు పట్టుకొని చుంబించువాడును!

నేను సంభోగము వలన కలిగిన ఆనందముతో ఆలసనై యున్న నాపై కొంచెము ముకుళించినవాడును, నిస్సహాయంగా పడియున్న నా శరీరమున మదన వాంఛను ఉదయింపజేసినవాడును అయిన మధుసూదనునితో నన్ను రమింపజేయవే! చెలీ!

శ్రీ జయదేవ కవి విరచితమైనదియు, మధురిపుడగు శ్రీకృష్ణుని అధిక రతిశీలము కలదియు, శృంగార లీలలు తెలుపునదియు, అధికమైన ఆసక్తి గల గోప వధువైన రాధ ద్వారా చెప్పబడినదియు అయిన ఈగీతము సుఖప్రదమగు గాక!

శ్లో. హస్త స్రస్త విలాస వంశమనృజు భ్రూవల్లి మద్వల్లవీ

 వృందోత్సారి దృగంత వీక్షిత మతిస్వేదార్ద్ర గండస్థలం

 మాముద్వీక్ష్య విలజ్జితం స్మిత సుధా ముగ్ధాననం కాననే

 గోవిందం వృజ సుందరీ గణ వృతం ప్శ్యామి హృష్యామి చ

చేతినుండి జారిన విలాసమైన వేణువు కలవాడును, వంకర తీగలవంటి కనుబొమలు గల గోపికా బృందంలో ఆసక్తితో చూచువాడును, చెమటతో తడిసిన చెక్కిళ్ళు కలవాడును నన్ను చూచి సిగ్గుపడువాడును, చిరునవ్వుల అమృతంతో అందమైన ముఖం కలవాడును అగు గోవిందుని బృందారణ్యంలో చూస్తున్నాను, సంతోషిస్తున్నాను.

శ్లో. దురాలొక స్తోక స్తబక నవకాశోక లతికా

 వికాస: కాసారోపవన పవనోపి వ్యధయతి

 అపి భ్రామ్యద్భ్రుంగీ రణిత రమణీయా న ముకుళ

 ప్రసూతిశ్చూతానం సఖి శిఖరిణీయం సుఖయతి

చిన్న చిన్న పువ్వుల గుత్తులతో సొగసైన అశోక వృక్షములు గల సరస్సులతో విరాజిల్లు ఉద్యానవనములలోని గాలి

సయితం నన్ను బాధిస్తున్నది.  ఆడు తుమ్మెదల గానము చే రమణీయమైన శిఖరాలు గల మామిడి చెట్ల మొగ్గలు సైతం నాకు సుఖకరంగా లేవు.

శ్లో. సాకూత స్మితమాకులాకుల గళద్ధమ్మిల్లముల్లాసిత
 భ్రూవల్లీ కమలీక దర్శిత భుజా మూలోర్ధ్వ హస్త స్తనం
 గోపీనాం నిభృతం నిరీక్ష్య గమితాకాంక్షశ్చిరం చింతయ
 న్నంతర్ముగ్ధ మనోహరం హరతు వ: క్లేశం నవ: కేశవ:

భావగర్భితమైన చిరునవ్వులు గలిగి, కామోద్రేకముతో జారుచున్న కొప్పులు గలిగి పైకెగయు కనుచూపులు గలిగి, ఏదో నెపముతో చేతులు పైకెత్తి స్తనములు చూపుచున్న గోపికలను రహస్యంగా చుచి వారి అనురాగాన్ని అర్ధం చేసికొని, వేరే ఆశలు వదిలి, అంతర్ముగ్ధ మనోహరుడై కేశవుడు మన క్లేశములను పోగొట్టుగాక.

||ఇతి శ్రీ జయదేవ కృతౌ గీతగోవిందే అక్లేశకేశవో నామ ద్వితీయ స్సర్గ:||

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *