యెట్లగబ్బా యేగేది?

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
గీమద్దెన నా తలబురకేదొ ఐపోనాది. దమాగ్ బిల్కుల్ కతమైపోనాది. మొన్నొపాలి మా పోరగాడు గదేటంతరు? ఆ…ఇస్కూలు పొగ్రెసు ముక్కట్టుకొస్సి “అయ్యా! ఈడ దస్కతెట్టు” అన్నడు. ఆడి సెతిలొనె పెన్నుండె.
 
గింతలోకి యింటిదొస్సి మొకంలోకె మొకంబెట్టి “ఆ కార్డు ముక్కల యేటున్నదొపాలి సూసెయ్యరాదేటి!” అని అర్సింది. యింటిదేసే ఆర్డరంటే అమెరికావోడి రాకెట్టే గదో! ఇంటిమా సక్కంగా సెంద్రలోకాన్కి తీస్కపోతది. ఇన్లేదా దిగొస్సేటేలకి నిప్పంటుకుపొద్ది. “సడేలేవే! సూత్తాగానీ నువ్వీడ్నుంచి వుర్కు” అని మొత్తుకొన్నా. మూతి మూడున్నరొంకర్లు తిప్పి పోనాది.

“ఒరె అబ్బయా! జర ఈ కార్డు ముక్కలో ఉన్నదేటో నువ్వే సెప్పు” అన్నా.

 
“నీకు సదవడం వస్తదిగా అయ్యా. నువ్వే సదూకో. ఈలోపట ఓ రౌండేసొస్త” అన్నడు. “ఏం రౌండేస్తవరా అబయా” అని అడ్గేటంతలోపటే బయటకుర్కిపోనాడు. ఆడి రౌండుకి మతబలు తెలీక తలబుర గీక్కొంటా కార్డు ముక్కని సూసినా.

తెలుగు 100 – 40
యింగిలీసు 100 – 35
హింది 100 – 38

యింగ సద్వలేకపోనా. సెంగడబింగడ అర్సబట్టినా.

 
“యోవ్! నీకేమైపోనాది గట్ల సించుకొంతన్నవ్”అని మల్లీ వొస్సింది యింటిది.
 
“సూడే! యెదవన్నర యెదవకి అన్నీ ప్యాసు మార్కులొస్సినయ్” అన్నా.
 
“ఆరినీ! పేల్ మార్కలొస్తె అరసాలి. ప్యాసు మార్కులొస్తే అరస్తవ? దమాగేమైన కరాబైనదేటి?” అదీ అరసబట్టె.
 
“ఎహె చస్! ఊకే అట్ల ఎగరమాక. ప్యాసు మార్కులంటే ఫేలు మార్కులకంటే జరంతెక్కవ అంతే” అన్న.
 
“అదో మల్లీ అదె సెప్త! ఫేలు మార్కులు రాలేదుగందా” అంది.
 
“సూడె! ఈడికి నూరు మార్కుల్కి నలబైయొస్సినయ్” అన్న గిప్పుడైనా సమజౌతదేటోనని.
 
“యెట్టా! నూరుకు నలబయ్యే! ఓలమ్మోలమ్మోలమ్మో! మాబాగొస్సిందే” అంది సింకిసేట మొగంతో.
 
“ఎట్టగే నీతొ ఏగేది? నలబై మార్కులంటే ఓగొప్ప అనుకున్నవేటి? ఈడికి కసవూడ్చే నౌక్రీ కూడియ్యరు తెల్సా” అన్న.
 
“వూకోయా! అన్ని మార్కులొస్తె కసవూడ్సె నౌక్రీ ఎట్లిస్తరు?” అంది.
 
“వుస్సో!” అన్నా.
 
“వూకె అర్సమాక! బీపీ ఎక్కవైద్ది. గమ్మునె సంతకమెట్టీసి తొంగొ..పో”అనేసి ఎల్లిపాయె.
“సంతకమెట్టీసినావా అయ్యా?” అనొచ్చిన ఆడ్ని సూడగానె ఈపాలి నిజ్జంగనె బిపి ఎక్కబట్టె.
 
“ఏరా యెదవా! తెలుగుల నూరుకు నలబయ్యేనా వస్త?” అన్న.
 
ఆడు జర నా మొకంలోకి సూసి “సానా కస్టపడ్నాయ్యా” అన్నడు.
 
“యేటి? అంత కష్టపడిపోనావేటి? సెప్పు ఎట్లపడ్నావో ఇన్కొంటా” అన్న.
 
“అచ్చుబుక్కులో ఓ తెలుగుంటదా! టీవీల ఇంకో తెలుగుంటదా! ఎఫ్ఫెమ్ము రేడియోల ఇంకో తెలుగుంటదా! న్యూసుప్యాపర్ల ఇంకో తెలుగుంటద! ఆంద్రా తెలుగు, తెలంగానా తెలుగు, రాయల్సీమ తెలుగు, సినిమా తెలుగు, యింటర్నెట్టు తెలుగు..” జర ఆగిండు.
 
“పాపం పిలగాడుగదో…వూపిరాడొద్దు.
 
“..మా అయ్య మాట్టాడే తెలుగు, అరవోడి తెలుగు, కన్నడవోడి తెలుగు, తెలుగు రానోడి తెలుగు” మల్లీ ఆగిండు.
 
“ఆ సివరాకరి తెలుగేందిరా” అన్న.
 
“గదే అయ్యా! మొన్నోపాలి సోనియమ్మ మనూరొస్సినప్పుడు మాట్లాడ్నే…గదన్నమాట” అని మల్లా తెలుగు రాగం ఎత్తబోయిండు
 
“వరే అబయా! యింగాపురా! ఇందపా దస్కతేసిండా” అన్న.
 
“థెంక్సయ్యా…మల్లా వో రౌండు ఏసొస్త” అని ఉర్కబోయిండు. లపుక్కన ఆడి జబ్బట్టుకొని “యేం రౌండురా” అంటి. “బైసకిల్లో రౌండేసొస్తాయా” అన్నడు. వొదిలేస్తి.

ఆనంక నా తలబురలో లొల్లి సూడవాల. మన్ దేసంల ఎన్నెన్ని కయిత్తాలు…దలిత కయిత్తం, ఆడ కయిత్తం, మొగ కయిత్తం, సమాజ కయిత్తం, యిప్లవ కయిత్తం, అబ్యుదయ కయిత్తం, మైనార్టీ కయిత్తం, మాల కయిత్తం, మాదిగ కయిత్తం…అబాబాబా….యెన్ని కయిత్తాలు. మందెక్కవైనాక మజ్జిగ పల్సనౌతదేటోగాని తెలుగు కయిత్తం మాత్తరం సిక్కనైపోతాంది. గళాసులోకి పోస్తే సుక్కసుక్కగానె దిగ్తది. గొంతులోకి ఏస్కొంటివా సుక్కాతిసుక్కగా, దిగ్తమావొద్దాన్నట్టు సానా నాజూగ్గా దిగ్తది. గిట్లా కయిత్తం నది ఎర్రాబెర్రి పార్తాంటే అడ్డగోలుగా తిట్టేస్త దాన్కి అడ్డమేయాల్ని సూత్తాంటారు కొన్ని జనాలు. యెట్లగబ్బా యేగేది **L**

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *