ఈ ఎడారిలోనూ ….

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెల
ఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా
గడిచిపోయి బ్రతికొచ్చే గతకాలపు సౌఖ్యంలా
జలతారుల చిరు కదలికలో మెరుపు పూల మాలికలా
ఏకాంతపు రాత్రికి జలపాతం అలికిడిలా
చల్లగాలి వీవెనలా మల్లెపూల గమకంలా  
ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెల
ఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా
నీ అనునయాల వయ్యారపు నెమలీకల జ్ఞాపకాలు
నీ కంటి చూపు కాంతులలలో ప్రసవించిన కావ్యాలూ
మాటా తేనె మధురిమలో సొమ్మసిలిన క్షణాలు
నిద్రనుండి లేచినట్టూ నిమ్నగలా సాగినట్టూ …..
ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెల
ఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా

You may also like...

Leave a Reply