ద్వైతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

చ్ఛ్వాస నిశ్వాసాల రోలర్ కోస్టర్‌లో

ద్వైతం కన్పడుతోంది స్పష్టంగా…

నాణానికి చెరోవైపు అతుక్కున్న

రెండు పార్శ్వాల్లా అదే ద్వైతం!

శల్య సారధ్యంలా జీవిత రధానికి

భార్యాభర్తలిద్దరూ ద్వైతమే.

ప్రేమ బండికి

పెళ్లనే రెండు జోడెద్దులు అవసరమే

అదే ద్వైతం మళ్ళీ.

అభినందించే కరతాళానికి

రెండు చేతుల్లా…

ముక్కు సూటిగా పోయే

గడియారపు చేతులూ చేతలూ

ద్వైత సూచకమే!

రిథమ్‌లో దాగున్న అందాన్నంతా

అలవోకగా ఒలకబోస్తూ

కాలగమనాన్ని అందంగా శాసించే

వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు

ద్వైత సమానమే….!

దేహాన్నంటి పెట్టుకున్న ఆత్మలా

దేహం, ఆత్మ–రెంటికి రెండూ

ద్వైతానికి నిత్యసూచనంగా….

చివరికి….

ప్రేమ పరిష్వంగానికి రెండు మనసుల

అవసరం ఉన్నట్టు…

అన్నీ ద్వైత గోచరమే.

ద్వైతమే ఈ విశ్వమానవ

ప్రేమతత్వానికి పునాది!!!

 

… వాసుదేవ్ (08-జూలై-2011)

You may also like...

Leave a Reply