కాపీ కొట్టుకోవడానికో సిన్మా కథ : పూర్తిగా ఫ్రీ !!!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

సినిమా తీయాలి అనుకుంటున్నారా?
అట్టే డబ్బులు పెట్టలేరా?
నటీనటులను కూడా afford చేసుకోలేరా ?
పెద్ద సెట్లూ , లొకేషన్లూ కష్టమా ?

అయితే…. ఇలాంటి ఒక కథ దొరికితే ?

ఈ కథలో..తెరపై కనిపించేది కేవలం ఒక వ్యక్తి. పాతికముప్ఫయ్యేళ్ళ వయస్సు మగవాని పాత్ర, అంతే!
తెరపై కనిపించక గొంతులో మాత్రమే పలికే పాత్రలు  ఐదోఆరో మీ ఇష్టం.

ఇక సెట్టింగు:
నాలుగు చెక్క ముక్కలు…కలిపి చేస్తే ఒక పెట్టె. కెమెరా కదలికల కోసం మీ ఇష్టం వచ్చినవి విడగొట్టుకోవచ్చు.
ఆ ఒక్క నటుడూ వేసుకున్న బట్టలు కాక

Props :
అగ్గిపెట్టె ( విత్ పుల్లలు ) , టార్చ్ లైట్ , వీడియో కెమెరా ఉన్న సెల్ ఫోన్ . కొన్ని చీమలు.

అంతే! ఇవి చాలు ఒక సినిమా తీయడానికి.

మరీ అన్యాయం..ఇంత తక్కువలో సినిమా ఎలా తీయొచ్చు ..కథాకమామీషు ఏమిటీ అంటారా?

కథ నేను ఇస్తున్నా…ఉచితంగా…

ఒక యువ పోలీస్ ఆఫీసర్ , కళ్ళు తెరచేసరికి తానొక పెట్టెలో ఉన్నానని తెలుసుకుంటాడు. మెల్లగా ఆ పెట్టెతో సహా నేలలో పాతిపెట్టబడ్డాను అని తెలుసుకుంటాడు. నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించడానికి వచ్చిన తనను ఇలా ఎవరు చేసారా అని అతను తనను ప్రశ్నించుకుంటుండగానే, అతని జేబులో ఒక సెల్‌ఫోన్ మోగుతుంది. అది అతనిది కాదు. ఆన్సర్ చేస్తే , అతడిని అలా పాతిపెట్టిన వ్యక్తి చెబుతాడు “ముఖ్యమంత్రి తప్పిపోతేనే వెతుక్కోలేని మీరు మమ్మల్ని ఏరివేద్దామని వస్తారా? చేతైతే నిన్ను కాపాడుకోమ్మని మీ డిపార్ట్‌మెంటుకు చెప్ప”మని.

తన సీనియర్స్‌కు ఫోన్ చేసి , తనను కాపాడమని ఆ పోలీసు అభ్యర్థనలు , అతనెక్కడున్నాడో చెప్పుకోలేని యంత్రాంగ వైఫల్యం , ఆఫ్ట్రాల్ అతనొక్కడి ప్రాణానికి ఫోర్స్‌ను ఎందుకు పణంగా పెట్టాలి అనే bureaucracy మధ్య అతను నలగిపోతూ, ఒకవైపు ప్రాణవాయివు అందక నిముషాల్లో చావుకు దగ్గరపడుతుంటే , తనను పాతిపెట్టిన వ్యక్తినే అభ్యర్థిస్తూ, జనం, ప్రభుత్వం, నక్సలిజం అంశాలలోని నిజాలు-అబద్ధాల గొడవల మధ్య అసలతను నక్సలైటే కాదని తెలియడం….ఇవన్నీ కలిసి…చివరికి అతనే మవుతాడు?

ఇదీ కథ!

చాలదా సినిమాకు?vనమ్మరా?

మూడువారాలు నేనూ, నా స్నేహితుడూ ఎంతో చర్చించుకుని చేయకుండా మానేసుకున్న , వదిలేసుకున్న కథ ఇది.

ఎందుకు వదిలేసుకున్నామో తెలుసా ?

కథ నేను వ్రాసినదే అయినా.. “పెట్టెలో పాతిపెట్టబడిన ఒక వ్యక్తి తన జీవితంకోసం వ్యవస్థతో చేసే యుద్ధం..”అనే మూలకథ/ కాన్సెప్ట్ / ఐడియా… ఓ సంవత్సరం క్రితం వచ్చిన స్పానిష్ చిత్రం “ BURIED” నుంచి ప్రేరణ పొందినది. నిజంగా ఈ కాన్సెప్టుతో అతను తొంభైనిముషాల చిత్రం తీసేసాడు. మేము ఆ సినిమా చూడలేదు. చూస్తే influence అవుతామని. కేవలం ఈ ట్రయిలర్ చూసి , వికీలో కథ చదివి ఉత్సాహపడిపోయాం.

అసలు కేవలం ఒక్క వ్యక్తితో అలా తీసేసాడు కదా ఆ దర్శకుడు , మనమూ ప్రయత్నిద్దాం అని , మన నేటివిటీకీ సరిపడేలా కథ వ్రాసుకున్నాం. ఎన్నో సన్నివేశాలు స్వంతంగా వ్రాసుకున్నాం. కానీ , ప్రతిక్షణం మనసులో ఏదో ఒక మూల ఒక ప్రశ్న – “మనం ఎంత చేసినా , ఎంత ప్రయత్నించినా ఈ basic idea కాపీ కొట్టినట్లే కదా. మనమేంటీ కాపీ కొట్టేంతగా దిగజార్చడమేమిటీ ?”. మాకు మేమే ఎన్నో సమాధానాలు చెప్పుకున్నాం – “అసలు ఈ వ్యక్తి ఒరిజినల్‍గా తీసాడు. kill bill2 లో ఈ సన్నివేశం నుంచి ప్రేరణ పొందలేదా ?


“అయిన కేవలం ఒక్క సన్నివేశం నుంచి ప్రేరణ పంది సినిమా తీసాడు అతను , మనం సినిమానే సినిమాగా మారుస్తున్నాం. ఇది ప్రేరణ కాదా? ” అనే ప్రశ్న అంతరాత్మను భలే ఇబ్బందిపెట్టింది. అంతలో నా కథ వ్రాసినకొద్దీ , “అరే..ఇది పూరీ జగన్నాధ్ తీసిన 143 సినిమాలోని క్లైమాక్స్‌లా లేదూ ” అనిపించింది. అంతలోనే.. కానీ ఆ క్లైమాక్స్ కూడా 2001లో మన లగాన్ చిత్రాన్ని తొక్కేసి ఆస్కారు తెచ్చుకున్న బోస్నియన్ చిత్రం NO MANS LAND నుంచి “కాపీ” కొట్టారుగా “మనవాళ్ళు” అనిపించింది.

అంతలోనే.. మనవాళ్ళు కాదు..అసలు మనం ఏ చిత్రాన్ని చూసి మనం ఇంత ఇన్స్పైర్ అయ్యామో ఆ BURIED చిత్రమే hitchcock చిత్రాలనుంచి అరువు తెచ్చుకున్న సన్నివేశాలతో , PHONE BOOTH, NO MAN’S LAND తరహా plot structureతో , KILL BILL2 సన్నివేశాన్ని వాడుకుని కలగూరగంపలా తయారు చేసినట్లు అనిపించింది. అక్కడితో ఆగామా ? అసలు ఇంతటి సింపుల్ ఐడియాతో ఇంతవరకూ ఎవ్వరూ షార్ట్ ఫిలిం అయినా తీలేదా అని కాస్త సర్చ్ చేస్తే…అబ్బో ఎన్ని బయటపడ్డాయో!!:

http://www.imdb.com/title/tt0534695/
http://www.imdb.com/title/tt0565985/

http://www.imdb.com/title/tt0879450/

http://www.imdb.com/title/tt0508674/

imdbలో buried alive అనే keywordతో చూస్తే కేవలం అమెరికన్ చిత్రాల్లోనే ఇన్ని కనిపించాయి. ఇక ఇంగ్లీషు కాక మిగతా భాషల సినిమాల్లో ఎన్ని ఉన్నాయో మరి.

బాబోయ్.. ఈ ప్రేరణలూ , కాపీలూ!! తిరిగి తిరిగి మొదటికే మోసం తెచ్చాయిగా.

ఇప్పుడు మన స్క్రిప్టుకు ప్రేరణ buried ,no man’s land, kill bill2 లో ఏదైనా కావొచ్చుగా.

అసలు , ఇంత పాతబడిన కాన్సెప్టును అతనెవరో స్పానిష్‍లో తీస్తే ఆహా ఓహో అని పొగుడుతారే , అదే మన తెలుగులోనో , ఇండియాలోన తీస్తే “కాపీ కాపీ” అని గోల చేస్తారేల అంటే …సినిమా అనేది కేవలం ఒక ఐడియా కాదు , ఆ ఐడియాను ఎలా develop, treatచేసి , మిగతా 24 craftsతో ఎలా “కొత్త”గా PRESENT చేసారు అనేదే చూసే సంస్కారం, బుద్ధీ అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు. ఇక్కడ ఎంతసేపైనా పక్కవాడు చేసిన పని ఏం పెద్ద గొప్పది కాదు, అదొక కాపీ అనేసి సంతోషిద్దామమే sadistic pleasure ఎక్కువ కనిపిస్తుంది మరి. 
ఇలా మాకు మేమే ఎన్నో విధాలుగా నచ్చజెప్పుకున్నా… చివరాఖర్లో ఎక్కడో ఏదో అసంతృప్తి.

“ఊహు లాభం లేదు. ఇంతగా సమాధానపరుచుకుని , ఎవడో స్పానిష్ వాడి చిత్రాన్ని చూసి మనం తీయడం ఏమిటీ ?! ఏదో ఒక రోజూ మనమే ఒక ఒరిజినల్ ఐడియాతో తీస్తాం. హాలీవుడ్ అయినా దాన్ని చూసి కాపీ కొట్టాల్సిందే “. అహంకారమో ఆత్మవిశ్వాసమో పొగరో మరి, అలాంటి ఆలోచనతో మా ప్రాజెక్టును పక్కన పెట్టేసాం.
కానీ…

లోపల్లోపల ఒక చిన్న సందేహం పుట్టింది.

ఇంకొన్ని నెలల్లో వేరే భాషలో ఎవరో ఈ సినిమా చూసి , మళయాళ్ళ మమ్ముట్టో , తమిళ ఎస్.జె.సూర్యో , హిందీలో సంజయ్ దత్‌(మొన్నీమధ్య ఇతనితో PHONE BOOTH సినిమాకు ఒక కాపీ చేసి అద్వానీక్కూడా చూపించారట బాలీవుడ్ ఘనులు) లాంటి వాళ్ళతో తీసి , ఓ అని తెగ మీసాలు మెలేసుకుని , అప్పుడు మనం మాత్రం అలా నోరెళ్ళబెట్టుకుని చూస్తూ.. ” ఛ , మన తెలుగువాళ్ళం వేస్టు” అని బాధపడిపోకుండా , అదేదో మనలోనే ఎవరో తీస్తే బెటర్ అనిపించింది.

అందుకే … వీలైనంతమంది ఔత్సాహిక తెలుగు సినీ దర్శకులు/నిర్మాతలకు ఇది అందితే బావుణ్ణని , ఇలా బహిరంగంగా నా aborted project ideaను ఇచ్చేస్తున్నాను. ఏ మాత్రం ఆసక్తి కలిగినవారైనా వెంటనే ఈ అవకాశాన్ని వినియోగపరుచుకోగలరని ఆశిస్తున్నాను.

ముఖ్య గమనిక : ఒక పరభాషా చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఇంకో సినిమా తీస్తున్నప్పుడు , మనం తీసే చిత్రం మనం ప్రేరణ పొందిన చిత్రం కంటే అద్భుతంగా ఉండాలి. లేకపోతే కాపీ/ప్రేరణ ఏ మాత్రం క్షమార్హం కాదు. దొంగల మధ్య కూడా ఒక నీతి ఉండాలి అన్నట్లు , కాపీ సినిమాల్లో అప్రచురితమైన నీతి ఇది.

You may also like...

Leave a Reply