సిటీ లైట్స్

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
 • ఐదేండ్ల పాప. చేతిలో కర్ర. కుక్కపిల్ల మీద ఒక్క దెబ్బ. కుయ్ కుయ్ . ఇంకో దెబ్బ. కుయ్య్ కుయ్య్ . మరోక దెబ్బ వెయ్యబోయి పట్టుతప్పి పడింది పిల్ల. “అయ్యయ్యో! దెబ్బ తగిలిందా బంగారూ!”. తల్లి లాలన. కుక్కపిల్ల మూలుగు background music.

 • సుడులు తిరుగుతూ వచ్చి పడింది newspaper. యుద్ధసన్నద్ధంగా నిలచున్న చీమల బారులా అక్షరాలు. పరుగెడుతున్న కళ్ళు.

“కాబోయే మొగుడ్ని చంపించిన అమ్మాయి”. వాహ్!

“ప్రియుడే హంతకుడు”. Good.

“హంతకులిద్దారూ Law final year students”. Excellent. Teriffic twist.

ఇంతకంటే గొప్పగా జీవితం తెల్లారదు.

 • తగ్గని ట్రాఫిక్. వెలగని పచ్చ లైటు. విసుగొచ్చిన రెండు చక్రాల వాహనం foot path దురాక్రమణ. ముసలతని శాపనార్ధం. వినేవాడెవడు?

 • సిటీ బస్సు లో ఆఖరి సీటు. భుజాన్ని మాటిమాటికీ ఢీ కొట్టుతున్న పక్క వాడి తల. నిద్రలేమినా ? నిద్ర కామినా?
 • న్యూస్ పేపరు ఖరీదు 3/-. వాటర్ బాటిల్ 20/-. ఇంతే జీవితం.
 • బస్సు కిటికీలో దూరిన కళ్ళు. పేద్ద షాపింగ్ మాల్. ఖరీదైన వస్తువులు. బైట అంతకంటే ఖరీదైన కార్లు. ఆ పక్కనే మౌనంగా శవయాత్ర. ఖరీదు కట్టే షరాబు పత్తా లేడు.

 • ఆకలి తీరిన ఆవు జాలి పడి వదిలేసిన సినీ పోస్టర్. సగం చెడ్డీ చూపిస్తూ లుంగీ ఎత్తిన గౌరవనీయ హీరో. తణుకులు కుట్టిన బ్రా తో కుమారి హీరోయిన్ భరతనాట్యం పోజు. టైటిల్ కనపట్టంలా. బతికిపోయాను.
 • స్నేహితునికి ఫోను.

All the lines dialed by you are busy. Please try after some time.

పిల్లితోకల్ని వదిలి తీగలవెంట ఎవరు పడ్డారబ్బా!!!

 • చీకటేళ, బస్టాండు చీకటి మూలలో తెగని బేరం. ఐదు నక్షత్రాలలో కూడా తెగని బేరం. వెన్నెలతో చంద్రునిక్కూడా బేరం తగల్లేదు.

 • అర్ధరాత్రి గడచిపోయాక ఎక్కడో గావు కేక. చటక్కున లేచి ఒళ్ళు తడుముకొని, కేక మనది కాదని తెలిసి మళ్ళీ నిద్రలోకి జారుడు. చావుకు మాత్రం ఆరోజు ఖాతా నిండింది.

 • మత్తు వీడని నిద్రమార్కుడు మళ్ళీ మంచం మీదకు పడ్డాడు. గొంతు దాకా దుప్పటి కప్పేసి మౌనంగా గురకెట్టాడు. బదులు దొరకని భేతాళ సమస్య మరో రోజుదాకా మంచం కిందే దాక్కోవాలి.

* * * * * *

You may also like...

Leave a Reply