చిటపటలు-12 “ఆరెస్సెస్ ఎద్దు”

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకుడు జనార్ధ ద్వివేదీ మీదకు చెప్పు తీసుకొని కొడతానని వెంటపడితే, అడ్డమైన ప్రతివాడికి కాంగ్రెసంటే చాలా లోకువయ్యిందని డిగ్గీరాజా ఆవేశపడ్డారు. మంత్రదండం మహిమతో అలా చేయించింది ఆరెస్సెస్సే అని కూడా కనిపెట్టేసారు. నిన్నటిదాకా, జనాలే చెప్పులు తీసుకొని కాంగ్రెసీయుల వెంటపడితే, ఇప్పుడు మేము సైతం అంటూ ఎద్దులు కూడా వెంటపడి వెనక్కాళ్లతో కొడుతున్నాయట. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓ పశువు చేతిలో.. సారీ సారీ పశువు కాళ్ళకు బలిపశువయ్యారు. ఇక, ఈ ఎద్దు వెనకాల (సారీ వెనకాల తన్నులు తింది మనోహర్ గారు కదా….) ముందు ఉన్నది ఆరెస్సెస్సే అని డిగ్గీరాజా కనిపెట్టటమే ఆలస్యం.

భా.జ.పా. వాళ్ళు ఆ ఎద్దును సత్కరించనున్నారని సమాచారం!


* * *

తెలంగాణాపై కాంగ్రెస్ పోషిస్తున్నది నాన్న పాత్ర అని కొత్త పి.సి.సి. ఛీఫ్ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు. ఇంతవరకూ పోషించిన అమ్మ పాత్రల నుంచి నాన్న పాత్రలకు కాంగ్రెస్ జంపింగ్ చేయటంలో మతలబు మనకు అర్ధమైతే డిగ్గీరాజాలు మంత్ర దండాలు దేనికి? ఒక్క తెలంగాణా ఏమిటి, దేశం మొత్తానికి ఇక కాంగ్రెస్ నాన్న పాత్రే పోషించబోతుందని ఇవ్వాళో రేపో డిగ్గీరాజా కూడా మంత్రదండం సహాయంతో తేల్చేస్తే గానీ డాడీ కోసం దేశం దిక్కులు చూడటం ఆపదేమో!

ఇంత చేసీ, దేశానికి కాబోయే నాన్న మాత్రం చొక్కా మడుస్తూ, సిగ్గుపడుతున్నారట… “చా! నాకింకా పెళ్ళే కాలేదు నాన్న అవ్వటమేమిటంటూ..

You may also like...

Leave a Reply