చిటపటలు-08 “మంత్రదండం”

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు చేతులూ ఆడుతున్నాయా అని అనుమానం. కాళ్ళూ చేతులూ కట్టేసి మిమ్మల్నేదో కుర్చీలో కుదేసారని లోకులు పలు కాకులై కావు కావుమంటున్నాయి మరి. ఇంతకి మంత్రదండం పది జనపథ్ లో ఉన్నదనైతే మీరు అన్యాపదేశంగా చెప్పటం లేదు కదా! ఏదేమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు సన్మానం చేయాల్సిందే.

* * *

మంత్రదండమంటే గుర్తొచ్చింది. అదేదో డిగ్గీరాజా దిగ్విజయ్ సింగ్ దగ్గర ఉన్నట్లుంది. మొన్న అన్నా హజారే, నిన్న రాందేవ్ బాబా, చివరికి నిన్నంటే నిన్న ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదిని చెప్పుతో కొడతానని బెదిరించిన వ్యక్తి వెనుక ఆరెస్సెస్స్ ఉందని పరిశోధనలో తేల్చేసారు. ఆ దండమేదో ప్రధానికి ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా డిగ్గీరాజా.

అయినా, జనాలు చెప్పులు పుచ్చుకొని కాంగ్రెస్ నాయకుల వెంటే ఎందుకు పడుతున్నారో! చిదంబరం, సురేష్ కల్మాడి తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా జనార్ధన్ ద్వివేదీ. రాంలీలా మైదాన్ లో లాఠీలతోను, తుపాకులతోనూ ఏదో సుతారంగా డిల్లీ పోలీసులు అదిలించారనే నెపంతో చెప్పుతో కొడతానని ఓ అనామకుడు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిని బెదిరించటం ఎంత అమానుషం… ఎంత అనాగరికం. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసారంటే చేయరు మరి. వాళ్ళేమైనా సామాన్య సన్యాసులా, సామాన్య ప్రజలా, బెదిరించగానే చీరలు సల్వార్ కమీజులు ధరించి పారిపోవటానికి.

* * *

పిచ్చోడిని పిచ్చోడంటే కోపం వస్తుందా రాదా! దొంగనైనా సరే దొంగ అంటే చిరాకు వేస్తుందా వేయదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రులని మోసగాళ్ళు అనేయటమేనా అన్నా హజారే సాబ్? కపిల్ సిబ్బల్ మనోభావాలు ఎంతలా గాయపడ్డాయో ఇప్పటికైనా మీకు అర్ధమయ్యిందా? మాట్లాడటం రాకపోతే డిగ్గీరాజా దగ్గరో, మనీష్ తివారి దగ్గరో నేర్చుకోండి. నోరు పారేసుకుంటే కాంగ్రెసోళ్ళు ఇక మీదట ఊరుకోరట. ఏరిపారేస్తారట!

 

* * *

You may also like...

Leave a Reply