విద్యా దీపము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
“చదువు”
చల్లని వెలుగుల
వెదజల్లే దీపము
విద్య నేర్చుకొనుట
మన ఎల్లరి కర్తవ్యము    ||
విద్య రత్న సోపానం
జ్ఞానం ఉన్నత గమ్యం
చదువు, శాంతి సారాంశం
ఆకళింపు చేసుకున్న
మనిషి జన్మ సార్ధకం    ||
అందుకనే మిత్రమా!
విద్య నేర్చుకొనుట
మన ఎల్లరి కర్తవ్యం     ||
అక్షరమ్ములు
విజ్ఞాన ద్వార తోరణ మాలికలు;
అక్షరమ్ముక్కైనా
తెలియకున్న మనిషి బ్రతుకు
అస్తావ్యస్తం అగు-
ఆస్కారం మెండు కదా! ||
అక్షరములు భావములకు
ఏర్పరచును ఆకారం
మంచి ఊసుల చదువు
శాంతి సౌభాగ్యముల నెలవు ||

You may also like...

Leave a Reply