బ్రహ్మానందం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
మనసుకు నచ్చితే ఆనందం
మనసు నొచ్చుకుంటే ఖేదం
ఒకనాటి ఖేదం ఒకనాడు ఆనందం
ఒకనాటి ఆనందం ఒకనాడు ఖేదం
 
ఖేదానందాలకు అతీతం జీవాత్మ
భేదాలూ భేషజాలు మనసుకే
మన మనసే మన మనుకుంటే
మన మనుగడ మొత్తం మోసం
 
వ్యధార్త కవితలు, వృధా ప్రయాసలు
గహన గీతాలాపనలు, గతిలేని యానాలు
ప్రతి జీవికి ఒక ఉత్కృష్టత ఉంది
పరమాత్మ చేసిన ఈ సృష్టిలో
 
మనకున్న దానిని తెలిసికొని
మనసు పొంగడం జరిగితే
మనకు కనిపించేదంతా మాయే!
మాయని తెలిస్తే మిగిలేది బ్రహ్మానందమే !!
IVNS Raju

IVNS Raju

HR and OD Professional with over 29 years of unique experience in leveraging the Ancient Wisdom for designing and implementing various systems and diagnostic processes.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *