అన్నా హజారే-అంటే బేజారే!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

“గురూ!”

 
“తెలిసిందేలే శిష్యా! అన్నా హజారే అనే యుపీయే సర్కార్ బేజార్ గురించేగా?”
 
 
“వారెవ్వా! ఏం దూరదృష్టి గురూ! “
 

“దురదృష్టం గాడిదలా తంతుంటే ముదనష్టులకు మిగిలేదేమిటి శిష్యా, ముష్టి దృష్టి కాక?”

 
“ఆహాహా! ఇదింకా రసవత్తరంగా ఉంది గురూ. శ్రీశ్రీ బ్రతికుంటే అనంతంలో మీకూ చోటునిచ్చేవాడు!”
 
“సానులున్న చోట, ఈ సన్నాసికి సీటొద్దులే శిష్యా! ఇంతకీ హజారే గురించి నీకూ బేజారేనా?”
 
“అబ్బెబ్బే! నహి నహీ! హజారే చేస్తున్నదానికి హుషారుగా ఉంది గురూ! మహామహిమాన్వితులు, మహామహోపాధ్యాయులు, మాటకారులు ఐన మీవంటి గురూత్తముల అభిప్రాయం కూడా వినిపోదామని వచ్చాను.”
 
 
“అవశ్యంగా విను శిష్యా!”
 
 
“గురూ! ఇంతకీ ఈ అవినీతి అంటే ఏమిటో వ్యాఖ్యానిస్తారా!”
 
 
“సృష్టి ఆదిలో…నీరు, చీకటి తప్ప మరింకేదీ ఉండేది కాదు. కొద్దికాలం తర్వాత మోనాటనీతో విసుగొచ్చిన దేవుడు సూర్యుడుని పుట్టించాడు. దాంతో నీటికి ఆవిరి, రెండుకాళ్ళ జంతువులకి నీడ ఏర్పడ్డాయి.”
 
 
“ఇంటరెస్టింగ్….తర్వాతేమైంది గురూ?”
 
 
“నీడను చూసుకుని, చూసుకుని మానసిక రోగాల్ని తెచ్చుకుంటున్న రెండుకాళ్ళ జంతువులకి నవ్వు నేర్పాడు. కానీ తోటి జంతువు సాటి జంతువును ఏడ్పించడం మొదలెట్టింది. పోనీలెమ్మని మాటనిచ్చాడు. ఇటు జంతువులు, అటు జంతువుల నాలుకల్ని తెగ్గోయడం మొదలెట్టాయి.  ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి “నీతి” అనే శక్తినిచ్చాడు. కొన్ని బలిష్ట ద్విపాద జంతువులకు అవి చెప్పేదే నీతల్లే అనిపించసాగింది. అదే అవినీతి.”
 
 
“అబ్బా! గొప్ప సృష్టి రహస్యాన్ని చెప్పారు! మీ స్టేట్మెంట్లకి ఆధారాలున్నాయా గురూ?”
 
 
“వినేవాడికి చెప్పేవాడు లోకువంటే ఇదే శిష్యా! అవినీతికి ఆధారాలున్నా చీమకుట్టని జాతికి చెందినవాడివే! నా మాటలకు ఆధారాలడుగుతావా? ఇది జాతిద్రోహం కాదా?”
 
 
“బాబోయ్! అలా వచ్చారా! మరి గురూ! మా జాతి ఎందుకిలా ఉంది?”
 
 
“సినిమాల్ని-వాటికి స్టార్లనీ, ఆటల్ని- వాటికి స్టార్లనీ, ఛానల్సుని-వాటికి స్టార్లనీ….ఇలా స్టార్ల క్రియేషన్లో బుర్రల స్టార్టర్లు చెడిపోయిన జాతికి కళ్ళు తప్ప నోరు, నాలుక, బుర్ర, గుండెకాయ ఎక్కడివి శిష్యా! అంతా మిథ్య! అంతా మాయ! అంతా భ్రాంతి! నేటి హైబ్రిడ్ సంస్కృతి నేతిబీరలో నేతిని సృష్టించగలదు. పరంతూ తన బుర్రలో నీతిని మాత్రం నిలుపుకోలేదు. అదే నీతి, అవే నీతి..వెరసి అవినీతి!”
 
 
“ఆహా! దివ్యోపదేశం, దివ్యోపదేశం. మరి….”
 
 
“అవునుమరి. నా నిత్యానందోపాసనకు టైమైంది. వెళ్ళిరా శిష్యా!”
 
 
“ఇంతటి దివ్యబోధ చేసిన మీరు కూడా ఇలా…!!”
 
 
“నన్ను స్టార్ సన్నాసిని  చేసిన శిష్యులదే ఈ తప్పు.”
 
“అంటే తెలిసీ చేసె పాపానికే అవినీతి అన్న మరోపేరా గురూ! ఈ పాపానికి నిష్కృతి లేదా?”
 
“లేకేం! ఉంటే హజారే ఉపవాసంలో ఉండాలి. ఛస్తే మన్మోహనుని గుండెలో చావాలి. ఇహ వెళ్ళు శిష్యా! వెర్రోహం!”
 
 

 

You may also like...

Leave a Reply