ఐనను పోయిరావలెయు హస్తినకు…

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

జగన్ ఇల్లు, హైదరాబాద్

“ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సందు మాటలు” అని పాడుతున్న జగన్ను ఆపి, “ఆహా…సందు మాటలు కాదు జగన్ బాబూ! సంధి మాటలు…సంధి…సం…ధి….” అని సరిచేసాడు అంబటి రాంబాబు.


“ఓకే, అచట సంధి మాటలు ఎట్లైనను. శత్రు బూజుల ఘనాగని సంపద చూడవచ్చు”

“అద్దీ! భలే! ఇప్పుడు మొత్తం పద్యం పాడండి జగన్ బాబూ!” అని ఎంకరేజ్ చేసాడు రాంబాబు.

గొంతు సవరించుకొన్న జగన్, కొంచెం ఎడుపు మొహం పెట్టి, చర్చిలో ఫాదర్లా చేతులు పైకెత్తి…

“ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సంధి మాటలెట్లైనను శత్రు బూజుల ఘనాగని సంపద చూడవచ్చు – మా మానసమందు గల్గు అవమానము తత్ ఓదార్పును, సమాధానమును – మాతయు, తాతయు, నేతలందరున్ న్ న్న్ న్ న్ – ఐనను పోయిరావలెయు హస్తినకు”


“అహా…” అని కన్నులు అరమోడ్పు చేసాడు అంబటి.

“రాంబాబూ! భలే పద్యం నేర్పించావు. ఏంటో ఈ పద్యం పాడేసరికి ఊపిరితిత్తుల్లో ధైర్యం గుర్రంలా పరుగెడ్తోంది.”

“జగన్ బాబూ! ధైర్యం గుండెలో ఉండాలి.” అన్నాడు రాంబాబు నసుగుతూ.

“వోకే! మరి సూట్ కేసులు రెడీనా!”

“కేసులన్నీ కోర్టులోనే ఉన్నాయ్ జగన్ బాబూ” అన్నాడు రాంబాబు విచారంగా.

“రాంబాబూ! నేనడుగుతున్నది సూట్ కేసుల గురించి.”

“ఓ! వోకే వోకే! ఆ కేసులైతే ఇంట్లోనే ఉన్నాయి. రెండు నిముషాల్లో ఇన్నోవాలో సర్దించేస్తాను. మీరు ప్రార్థనలు చేసుకోండి.”

 

********

ఢిలీ పట్టణం

“అమ్మా! అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా! ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా”

జగన్ ఇంటర్ కామ్ చేతిలోకి తీసుకుని “రావుగారూ! నా రూమ్ లో పాటలొద్దు.” అన్నాడు.

దానికి సమాధానంగా రావుగారనబడే ఏ.పి. భవన్ ఎంప్లాయీగారు “సార్! పాటల కంట్రోలు నా చేతిలో లేదు. అవి ఆటోమాటిగ్గా హైదరాబాద్ నుండి ప్రసారమౌతాయి. ప్లీజ్ కైండ్లీ ఫర్గివ్ మీ.” అని అతివినయంగా అన్నాడు.

మరో పాట మొదలైంది – “నాడు మొదలిడితివో..ఓ…ఓ…నాటికో ఈ నాటక సమాప్తి!”

“భగవంతుడా!” అని నిట్టూర్చి ఇంటర్ కామ్ పెట్టేసాడు జగన్.

 

********

 

ప్రధానమంత్రి కార్యాలయం

“జగన్ సార్! పీ.ఎమ్. సాబ్ బులారహే హై” అని చెప్పాడు దఫేదార్.

లోనికెళ్ళిన జగన్ కు షేక్ హ్యాండిచ్చి కుర్చీలో కూర్చోమన్నారు మన్మోహన్.

“సార్! మా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అమాయకులపైన జులుం పెరిగిపోతోంది. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.”

“అవును జగన్! పాపం పేద రైతులు చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మొన్న శరద్ పవార్ కూడా చెప్పారు.”

కొంచెం తత్తరపడిన జగన్ – “సార్! నిజమే! నిన్న శరద్ పవార్ గారిని కలిసి నేనే ఆ మాట చెప్పాను. దేముని పాలనలో సుఖానికి మరిగిన అమాయక ప్రజలు ఇప్పుడు హిట్లర్ పాలనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్లపైన దాడుల్ని చేస్తున్నారు. వరండా నుంచి టాయిలెట్ దాకా అన్నీ సోదా చేస్తున్నారు.”

“ఓహ్! ఇది చాలా దారుణం జగన్! అప్పుచేసి విత్తనాలు కొని, నాటిన తర్వాత యూరియా దొరక్క ఏపీ రైతులు ఇబ్బందుల పాలౌతున్నారు. వెరీ సాడ్!”

బిత్తరపోయిన జగన్ ఇక లాభం లేదని – “సార్! నేను నా గురించి మాట్లాడుతున్నాను. కొద్దిమంది రాజకీయ నాయకులు నాపైన, నా స్వర్గీయ తండ్రిపైనా దొంగముద్రలు వేస్తున్నాను. మీరు నాకు సహాయం చెయ్యాలి.”

“వెల్ జగన్! నాకు వేరే అపాయంట్మెంట్ ఉంది. సారీ టు కాలాఫ్ దిస్ మీటింగ్ నౌ!” అని లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చేసారు మన్మోహన్.

చేసేదేమీ లేక తనూ షేక్ హ్యాండిచ్చి బైటపడ్డాడు జగన్.

 

 

********

లాలూ ప్రసాద్ బంగ్లా

“హల్లో జగన్ భాయ్! కైసే హో తుమ్?” అని భుజం చరిచాడు లాలూ.

“లాలూ భాయ్! నా పరిస్థితి ఏమీ బాగోలేదు. గడ్డి స్కాములో మీ పొజిషన్ కన్నా గడ్డుగా ఉంది నా పొజిషన్. ఈ కష్టపరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో మీరు కొన్ని టిప్స్ ఇవ్వాలి.” అన్నాడు జగన్.

“దేఖో జగన్ భాయ్! నువ్వు మొదట చెయ్యాల్సిన పని రబ్డీదేవిని పెళ్ళి చేసుకొవడం.”

“భాయ్!?!”

పక్కనున్న లాల్చీ, చొక్కావాడు లాలూ చెవి వెంట్రుకల్ని ఎత్తిపట్టి లోన ఏదో ఊదాడు.

“హాహాహా!ఉల్లూ కా పట్టా! దేఖో జగన్ భాయ్! నువ్వు రబ్డీ దేవి లాంటి లేడీని పెళ్ళి చేసుకోవాలి.” అన్నాడు లాలూ.

“నాకాల్రెడీ పెళ్ళైపోయింది లాలూ భాయ్! కానీ నా వైఫ్ రబ్డీ దేవినా కాదా అన్నది తెలీదు. ఇదికాక ఇంకో టిప్ ఏదైనా ఇవ్వు.”

“వోకే! నీకు రబ్డీ లేదు. పోనీ పప్పూ యాదవైనా ఉన్నాడా?”

వాడెవడని అడగబోయి, ఏదో గుర్తొచ్చినవాడిలా ఆగిపోయాడు జగన్. నెమ్మదిగా గొంతు సరిచేసుకొని “పప్పూ..యాదవ్..మీ…”

“హాహాహా! సాలా!” అన్నాడు లాలూ జగన్ భుజాన్నీ మళ్ళీ తడుతూ.

సాలా అన్నందుకు కోపమొచ్చినా తమాయించుకొన్నాడు జగన్. మళ్ళీ “పప్పూ…” అన్నాడు.

“హాహాహా! మేరా సాలా. నీకూ అలాంటి సాలా ఉంటే చూడు.” అన్నాడు లాలూ.

“లాలూ భాయ్! నాకు సాలా ఉన్నాడు కానీ పప్పు లాంటి వాడు కాదు. హీ ఈజ్ వెరీ స్పిరిచువల్.” అన్నాడు జగన్.

“ఐతే ఇంకా మంచిది. నీ శత్రువులందర్నీ పిలిపించి సువార్త కూటమి పెట్టు. నీ బావ వాళ్ళని క్యూర్ చేస్తాడు. నా పప్పుగాడికి అలాంటి కళే ఉండుంటేనా…” అని చప్పరించాడు లాలూ.

మాట్లాడుతూ నడుస్తున్న లాలు తన ఇంట్లోనే కట్టుకొన్న చేపల చెరువు దగ్గరకొచ్చాడు. అక్కడున్న ఒక నౌకరు పెద్ద పళ్ళెం నిండుగా మరమరాలు తీసుకొచ్చాడు. రెండు దోసిళ్ళతో మరమరాలు తీసుకొని చెరువులోకి విసురుతూ “ఖావ్ మఛిలీ ఖావ్…బీజేపీకో హరావ్. ఖావ్ మఛిలీ ఖావ్…కాంగ్రేస్ కో డుబావ్. ఖావ్ మఛిలీ ఖావ్…కమ్యూనిస్టుకో జలావ్.” అని అరుపులు మొదలెట్టాడు.

లాలూ వెనకే వున్న లాల్చీ, చొక్కగాడు జగన్ భుజం మీద చెయ్యివేసి – “నిక్లో బాబూజీ. సాబ్ పూజా కర్ రహే హై. అభీ డిస్టర్బ్ కర్నా ఖతర్నాక్ హై.” అని గొగ్గిపళ్ళు కనబడేలా నవ్వాడు.

కర్చీఫుతో చెమట తుడుచుకుంటున్నట్టు నటిస్తూ నుదురు బాదుకున్నాడు జగన్.

 

********

బ్యాక్ టు హైదరబాద్

జగన్ వచ్చాడని తెలియగానే ఆత్రంగా పరుగెట్టుకొచ్చారు అంబటి రాంబాబు, కొండా సురేఖ.

“జగన్ బాబూ! పండా?” అన్నాడు రాంబాబు.

“చెప్పన్నా!” అంది సురేఖ.

గట్టిగా నుదురు కొట్టుకున్నాడు జగన్.

సురేఖ చీర చెరుగు నోటికడ్డం పెట్టుకొంటే, రాంబాబు కర్చీఫును అడ్డువేసుకొన్నాడు.

 

********

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *