ఆలు మగల మధ్య అలకలు మామూలే!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
పల్లవి:
 
కాపురము  యన్న కలతలు మామూలే!
అప్పుడప్పుడు గొడవ  ఉప్పెనలు మామూలే!                            || కాపురము ||
     
అనుపల్లవి:
 
ఆలు మగల మధ్య అలకలు మామూలే!
కలతలు తీరగ,  కలయుట మామూలే!                                       ||కాపురము ||
 
 1. చీటి మాటికి రచ్చ, చిటపటలు మామూలే,
  అడప దడప అలక అలజడి మామూలే!
  పడకలు వేరై, పంతాలు మామూలే!
  వేడి తగ్గినాక ఒద్దిక మామూలే!                                        ||కాపురము || 
   
 1. పెదవి బిగ బట్లు, విరుపులు మామూలే,
  ఎదలోన తాపము, ఎడబాట్లు మామూలే!
  మది లోన మధనలు, మమతలు మామూలే!
  వదలగా పంతము, ఒదుగుట మామూలే!                            ||కాపురము || 
   
 2. ఆలు మగల మధ్య అక్కరలు మామూలే,
  కలికి మగని మధ్య కోపాలు మామూలే!
  ౘలి లోన చెమటలు చిందుట మామూలే!
  ౘల్లబడి కలయగ చుంబనలు మామూలే!                            ||కాపురము || 
   
   
 3. అలమేలు మంగకు అలకలు మామూలే,
  చిలకల కొలికికి చీకాకు మామూలే!
  పలకరించగ పడతి పొంగుట మామూలే!
  ౘలపితి ఒడిలో చేరుట మామూలే!                                   ||కాపురము || 

You may also like...

Leave a Reply