ఆధ్యాత్మ రసరంజని – పద్మపురాణ ఆధారమైన ఆధ్యాత్మ కథనము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

కన్నడ మూలం : సి.హెచ్. రఘునాథాచార్యులు

తెలుగు అనువాదం : సి. రఘోత్తమ రావు

 

@@@@@

రైతు పొలంలో ఏ విధమైన విత్తనాలను వేస్తాడు ఆ రకమైన ఫలాన్నే పొందుతాడు. అలాగే, ఏ కర్మను ఈ జీవి చేస్తాడో దానికి తగిన ఫలాన్నే అనుభవించాలి. “ఎవరు పిల్లలు? ఎవరు స్నేహితులు? ఎవరు స్వజనులు? ఎవరు బంధువులు?” అన్నదాన్ని తెలిసుకొని సుఖదు:ఖాలను వదిలిపెట్టి శాంతతను పొందాలి.

మహాత్ములైన పండితులు తత్వజ్ఞానంతో ఇతర విషయాలలో అనవసరమైన చింతను తగిలించుకొని బాధపడరు. పంచభూతాత్మకమైన, కేవలం సంధి జర్జరమైన దేహాన్ని ఆత్మ మిత్రునిగా చేసుకొన్నాడు. ఆత్మ అనువాడు మహా పుణ్యవంతుడు. అన్ని చోట్లా ఉండేవాడు. అన్నింటినీ అర్థం చేసుకోగలవాడు. సర్వ సిద్ధి పొందినవాడు, సర్వాత్ముడు, సాత్వికుడు, సర్వ సిద్ధినీ ఇచ్చేవాడు, సర్వమయుడు, నిరంజనుడై ఒంటరిగా తిరుగేవాడు. ఇలా నిర్జనమైన వనంలో తిరుగాడుతూ ఉన్నప్పుడు పరాక్రమవంతులు, కాంతిమంతులు, బుద్ధివంతులు, పుణ్యాత్ములూ ఐన నలుగురు తమ మిత్రుడైన వాయువు (ఊపిరి)తో కూడి రావడాన్ని గమనించిన ఆత్మ “వీళ్ళు ఒకరితో ఒకరు ఏదో ఆలోచనలని చేస్తున్నారు” అని అనుకొని జ్ఞానం వైపు చూచి “వాళ్ళని చూడు ! నీవు నా మాట విని వారి వద్దకు వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకురా” అని అన్నాడు.

అప్పుడు జ్ఞానము “వాళ్ళతో నీకు ఏమి ప్రయోజనం ? వివరంగ నాకు చెప్పు. ” అని అడిగింది.

అప్పుడు ఆత్మ ” ఓ జ్ఞానమా ! ఆ ఐదు మందీ మహాప్రాజ్ఞులు, రూపవంతులు, మనస్వులు. నీవు దౌత్య కార్యంలో నిష్ణాతుడివి. అందువల్ల నేను చెప్పింది కొద్దిగా విని వారి వద్దకు వెళ్ళు. మాట్లాడించు” అన్నాడు.

అప్పుడు జ్ఞానము ” హే ఆత్మన్ ! నీవు కూడా నేను చెప్పేది విను. నేను నిజాన్ని చెబుతున్నాను. సత్యాన్ని తెలుపుతున్నాను. హే తండ్రీ ! వీరి సంబంధాన్ని ఎప్పటికీ నీవు చేయరాదు. మహామతివి, శుద్ధాత్మవు, మంచి కోర్కెలనే వ్యక్తపరచువాడివైన నీవు ఆ ఐదుగురి సంగతిని తెలుసుకున్నచో నీకు మోహం కమ్మగలదు” అన్నది.

ఆత్మ, “ఓ జ్ఞానమా ! నీవి వీరితో సంబంధం వద్దని ఎందుకు అడ్డుపడుతున్నావు? ఓ పండితుడా, దాని కారణాన్ని నిశ్చయంగా, యధార్థంగా చెప్పు” అన్నాడు.

జ్ఞానం, “వీరి సహవాస మాత్రం చేతనే మహత్తరమైన దు:ఖం కలుగుతుంది. ఆ ఐదుమందీ దు:ఖానికి మూల కారణాలు. శోకసంతాపకారులు. ఇది నిజం” అని పలికాడు.

“ఓ జ్ఞానమా ! అలాగే జరుగని. నీ మాటనే పాటిస్తాను.” అని పలికి, ఆత్మ ధ్యానముతో కూడెను.

అనంతరం ఆ ఐదుమందీ ఆత్మను చూసారు. వారు “బుద్ధి”ని పిలిచి “హే కల్యాణీ ! మేము ఆ ఆత్మతో సఖ్యం నెరపడానికి నీవు దౌత్యం నడుపు. నీవు ఆ ఆత్మ వద్దకు వెళ్ళి ఈ ప్రపంచాన్ని ఆధారమైనవారు, శుభప్రదకారకులూ, మహాత్ములూ ఐన పంచ తత్వాలు నీతో స్నేహం చేయడానికి కోరుతున్నారు అని చెప్పు. ఈ కార్యాన్ని నీవు ఇప్పుడే నెరవేర్చాలి” అని పలికారు.

దాని బుద్ధి, “పూజ్యులారా! అలాగే కానివ్వండి! ఈ ఉత్తమ కార్యాన్ని నేను నెరవేరుస్తాను” అని చెప్పి, ఆత్మ వైపుకు దారితీసింది. ఆత్మను చూచిన బుద్ధి “ఓ పూజనీయా! నేను బుద్ధిని. మహాత్ములైన పంచ తత్వాలూ నన్ను దూతిగా మీ వద్దకు పంపారు. వారి మాటలను మీరు ఆలకించండి. ఆ తేజస్సు మొదలైన ఐదుమంది తత్వాభిమానులు అక్షయమైన మీ స్నేహాన్ని కోరుతున్నారు. ఓ మహాప్రజ్ఞా, ప్రేమపూర్వకమైన స్నేహాన్ని వారితో మీరు చేయాలి. ఈ ధ్యానాన్ని విడవండి.” అని పలికింది.

దానికి ప్రతిగా జ్ఞానం ఇలా అనెను “ఓ ఆత్మా ! ఆ ఐదుమందితో నీవు ఎప్పటికీ స్నేహం చేయకూడదు. వీరి సంపర్కం వల్ల నీవు ఖచ్చితంగా దు:ఖపడతావు. నీవు నాకంటే తక్కువ జ్ఞానివి. నానంతో నీవు ఎలా కర్మలను చేయగలవు? అందువల్ల నా మాట విను. వీరితో స్నేహం చేయకు. నా మాట వినలేదంటే, ఓ మహాత్మా, నీకు గర్భవాసం సంభవిస్తుంది. నా మాటవినకుంటే జ్ఞానహీనుడివైన నీవు అజ్ఞానిగా మారిపోగలవు”. ఈ విధంగా ఆత్మకు బోధన చేసి, జ్ఞానము మౌనం వహించింది.

Products from Amazon.in

అప్పుడు ఆత్మ, తనను వెదుకుకుంటూ వచ్చిన బుద్ధిని చూచి “ఓ శోభనాంగి, మంగళాంగీ! ఈ ధ్యాన, జ్ఞానాలు నా మంగళ కాంక్షులు. నా యోగక్షేమాన్ని ఎప్పుడూ కోరేవారు. వీరిని వదిలి నేను రావడం మంచిది కాదు. కనుక ఓ బుద్ధీ! ఇప్పుడు నేనేమి చేయాలి?” అని పలికాడు.

అది విన్న బుద్ధి వెనుదిరిగి వెళ్ళి ఆ ఐదుమందికీ ఆత్మ యొక్క వివరాలను, ధ్యాన జ్ఞానాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించింది. అప్పుడు ఆ పంచతత్వాలు తామే ఆత్మ వద్దకు వెళ్ళి “మీతో ఎల్లప్పుడూ స్నేహాన్నికోరుకుంటున్నాము. ఓ లోకేశా! మీరు శుద్ధత్వముతో కూడి వుండడంవల్ల మేము మీ వద్దకు వచ్చాము. మీరే స్వంతంగా విచారణ చేసి మాకు సమాధానమివ్వండి” అని ప్రార్థించారు.

ఆత్మను – “మీరైదుమందీ స్వయంగా నా వద్దకు వచ్చారు. స్నేహాన్ని కోరుతున్నారు. ఐతే స్నేహాన్ని పెంపొందించే ముందు మీ గుణాలను, ప్రభావాన్ని వివరించండి” అని కోరాడు.

అప్పుడు భూమి, “సర్వ కార్యాలకూ నేను ముఖ్యస్థానాన్ని. చర్మ, మాంసాలతో కూడిన మూలభూత అస్తికలు ధృఢంగా ఉండడానికి, గోళ్ళతో కూడిన దేహ మధ్యభాగంలో నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నాసికా గమనముండే గంధము నా భృత్యుడు” అని పలికింది.

ఆకాశము – “నేను ఆకాశాన్ని. దేహం పై నా ప్రభావమేమిటన్నది నీకు చెబుతున్నాను, విను. లోపలా, బయటా వ్యాపింప అవకాశమున్నవాడినై శూన్య స్థానంలో నేను నివసిస్తాను. శ్రవణేంద్రియాలు నా సేవకులు” అని పలికాడు.

వాయువు – “నేను ఐదురూపాలతో, ఏ స్వరూపం కావలంటే ఆ స్వరూపం తో ఉంటాను. తదనంతరం ని:శ్వాసం లో ఉంటాను. కర్మకాయంలో స్థితుడనై ఉంటాను. శుభాశుభకర్మలను చేస్తాను. ఇది నా ఆత్మ గుణం. దేహంలో స్పర్శ గుణం కలవాడే నా మంత్రి.” అని పలికెను.

తేజస్సు – “సూర్యుని వలే దేహంలో నిత్యమూ నేను వెలుగుతుంటాను. లోపలా, బయటా ఉండే సర్వ ద్రవ్య, అద్రవ్య వస్తువులను, దుష్ట అదుష్ట పదార్థాలను కన్నుల ద్వారా చూపిస్తాను. రెండు కళ్ళు నా మంత్రులు. సేవకులు కూడా. వీరి వల్లనే నా రాజ్యము, ద్రవ్యమూ లభించేది. ఓ ఆత్మా ! ఇదే నా ప్రభావం ” అని అన్నాడు.

ఆప: (నీరు) – “శుక్ర (తేజస్సు), మజ్జ, లాలజలం , పల, చర్మ గ్రంథులలోని రక్తం, ఇవన్నీ కదలాడడానికి నేను ప్రేరణనిస్తాను. పగలు, రాత్రి దేహాన్ని అమృతం తో చక్కగా పోషణ చేస్తాను. ఇలా అతి ప్రాచీనమైన నా ప్రభావం ఈ దేహమనే పట్టణం లో చేస్తున్నాను. ఉత్తమమైన రుచులను గుర్తించే నాలుక నాకు భృత్యుడు” అని పలికెను.

ఆ తరువాత, పంచ తత్వాల సేవకులైన ముక్కు, చర్మము, కన్నులు, నాలుక మాట్లాడసాగినవి.

You may also like...

Leave a Reply