మోసకారి కాంగ్రెస్ – “పొంజీ” మతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

 


Original Author: Ravinar, MediaCrooks.com            Telugu Translation: C. Raghothama Rao

Read original article on MediaCrooks.com – Link >> Congress Religious Ponzi


ఇందిరాగాంధీ కాలం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రపంచ రాజకీయ పార్టీలలో కెల్లాఅవినీతిమయమైన పార్టీగా పేరుపొందింది. రాజీవ్ గాంధీ ఈ కుఖ్యాతికి మరికొంత మచ్చను చేర్చాడు.  ఇహ వీరందరి తలదన్నేట్టుగా సోనియా గాంధీ  ఆ పార్టీకున్న “అవినీతి పార్టీ” అన్న పేరుకు ముందు “అత్యంత” అన్న పదాన్ని చేర్చింది.  ఇదంతా అందరికీ తెలిసిన విషయమే! కానీ ఎక్కువగా తెలియని విషయం ఒకటుంది. అదే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చైనీస్ గాంధీలు చేసే “మతపరమైన అవినీతి.” ఈ నీతిమాలిన అవినీతిని తరతరాలుగా అటు చైనీస్ గాంధీలు, ఇటు వారి విధేయులైన మీడియావాళ్ళు బైట పడనీకుండా కాపాడుకువస్తున్నారు.

ఇప్పుడు ఈ నకిలీ గాంధీల వంశంలోనే అత్యంత ‘ఈబరి’గా పేరుపొందిన రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా ’ఎన్నుకో’బడ్డాడు. ఒక కుటుంబం తమ ఆస్తిగా ఒక ఫ్యాక్టరీని నడిపినట్టు నడిపించే కాంగ్రెస్ పార్టీలో ఈ ఎంపిక తంతు ఏమంత గమనించదగ్గ విషయం కాదు. కానీ ఇప్పటి వరకు తన జీవితంలో ఏమీ సాధించని వ్యక్తికి గొప్ప పదవిని కట్టబెట్టడం వెనుక అందరికీ తెలిసిన కారణాల కంటే తెలియని కారణాలు చాలా ఉన్నాయి.

ఇంతకాలం ప్రచారం చేసినట్టుగా, ఇందిరాగాంధీ ఒక పార్శీని పెళ్ళి చేసుకోలేదు. ఒక ముస్లిమ్‍ను  చేసుకుంది.  ఈ విషయంపై కుటుంబ విధేయులు వీరంగం చేస్తారనేది ఎరిగిన విషయమే. ఒకసారి లండన్‍లో జరిగిన పత్రికా సమావేశంలో “నేను పార్శీని” అని ప్రకటించాడు రాజీవ్ గాంధీ. అంటే, అతను ’హిందువు’ కాదు అని అర్థం. ఇతను రోమన్ కాథలిక్ అయిన సోనియాను పెళ్ళి చేసుకున్నాడు. ఈవిధంగా, రాజీవ్ గాంధీ పుట్టుకతో ముస్లిమ్ ఐనా అయివుండాలి లేదా మతమార్పిడి వల్ల క్రిస్టియన్ అయినా అయివుండాలి. కాబట్టి, రాజీవ్-సోనియా సంతానం సహజంగా ముస్లిమ్ లేక క్రిస్టియన్ మతస్థులవుతారు. అంతే తప్ప, వారు హిందువులుగా చెలామణి కావడం ఒక అభూతకల్పన మాత్రమే.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలకు వారి మరణానంతరం హిందూ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కానీ, వారు ’సెక్యులరిజమ్’ను పాటించేవారని ప్రజలకు చూపించడం కోసం ఇతర మతాల పెద్దలు కూడా వచ్చి ప్రార్థనలు జరిపారు. ఇలాంటి పబ్లిక్ అంత్యక్రియలు ఎన్నెన్నో భావాలను రేపుతాయి. నాటకీయతకు ప్రాణం పోస్తాయి. అంతే కాదు, రాజకీయ ప్రయోజనాల్ని కూడా అందిస్తాయి. ఇతర అన్ని సిక్యులర్ పార్టీల్లానే ఈ కుటుంబం కూడా భారతదేశాన్ని మతాల వారీగా, కులాల వారీగా చీలుస్తూ వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే, నకిలీ గాంధీల కుటుంబం ఇన్నేళ్ళుగా మతపరమైన “పొంజీ స్కీమ్”ను నడుపుతూ వచ్చింది.  (To know what is Ponzi Scheme – Read Wiki article)

ఈ కుటుంబం తమ అవసరాలకు, స్వార్థానికి తగ్గట్టుగా ఏ మతాన్నైనా స్వీకరించేస్తుంది.

ఆర్థిక నేరగాళ్ళను, పొంజీ ఆపరేటర్లను పిలచినట్టుగానే ఈ కుటుంబాన్ని కూడా “కుహనా మతస్థులు”గాను,  “డంబాచారపరులు”గాను పిలవక తప్పదు.  ఇందిరాగాంధీ ముదలు ఈ కుటుంబ సభ్యులెవరూ పుట్టుకతో హిందువులు కారు. కనీసం ఆచార వ్యవహారాలలో కానీ, సంబంధ బాంధవ్యాలలో కానీ వీరు హిందువులు కారు. ఇలా ’హిందూ’ ముసుగుతో వీరు చేస్తున్న మోసం రాహుల్ గాంధీ చర్యలతో కొత్త పుంతలు తొక్కుతోంది. మన దేశంలో ఈనాటి రాజకీయ నాయకుల్లో రాహుల్ గాంధీకి ’తెలివైన నాయకుడు’ అన్న గుర్తింపు ఏమాత్రం లేదు. చాలామంది ఇతన్ని ’పప్పూ’ అని పిలవడాన్ని పరిపాటిగా చేసుకున్నారు. ఇటువంటి వాడు, గుజరాత్ ఎన్నికల నేపధ్యంలో గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇది ఆ కుటుంబం పాటించే ’మతపరమైన పొంజీ’ స్కీమ్ తప్ప మరొకటి కాదు. ఈ ’టెంపుల్ రన్’ గుజరాతీయులను మభ్యపెట్టడానికి చేసే పని తప్ప వేరొకటి కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ లో హిందూ జనసంఖ్య కొద్దిగా ఎక్కువే. గుజరాతీ హిందువులు సహజంగా సంప్రదాయస్తులు. హిందూ ఆచారాలను తూచ తప్పక పాటించేవాళ్ళు. ఈ ’హిందూ’ భావనని తన జేబులో వేసుకోవాలన్న ఆశతో రాహుల్ గాంధీ ’శివభక్తు’నిగా చెప్పుకుంటున్నాడు. గుళ్ళుగోపురాలు తిరుగుతున్నాడు. రాహుల్ వీరవిధేయుడైన కపిల్ సిబాల్ “రాహుల్ ప్రతిరోజూ ఫలానా గుడికి తప్పక వెళతాడు” అని దరువు వేసాడు.

గతవారం వరకూ వచ్చిన వార్తా కథనాల ప్రకారం రాహుల్ సుమారు పదకొండో లేక ఇరవైరెండో గుడులను చుట్టేసి వచ్చాడు. ఇవన్నీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ రాష్ట్రంలోని గుడులే! అయితే, గుడుల సంఖ్య ముఖ్యం కాదు. ఒక హిందువుగా నేను (mediacrooks.com author) ఇన్ని గుడులను గత ఐదు సంవత్సరాలలో కూడా దర్శించలేదు. ఒక హిందువుకు ఇన్ని గుడులను తప్పకుండా చూసి తీరాలనే నియమం కూడా లేదు. ఎవరి ఇచ్ఛకొద్దీ వాళ్ళు ఆలయాలకు వెళతారు. ఎవరూ తొయ్యాల్సిన పని లేకుండా, స్వయంప్రేరితులై వెళతారు.

పైనున్న ఫోటోలో మీ కుడివైపునున్న చిత్రాన్ని చూడండి. అది సోమనాథ దేవాలయంలోకి మెడలో పూలమాలతో ప్రవేశిస్తున్న రాహుల్ గాంధీ ఫోటో. గర్భగుడికి వెళ్ళేప్పుడు ఏ తింగరి మెడలో మాలతో వెళతాడో మీరే ఆలోచించుకోండి? ఇది ఖచ్చితంగా పొంజీ మతస్థుడు చేసే పనులే!

ఒకవేళ ఎవరైనా విఐపి గుడిని దర్శించడానికి వస్తే, విఐపి కనుక ఎవరైనా మెళ్ళో పూలమాల వేసారే అనుకుందాం! అయినా గర్భగుడిలోకి ఆ దండతో అలానే వెళతారా? కానీ, రాహుల్ వెళతాడు. ఎందుకంటే అతనికి భారతదేశ సంప్రదాయాలు తెలియవు. అతనొక ఫేక్ హిందూ!

పున్నమకో, అమావాస్యకో ఒకసారి పూజలు చేసే ఏ హిందువు కూడా రాహుల్ కూర్చున్న భంగిమలో కూర్చోడు. పూజలు చేసేప్పుడు ఎలా ఉండాలో పెద్దల నుంచి, గుళ్ళకు వెళ్ళడం ద్వారా తెలుసుకోవచ్చు.  కానీ ఇవేవీ పట్టని రాహుల్ నమాజ్ చేసేప్పుడు కూర్చునే భంగిమలో కూర్చుని హోమం చూస్తున్నాడు. అతని తల్లి సోనియా కూడా ఎంత ఇబ్బందిగా కూర్చుందో గమనించండి.

ఎందుకీ వక్ర విన్యాసాలు? హాయిగా ముస్లిమ్ గానో, క్రిస్టియన్ గానో ఉంటే బావుండేది కదా! కాస్తంత గౌరవప్రదంగా కూడా ఉండేది కదా!

వీటిల్ని బట్టి తెలిసేది ఏమిటంటే, ఈ కుహనా సెక్యులర్ వాదులకు హిందూత్వం గానీ, భక్తి గానీ, నమ్మకంగానీ ఏ కోశానా లేదు. చర్చ్ పేరు చెప్పుకొని అక్రమంగా డబ్బులు దండుకునే ఫాదర్‍ను చర్చ్ క్షమించదు. పైగా శిక్షిస్తుంది.  దొంగ హిందూత్వాన్ని ప్రదర్శిస్తూ ఓట్లు “దండుకో” చూసే మోసగాళ్ళను కూడా అలానే శిక్షించాలి. ఓట్ల కోసం ముస్లిమ్ వేషాలను, క్రిస్టియన్ ముసుగులను ధరించే వాళ్ళను కూడా ఈ గాటనే కట్టేయాలి.

ఇటు చూడండి!

ఓట్ల కోసం హిందూ వేషం వేసే రాహుల్, ఆ ఓట్ల కోసమే దళితుల ఇంటో తింటూ ఫోటోలు తీయుంచుకుంటాడు. ఆ ఓట్ల కోసమే ముస్లిమ్ వేషం వేస్తాడు. కానీ బ్యాంకుల్ని ముంచేసిన విజయ్ మాల్యాకు ఏ మాత్రం తగ్గకుండా ’బిజినెస్ క్లాస్’లో ప్రయాణిస్తాడు. ఇదే అతని అసలు అవతారం. మోసగాడి అవతారం.

ఇతను చేసేదంతా ఇంతే – ఎలెక్షన్ల సీజన్ లో రకరకాల వేషాలు వేస్తూ దేశమంతా తిరగడం. సీజన్ ముగిసిపోగానే మూటాముల్లె సర్దేసుకుని ’బిజినెస్ క్లాస్’లో విదేశాలకు చెక్కేయడం. “రాజాబాబూ” అన్న హిందీ సినిమాలోని గోవిందా క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఈ రాహుల్.

ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నిబద్ధతను రాహుల్ లో చూడలేం. అతని పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు విదేశాల్లో తిరుగుతూ కనబడ్డాడు. 26/11 ముంబై దాడులు జరుగుతున్నప్పుడు విందువినోదాల్లో కాలం గడుపుతూ దొరికిపోయాడు. అర్థంపర్థంలేని మాటలు తప్పించి, ఆలోచనల్ని రేకెత్తించే ప్రసంగాలు చేయడం ఇతనికి రాదు. నిజానికి, రాహుల్ సభలు కామెడీ షోలుగాను, మాట్లాడే మాటలు జోకులుగానూ భావిస్తున్నారు భారత ప్రజలు. అయినా సరే, రాహుల్ వేస్తున్న పొంజీ స్కీములు అలా అలా సాగిపోతూనే ఉన్నాయి.

మొదటి ఫోటో చూడండి. ఏ హిందువు కూడా పెద్దల వద్ద తలవంచకుండా ఆశీర్వాదం పొందడు. అందులోనూ ఆశీర్వదిస్తున్న పెద్ద తన కంటే పొట్టిగా ఉన్నప్పుడు వారి ఎత్తుకు తగ్గట్టుగా తలవంచడం సహజం. కానీ రాహుల్ ఎలా నిలబడ్డాడో చూడండి. ఇహ రెండో ఫోటో – కనుమరోజు ఎద్దుల కొమ్ములకు పూలు చుట్టినట్టుగా నెత్తి నిండుగా పూలదండలు వేసుకోవడం హాస్యాస్పదం. చివరి ఫోటోలో ఎవరో కాంగీ వీరాభిమానులు రాహుల్ పేరు ముందు “పండిత్” ను చేర్చారు. నిజానికి రాహుల్‍ను “పిడిత్” అనే పిలవాలి. ఎందుకంటే, ట్విట్టర్ లో తన తరఫున ట్వీట్ చేసేది ’పిడి’ అనే తన పెంపుడు కుక్క అని అతనే చెప్పుకున్నాడు.

రాహుల్ & కో అర్థం చేసుకోని విషయం ఏమిటంటే, నెహ్రూ-ఇందిరాల కాలంలో మాదిరిగానే ఈనాటి భారతీయుల్ని కూడా నిలువునా మోసం చేసేయొచ్చు అని భ్రమపడడం. నెహ్రూ-ఇందిరాల కాలంలో కాక ఈనాడు ప్రజలు చక్కగా కనెక్ట్ అయివున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ఆ సమాచారం వాళ్ళకు చేరిపోతోంది. కనుక నెహ్రూ-ఇందిరాల్లా ప్రజల్ని మభ్యపెట్టడం అంత సులభం కాదు.

కాంగ్రేస్ “పొంజీ స్కీమ్”లో అత్యంత దౌర్భాగ్యపు ఘట్టం – సుప్రీం కోర్టులో జరిగిన రామమందిరం విచారణ. కాంగ్రేస్ బానిస అయిన కపిల్ సిబాల్ ’రామ మందిరం’ విచారణను 2019 జులై నెల దాకా వాయిదా వేయాలని వాదించాడు. ఒకవేళ కపిల్ కాంగ్రెస్ పార్టీవాడిగా కాకుండా సున్నీ వక్ఫ్ బోర్డ్ న్యాయవాదిగా వాదించివుంటే 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాతే విచారణ చేయాలని ఎందుకు కోరాడు? ఈ ప్రశ్నే కాక మిగతా ఎన్నో ప్రశ్నలకు కాంగ్రెస్ “పొంజీ స్కీమ్” నిర్వాహకులు జవాబులివ్వాల్సిన అవసరం ఉంది.

2019 దాకా రామజన్మభూమి విచారణ వాయిదా పడాలని కోరడానికి సునీ వక్ఫ్ బోర్డ్ ఒక రాజకీయ పార్టీ కాదు. ఈ వివాదంలో వచ్చే సుప్రీమ్ కోర్ట్ తీర్మానం వల్ల 2019 ఎన్నికల్లో వక్ఫ్ బోర్డ్ కు జరిగే నష్టాలు ఏవీ లేవు! అలా దెబ్బ తినే పార్టీలు ఏవైనా వుంటే అవి దొంగ సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్టులు మాత్రమే. ఇప్పటి దాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినవి ఈ పార్టీలే. ఇప్పుడే కాదు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ ఓడిపోవడం ఖచ్చితం. రామజన్మభూమి హిందువులకు దక్కినా దక్కకపోయినా ఇది జరగడం ఖాయం. ఒకవేళ 2019లోపు రామమందిరం వివాదం ముగిసిపోయి, హిందువులకు అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు వీరి అడ్రస్సులు గల్లంతవడం గ్యారెంటీ. కపిల్ సిబాల్ వాదనలోని డొల్లతనాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్ సభ్యుడయిన హాజీ మెహబూబ్ బయటపెట్టాడు. వక్ఫ్ బోర్డ్ కూడా సుప్రీం కోర్ట్ తీర్పు త్వరగా రావాలని కోరుకొంటోందని, దానికి వ్యతిరేకంగా కపిల్ సిబాల్ వాదించడం తప్పని అతను చెప్పాడు. కపిల్ సిబాల్ వెనుక సోనియా, రాహుల్ ఉన్నారనడం సందేహం లేదు. కనుకనే ఈ “పొంజీ స్కీమ్ ఆపరేటర్ల”ను చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. అదే డిసెంబర్ 5 తారీకున, కొద్దిమంది కమ్యూనిస్ట్ బుద్ధిహీనులు సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ వేసారు. వాళ్ళ ప్రకారం సుప్రీం కోర్ట్ అయోధ్య వివాదాన్ని విచారించకూడదు. ఈ మతిలేని పిటీషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్రే.

పై కనబడుతున్న ముప్పై మంది మూర్ఖులలో తీస్తా, అపర్ణా సేన్, కాంగ్రెస్ బానిసలు కుమార్ కేత్కర్, అరుణా రాయ్, మేధా పాట్కర్ మొదలైన వాళ్ళున్నారు.  వీళ్ళు సుప్రీం కోర్టునే నియంత్రించే స్థాయికి వెళ్ళిపోయామని భ్రమిస్తున్నారు. వీరి అడ్డగోలు వాదనల్ని ప్రజలు నమ్మేస్తారని విర్రవీగుతున్నారు. అది ఒకప్పటి మాటేమో గానీ ఇప్పుడు మాత్రం వీరి చేష్టల్ని మెచ్చుకునే వాదు లేనే లేరు. ఇప్పుడు ప్రజల ఆలోచనల్ని హిందూ వ్యతిరేక శక్తులు గానీ, కాంగ్రెస్ గానీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ కుహనా పార్టీలు, దేశ వ్యతిరేక శక్తులు రామమందిరాన్ని చూసి భయపడ్డం లేదు….దగ్గరవుతున్న తమ రాజకీయ అస్తిత్వపు చావును చూసి కుదేలవుతున్నారు. పై పేర్లలో కొన్ని క్రిస్టియన్‍వి ఉన్నాయి. హిందూ-ముస్లిమ్ సమస్య అయిన రామమందిర వివాదంలో క్రిస్టియన్ కోణమే లేదు. అయినా సరే, జాన్ దయాళ్ వంటి రోమన్ క్యాథలిక్కులు తలదూరుస్తున్నారు.

వీటన్నిటి వల్లా స్పష్టమయ్యేది ఇంతే – సోనియా, రాహుల్ నడుపుతున్న “పొంజీ స్కీమ్” ఇప్పుడు మతం రంగు పులుముకుంది.

దీన్ని పక్కన బెట్టి, మొదటి పేరాలో అడిగిన ప్రశ్నను మరొక్క సారి చూద్దాం. “పరమ ఈబరి ఐన రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం ఎందుకు జరిగింది?” NewsX ఛానెల్ వారి ఈ వీడియోలో పై ప్రశ్నకు సంబంధించి కొద్దిగా సమాధానం దొరుకుతుంది. కాంగ్రెస్ కు చెందిన అహమ్మద్ పటేల్ ను గుజరాత్ సి.ఎమ్. చెయ్యాలని పాకిస్తాన్ పడుతున్న తాపత్రయాన్ని ఈ వీడియో బైటపెడుతోంది. చూడండి…

 

 

కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలుసుకోవాడానికి ఇది ఒక చిన్న ఆధారం మాత్రమే. కాంగ్రెస్ ను నడిపిస్తున్నది ఆ పార్టీ సభ్యులు కారు, ఎలెక్షన్లు కావు, ఓపెన్ పోటీలు కావు – విదేశీ శక్తులు.

పాకిస్తాన్, దాని ISI, చైనా, రష్యా, అమెరికాకు చెందిన CIA…ఇంకా చెప్పాలంటే వాటికన్ చర్చ్ – ఇవన్నీ కాంగ్రెస్‍ను నడిపిస్తున్న విదేశీ శక్తులు. కాంగ్రెస్ లోపల జరిగే అన్నింటి వెనుకా ఈ శక్తుల ప్రమేయం ఉంటుంది.  ఇందిరా-రాజీవ్ గాంధీల హయాంలో కాంగ్రెస్ పార్టీకి నిధుల్ని అందించింది రష్యానే. తన రాజకీయ ప్రత్యర్థుల్ని చంపేయడానికి పాకిస్తాన్ లోని తీవ్రవాదుల సహాయం కోరడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. ఇది ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన విషయం. మొఘల్ జమానాలో చక్రవర్తి వారసుణ్ణి ఎన్నుకోవడానికి ఎన్నికలుండేవి కావని మణిశంకర్ అయ్యర్ చెప్పింది అక్షరాల నిజం. ఇలా చెప్పగానే వచ్చిపడ్డ తిట్లను చూసి, అయ్యరు మాట మార్చాడు. “పార్టీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ పడొచ్చు!” అని బుకాయించాడు. అప్పటికే ప్రజలకు తెలియాల్సిన నిజం తెలిసిపోయింది.

రాహుల్ కు ఔరంగజేబ్ కు పెద్ద తేడాలేదు. అలానే రాహుల్ కు తుగ్లక్‍కు కూడా తేడా లేదు. (రాహుల్ ఇల్లు తుగ్లక్ లేన్‍లోనే ఉంది మరి!). రాహుల్ మొఘల్ రాజు లాంటి వాడు కనుక అతనికి బహదూర్ షా కు పట్టిన గతే పడుతుందని అనుకోవచ్చు.

మోడీ లాంటి వ్యక్తిపై విదేశీ శక్తుల ప్రభావం లేనే లేదు. అందుకే అవి రాహుల్ గాంధీ వంటి బుద్ధిహీన, బలహీన, ’ఈబరి’ వ్యక్తిని ప్రధానమంత్రి చేయాలని తహతహలాడుతున్నాయి. ఏనాటికైనా ఈ వ్యక్తి పి.ఎమ్. అవగలడని అవి ఆశ పడుతున్నాయి. అలా జరిగితే, తమ తమ స్వార్థప్రయోజనాల్ని, సోనియా నడిపిన యూపిఏ హయాంలోలా, మళ్ళీ నడుపుకోవచ్చని ఈ శక్తుల పన్నాగం. మతమార్పిడి ముఠాలకు కూడా చేతి నిండా పని.

మనం తీసుకునే ఒక్కొక్క సెల్ఫీ చైనాలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తుందని ప్రగల్భాలు పలికే రాహుల్ దొంగతనంగా చైనావాళ్ళను కలుస్తాడు. రహస్యంగా వారిని వేడుకుంటాడు. ఏం అడుక్కున్నాడో తెలియకుండా జాగ్రత్త పడతాడు. ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరిన కాంగ్రెస్ వాళ్ళు దేశ క్షేమాన్ని కోరుతారని ఆశపడడం మూర్ఖత్వం.  తమ కుహనా సెక్యులరిజమ్ విఫలమైన ప్రతిసారీ “మతపరమైన మోసాలకు” దిగడం ఈ కాంగ్రెసీయులకు అలవాటే. గుజరాత్ ఎన్నికల్లో దొంగ సెక్యులరిజమ్ పని చేయదని తెలిసే రాహుల్ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అన్నింటినీ గమనిస్తున్న గుజరాతీయులు కాంగ్రెస్ చెంపను ఛెళ్ళుమనిపించడం ఖాయం. త్వరలో సుప్రీం కోర్ట్ ఇవ్వబోయే తీర్పు మోసకారి కాంగ్రెస్ మట్టిబుర్రపై ఆ దేవుడే కొట్టే జెల్లకాయ కావడం కూడా తథ్యం.

@@@@@

Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply